Post Office Jobs
Post Office Jobs: పోస్ట్ ఆఫీసుల్లో 257 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు.
ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా ఉన్న పోస్ట్ ఆఫీసుల్లో ఖాళీల (Post Office Jobs) భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది. స్పోర్ట్స్ కోటాలో కూడా పోస్టుల్ని (Sports Quota Jobs) భర్తీ చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో స్పోర్ట్స్ కోటాలో 75 పోస్టుల్ని భర్తీ చేసేందుకు దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక మహారాష్ట్రలో కూడా స్పోర్ట్స్ కోటాలో 257 పోస్టుల్ని భర్తీ చేస్తోంది. పోస్ట్ మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, సార్టింగ్ అసిస్టెంట్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. దరఖాస్తు చేయడానికి 2021 నవంబర్ 27 చివరి తేదీ. నోటిఫికేషన్‌లో వెల్లడించిన క్రీడల్లో రాణించినవారు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
India Post Recruitment 2021: ఖాళీల వివరాలు
మొత్తం ఖాళీలు257
- పోస్టల్ అసిస్టెంట్93
- సార్టింగ్ అసిస్టెంట్9
- పోస్ట్‌మ్యాన్113
- మల్టీ టాస్కింగ్ స్టాఫ్42
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 నవంబర్ 27 సాయంత్రం 6 గంటలు
విద్యార్హతలు- టెన్త్, ఇంటర్మీడియట్, డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేయొచ్చు. స్థానిక భాష తెలిసి ఉండాలి.
క్రీడార్హతలు- నోటిఫికేషన్‌లో వెల్లడించిన పలు క్రీడల్లో రాణించినవారు అప్లై చేయాలి. జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని ఉండాలి.
వయస్సు- పోస్ట్‌మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్‌కు 18 నుంచి 27 ఏళ్లు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు 18 నుంచి 25 ఏళ్లు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
వేతనం- పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్‌కు రూ.25,500 బేసిక్ వేతనంతో మొత్తం రూ.81,000, పోస్ట్‌మ్యాన్‌కు రూ.21,700 బేసిక్ వేతనంతో మొత్తం రూ.69,100, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టుకు రూ.18,000 బేసిక్ వేతనంతో మొత్తం రూ.56,900 వేతనం లభిస్తుంది.
అప్లై చేయు విధానం
- Step 1- అభ్యర్థులు https://dopsportsrecruitment.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
- Step 2- మొదటి స్టేజ్‌లో పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
- Step 3- రెండో స్టేజ్‌లో రూ.200 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. మహిళలు, ట్రాన్స్‌జెండర్ వుమెన్, ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు ఫీజు లేదు.
- Step 4- మూడో స్టేజ్‌లో ఫోటో, సంతకం, మార్క్స్ మెమో లాంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి.
0 Response to "Post Office Jobs"
Post a Comment