Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Aadhaar card 'model' ..! Around the world ...!

ఆధార్‌ కార్డు’ మోడల్‌..! ప్రపంచ వ్యాప్తంగా...!

Aadhaar card 'model' ..!  Around the world ...!


UIDAI To Work With World Bank UN To Globalise Aadhaar Model: యుఐడీఏఐ రూపొందించిన ఆధార్‌ కార్డు మరో అరుదైన ఘనతను సొంతం చేసుకోనుంది. అంతర్జాతీయ గుర్తింపు ప్రమాణాలను అభివృద్ధి చేసేందుకుగాను ఆధార్‌ కార్డు లాంటి మోడల్‌ను ప్రపంచ బ్యాంక్,  ఐక్యరాజ్యసమితితో కలిసి యూఐడీఏఐ పనిచేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే యూఐడీఏఐ యూనివర్సల్‌ గ్లోబల్‌ ఐడెంటిటీ సిస్టమ్‌పై చురుగ్గా పనిచేస్తోందని సంస్థ పేర్కొంది.

ఆధార్‌పై ఇతర దేశాలు ఆసక్తి..!

ఆసియా దేశాలతో పాటుగా, ఇతర దేశాలు కూడా ఆధార్ మోడల్‌ గురించి తెలుసుకున్నాయని యూఐడీఏఐ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సౌరభ్ గార్గ్ అన్నారు.కొన్ని దేశాలు ఇప్పటికే సంస్థ ఉపయోగించిన మోడల్‌ అనుసరించినట్లు తెలిపారు. ఆధార్‌లాంటి మోడల్‌పై ఆసక్తి కనబరుస్తున్నాయని సౌరభ్‌ వెల్లడించారు. పేమెంట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించిన డిజిటల్ మనీ కాన్ఫరెన్స్‌లో సౌరభ్‌ గార్గ్‌ ప్రసంగిస్తూ...ఆధార్ ఆర్కిటెక్చర్‌ను ప్రతిబింబించేలా ప్రపంచ దేశాలు ఆసక్తి చూపుతున్నాయని అన్నారు. దేశ జనాభాలో 99.5 శాతం మందికి ఆధార్ కార్డు ఉందని తెలిపారు. పలు ఆర్థిక సేవలకు ఆధార్‌ కీలక అంశం పనిచేస్తోందని అభిప్రాయపడ్డారు. దాంతోపాటుగా భద్రతా ముప్పు సమస్యపై కూడా చర్చించారు. ఆధార్ డిజైన్‌ అనేది అంతర్నిర్మిత గోప్యతతో కూడిన ఆర్కిటెక్చర్. యూఐడీఏఐ సమ్మతి ద్వారా మాత్రమే ఆధార్‌ను ఉపయోగించడానికి అనుమతిస్తామని అన్నారు. అంతేకాకుండా భద్రత విషయంలో ఏలాంటి రాజీ ఉండదని పేర్కొన్నారు.  ఆధార్‌ డేటా సిస్టమ్ భద్రత చాలా ముఖ్యమైనదని గార్గ్ చెప్పారు. 

ఇట్టే పసిగడతాయి..!

ఆధార్ డేటా సెంటర్లు సమాచారాన్ని వేరుగా ఉంచుతాయని, సురక్షితమైన స్నేహపూర్వక యంత్రాంగాల ద్వారా మాత్రమే ఆధార్‌ను యాక్సెస్‌ అవుతుంది. 24X7 పాటు నడిచే యూఐడీఏఐ సెక్యూరిటీ కేంద్రాల సహాయంతో ఏమి జరుగుతుందనే విషయాన్ని ఇట్టే పసిగడతాయి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Aadhaar card 'model' ..! Around the world ...!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0