Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New Year gift for central government employees ... once again DA hike

 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు న్యూ ఇయర్ గిఫ్ట్.మరోసారి డీఏ పెంపు వివరాలు.

New Year gift for central government employees ... once again DA hike

7th Pay Commission News కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ ప్రభుత్వం న్యూ ఇయర్ గిఫ్ట్ ఇవ్వనుందన్న వార్తలు వస్తున్నాయి. మరోసారి డీఏ పెంచేందుకు (DA Hike) కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. మరి ఈసారి డీఏ ఎంత పెరుగుతుందో తెలుసుకుందాం.

  • 1. కొత్త సంవత్సరం 2022లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులను మోదీ ప్రభుత్వం బహుమతులతో ముంచెత్తనున్నట్లు తెలుస్తోంది. కొద్ది వారాల క్రితమే కేంద్రం డీఏ (DA), డీఆర్ (DR), టీఏ (TA), హెచ్ఆర్ఏ (HRA)లను పెంచింది. అయితే నూతన సంవత్సరం సందర్భంగా మరోసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త అందించడానికి ప్రభుత్వం సిద్ధమైంది.
  • 2. మీడియా నివేదికల ప్రకారం, ఏడో పే కమిషన్ రికమండేషన్ల (7th Pay Commission) మేరకు జనవరి, 2022లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్‌లో మరో 3 శాతం పెంచే అవకాశం ఉంది. ఈ డీఏ పెంపుతో ఉద్యోగుల జీతం భారీగా పెరిగే అవకాశం ఉంది.
  • 3. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 31 శాతం డియర్‌నెస్ అలవెన్స్‌ను పొందుతున్నారు. జులై, అక్టోబర్‌లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని రెండుసార్లు పెంచిన విషయం తెలిసిందే. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ కు డియర్‌నెస్ అలవెన్స్‌ను మరోసారి 3 శాతం పెంచితే వారి జీతం గణనీయంగా పెరగనుంది.
  • 4. అయితే డియర్‌నెస్ అలవెన్స్ పెంపుపై ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. దీనిపై ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ప్రభుత్వం డీఏని 3 శాతం పెంచాలని నిర్ణయం తీసుకుంటే.. జనవరి, 2022 నుంచి ఉద్యోగుల జీతం పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. 
  • 5. డీఏ పెంపుతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మరో తీపి కబురు అందించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. నివేదికల ప్రకారం, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ (fitment factor)ను పెంచడానికి కేంద్రం చర్చలు జరుపుతోంది. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరిగితే ఉద్యోగుల జీతం ఆటోమేటిక్‌గా పెరుగుతుంది.
  • 6. 2016లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను పెంచిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఉద్యోగుల బేసిక్ శాలరీని నేరుగా రూ.6000 నుంచి రూ.18,000కు పెంచారు. మళ్లీ ఆరేళ్ల తర్వాత ఇప్పుడు 2022లో కేంద్ర ఉద్యోగుల జీతాలను పెంచాలని కేంద్రం యోచిస్తోంది.
  • 7. కొత్త సంవత్సరం 2022లో కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెరగవచ్చు. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ పెంపుతో కేంద్ర ఉద్యోగుల కనీస వేతనాలు మరోసారి పెరగనున్నాయి. అన్ని ధరలు భగ్గుమంటున్న నేపథ్యంలో జీతం పెరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై కాస్త ఆర్థిక భారం తగ్గుతుంది అని చెప్పుకోవచ్చు.
  • 8. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాన్ని రెండున్నర రెట్లు ఎక్కువ పెంచే అంశాన్నే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అని అంటారు. 7వ వేతన సంఘం (ఏడో పే కమిషన్) సిఫారసుల ప్రకారం, కేంద్ర ఉద్యోగుల జీతం వారి బేసిక్ శాలరీ, అలవెన్సులతో పాటు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా నిర్ణయిస్తారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New Year gift for central government employees ... once again DA hike"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0