AIIMS Jobs
AIIMS Jobs : ఎయిమ్స్‌లో 118 ఉద్యోగాలు.వేతనం రూ.1,42,506.. అప్లికేషన్ ప్రాసెస్ వివరాలు.
AIIMS Recruitment 2021: ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences), రాయ్‌బరేలీలో పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదలైంది. ఈ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు 1,42,506 వేతనం అందించనున్నారు. ఈ పోస్టుల దరఖాస్తుకు జనవరి 10, 2022 వరకు అవకాశం ఉంది.
మొత్తం పోస్టులు : 118
ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(All India Institute of Medical Sciences), రాయ్‌బరేలీలో పలు ఉద్యోగా భర్తీకి నోటిఫికేషన్ (Notification) విడుదలైంది. ఏయిమ్స్ రిక్రూట్‌మెంట్ 2021 నోటిఫికేషన్ ద్వారా అనాటమీ, డెర్మటాలజీ, న్యూరాలజీ, న్యూరోసర్జరీ, ఫాథాలజీ, మైక్రోబయోలజీ, ఈఎన్‌టీ, కమ్యూనిటీ మెడిసిన్ విభాగాల్లో 118 పోస్టులను భర్తీ చేయనున్నారు. పోస్టుల దరఖాస్తు పూర్తిగా ఆఫ్‌లైన్ మోడ్‌లో ఉంటుంది. అప్లికేషన్ (Application) లు అందించడానికి జనవరి 10, 2022 వరకు అవకాశం ఉంది. దరఖాస్తు ఎంపిక అభ్యర్థి అనుభవం, విద్యార్హత ప్రామాణికంగా ఉంటుంది. అప్లికేషన్‌ల ఆధారంగా పరీక్ష పెట్టాలో వద్దో సెలక్షన్ కమిటీ (Selection Committe) నిర్ణయం తీసుకొంటుంది. దరఖాస్తు విధానం, నోటిఫికేషన్ సమాచారం ప్రకారం అధికారిక వెబ్‌సైట్ https://aiimsrbl.edu.in/recruitments.php ను సందర్శించాలి.
పోస్టుల సమచారం.
పోస్టుపేరు | పోస్టుల సంఖ్య | జీతం | అర్హతలు |
ప్రొఫెసర్ | 29 | రూ.2,20,000 | సంబంధిత రంగంలో పీజీ ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణత చేసి ఉండాలి. కనీసం 14 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. |
అడిషనల్ ప్రొఫెసర్ | 23 | రూ.2,00,000 | సంబంధిత రంగంలో పీజీ ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణత చేసి ఉండాలి. కనీసం 10 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. |
అసోసియేట్ ప్రొఫెసర్ | 25 | రూ.1,88,000 | సంబంధిత రంగంలో పీజీ ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణత చేసి ఉండాలి. కనీసం 06 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. |
అసిస్టెంట్ ప్రొఫెసర్ | 41 | రూ.1,42,506 | సంబంధిత రంగంలో పీజీ ఎంసీహెచ్, డీఎం ఉత్తీర్ణత చేసి ఉండాలి. కనీసం 03 సంవత్సరాల పని అనుభవం ఉండాలి. |
- ఆసక్తిగల అభ్యర్థుల నుంచి దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులు 30 కంటే ఎక్కువ వస్తే పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు.
- లేదా విద్యార్హత, అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు.
- Step 1 : దరఖాస్తు విధానం పూర్తిగా ఆఫ్‌లైన్ ఉంటుంది.
- Step 2 : ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://aiimsrbl.edu.in/recruitments.php ను సందర్శించాలి.
- Step 3 : అనంతరం నోటిఫికేషన్ పూర్తిగా చదవాలి.
- Step 4 : నోటిఫికేషన్ చివరన అప్లికేషన్ ఫాం ఉంటుంది. RBI Internship Program: ఆర్‌బీఐలో ఇంటర్న్‌షిప్.. నెలకు రూ.20,000 స్టైఫండ్.. అప్లికేషన్ ప్రాసెస్!
- Step 5 : అది ప్రింట్ తీసుకొని తప్పులు లేకుండా నింపాలి.
- Step6 : దరఖాస్తు పూర్తి చేసి. Senior Administrative Officer Recruitment Cell 1st floor, Medical College Building AIIMS, Munshiganj, Dalmau Road Raebareli, Uttar Pradesh Pin 229405 అడ్రస్‌కు పంపాలి.
- Step 7 : పరీక్ష ఫీజు డిమాండ్ డ్రీఫ్ రూపంలో చెల్లించాలి.
- Step 8 : జనరల్ అభ్యర్థులు రూ.2,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.1,000 ఫీజు చెల్లించాలి.
- Step 9 : దరఖాస్తుకు జనవరి 10, 2022 వరకు అవకాశం ఉంది.
0 Response to "AIIMS Jobs"
Post a Comment