AP Job Mela
AP Job Mela: ఏపీలో Amara Raja, Apollo తదితర సంస్థల్లో 690 ఉద్యోగాలు.టెన్త్, ఇంటర్, డిగ్రీ అర్హత ఉంటే చాలు.వివరాలివే.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో శుభవార్త చెప్పింది. ఈ నెల 14న మరో జాబ్ మేళ నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్(APSSDC) వరుసగా జాబ్ మేళా(Job Mela)లను నిర్వహిస్తూ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తోంది. తాజాగా మరో జాబ్ మేళాను ప్రకటించింది APSSDC. ఈ నెల 14న చిత్తూరు జిల్లా పీలేరులో జాబ్ మేళాను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. Bharat FIH, Amara Raja Batteries Ltd, Apollo Pharmacy తదితర సంస్థల్లో ఈ జాబ్ మేళా ద్వారా ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ అర్హత కలిగిన వారికి ఉద్యోగవకాశాలను కల్పిస్తున్నారు.
Bharat FIH Limited: ఈ సంస్థలో Assembly Line Helpers విభాగంలో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ సంస్థలో మొత్తం 500 ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్/డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 12,328 వేతనం చెల్లించనున్నారు. ఎంపికైన అభ్యర్థులు శ్రీసిటీలో పని చేయాల్సి ఉంటుంది.
Amara Raja Batteries Ltd: ఈ సంస్థలో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. మిషన్ ఆఫరేటర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ పాస్/ఫెయిల్ అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు చిత్తూరులో పని చేయాల్సి ఉంటుంది.
Apollo Pharmacy: ఈ సంస్థలో మొత్తం 90 ఖాళీలు ఉన్నయి. ఇందులో ఫార్మసిస్ట్ విభాగంలో 40, రిటైల్ ట్రైనీ అసోసియేట్ విభాగంలో 50 ఖాళీలు ఉన్నాయి. టెన్త్/ఇంటర్ విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 15 వేల వరకు వేతనం ఉంటుంది. వయస్సు 19-29 ఏళ్లు ఉండాలి. అభ్యర్థులు తిరుపతిలో పని చేయాల్సి ఉంటుందని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
ఇతర వివరాలు
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, ఇతర విద్యార్హతల సర్టిఫికేట్లు, ఆధార్ ధ్రువపత్రాలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర వివరాలకు 8142509017, 9966086996 నంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఇంటర్వ్యూ వేధిక: అభ్యర్థులు CNR Arts&Science Degree College, CNR Nagar, Pileru, Chittor District చిరునామాలో ఈ నెల 14న ఉదయం 10 గంటలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు.
0 Response to "AP Job Mela"
Post a Comment