Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Chedi gang information

 చెడ్డీ గ్యాంగ్ సమాచారం

Chedi gang information

  • అసలు ఎవరీ ఈ చెడ్డీ గ్యాంగ్? 
  • వీరు ఎలా పుట్టుకొచ్చారు. 
  • వీరి చరిత్ర ఏమిటనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1987 నుండి చెడ్డీ గ్యాంగ్ దొంగతనాలు చేస్తూ వస్తోంది. కానీ.., ఇలాంటి గ్యాంగ్ ఒకటి ఉందని, వీరే దొంగతనాలు చేస్తున్నారని పోలీసులకి తెలిసింది మాత్రం1999లో! అంటే.. పది సంవత్సరాల పైగా వీరు ఉన్నారని కూడా ఎవ్వరికీ తెలియకుండా పోయింది. 

90వ దశకం చివరిలో సామాన్య ప్రజలు సీసీ కెమెరాలను వాడటం మొదలు పెట్టారు. ఆ దృశ్యాలలో వీరు రికార్డు అవ్వడంతోనే మొదటిసారిగా చెడ్డీ గ్యాంగ్ గురించి బయట ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి చెడ్డీ గ్యాంగ్ ని పట్టుకోవడం అనేది పోలీసులకి తలకి మించిన భారం అయిపోయింది.

అసలు చెడ్డీ గ్యాంగ్ పుట్టింది గుజరాత్ లోని ధవోద్ జిల్లాలోని గూద్ బాలా తాలూకాలో ఉన్న నహేడా అనే గిరిజన గ్రామంలో. అడవిలోని పోడు భూములలో వ్యవసాయం చేసుకోవడం, అక్కడ జీవులను వేటాడటం వీరు ప్రధాన వృత్తి. ఫేస్ పార్థి తెగ అని వీరికి పేరు. మొదట్లో వీరు ఎలాంటి దొంగతనాలు చేయకుండా తమకి ఉన్నంతలో కష్టపడే బతుకుతూ వచ్చారు. కానీ.., ప్రకృతి వీరిపై పగ పట్టింది. అడవిలోని పోడు భూముల్లో వ్యవసాయం అంటే నీటి సౌకర్యం ఉండదు. అతివృష్టి, అనావృష్టి లేకుండా వర్షం పడితేనే పంట చేతికి వస్తుంది. కానీ.., తరువాత ప్రకృతి సహకరించకపోవడంతో వీరికి వ్యవసాయం కలసి రాలేదు. ఇదే సమయంలో అడవిలో జతువులను వేటాడటం ప్రభుత్వం నిషేదించింది. 

చెడ్డీ గ్యాంగ్.. ఈ పేరు వినగానే చాలా మంది భయంతో వణికిపోతారు. కొంతమందికి కంటి మీద కునుకు కూడా పట్టదు ఇక. ఎందుకంటే వీరిని పట్టుకోవడానికి కుదరదు. 

ఒళ్ళంతా ఆయిల్ పూసుకుని, ఒంటి మీద ఒక చిన్న చెడ్డీ వేసుకుని మాత్రమే ఉంటారు. దొంగతనం చేయడంలో విచిత్రమైన పద్ధతి, క్రూరత్వంతో నిండిన జీవన విధానం, డబ్బు కోసం ఈజీగా ప్రాణాలు తీసేసే స్వభావం. ఇది చెడ్డీ గ్యాంగ్ స్టైల్. 

అసలు ఎవరీ ఈ చెడ్డీ గ్యాంగ్? 

వీరు దొంగతనాలు ఏడాది పాటు చేయరు. వారి అవసరాలకి తగ్గట్టు సీజనల్ గా కొన్ని రోజులు మాత్రమే దొంగతనాలు చేస్తారు.

దొంగతనం చేయాలని నిర్ణయించుకున్న నగరానికి చెడ్డీ గ్యాంగ్ నెలరోజులు ముందే చేరుకుంటుంది. వీరిలో కొంతమంది కూలీలుగా పనికి కుదరతారు. మరికొంత మంది.. పగటి వేళల్లో కుర్తా, ఫైజామ్ ధరించి బిక్షాటన చేస్తూ.., బెలూన్స్, పక్క పిన్నీసులు అమ్ముతూ మారు వేషాల్లో ఇళ్లపై రెక్కీ నిర్వహిస్తారు. వీరికి చదవు లేదు, ప్రభుత్వం నుండి ఎలాంటి గుర్తింపు కార్డు లేదు. ప్రభుత్వ పథకాలు అందేది లేదు. ఇలా వీరి జీవినానికే ముప్పు వచ్చి పడింది. ఇలాంటి సమయంలో ఆ తెగ పెద్ద రాంజీ.. ఒక 5 మంది కుర్రాళ్ళతో చెడ్డీ గ్యాంగ్ ని తయారు చేశాడు. వారికి బాగా ట్రైనింగ్ ఇచ్చాడు. నాయకుడు రాంచీ వీరికి దొంగతనాలు చేయడానికి కొన్ని సూత్రాలను పాటించాలని కూడా చెప్పాడు. అలా మొదలైన ఆ ఒక్క గ్యాంగ్.. ఇప్పుడు పెరుగుతూ వచ్చింది. ఈ తెగలోనే కొన్ని పదుల గ్యాంగ్స్ పుట్టుకొచ్చాయి. కానీ.., దొంగతనం చేయడంలో మాత్రం అందరిదీ ఒకటే స్టయిల్. ఇప్పటికీ ప్రతి చెడ్డీ గ్యాంగ్ కూడా గురువు రాంచీ చెప్పిన ఆ సూత్రాలనే పాటిస్తూనే దొంగతనాలు చేస్తోంది. ఆ సూత్రాలు వింటే ఒక్కొక్కరికి వెన్నులో వణుకు పుట్టక తప్పదు. 

అవి ఏమిటో ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. 

సరిగ్గా అంతా గాఢ నిద్రలోకి జారుకునే సమయమైన 3 గంటల ప్రాంతంలో వీరి అటాక్ మొదలవుతుంది. అటాక్ చేసే ముందు వీరు తమ డ్రెస్ కోడ్ లోకి మారిపోతారు. శరీరం అంతా ఆయిల్ పూసుకుంటారు. ఒంటి మీద ఒక్క చెడ్డీ తప్ప ఏమి ఉంచుకోరు. చెప్పులు కాలికి వేసుకోకుండా నడుముకి కట్టుకుంటారు. పదునైన కత్తులు తమతో ఉంచుకుంటారు. కొంతమంది ఇనుప రాడ్స్ చేత పట్టుకుంటారు.

ఇక ఎంచుకున్న ఇంట్లోకి మాత్రం వీరు నక్కి నక్కి ప్రవేశిస్తారు. కానీ.., ఇంట్లోకి ఎంటర్ అయ్యే విధానం, దోచుకునే విధానం అంతా చాలా ఆటవికంగా ఉంటుంది. నేరుగా తలుపులు, కిటికీలు, తాళాలు పగలకొట్టే వీరు ఇంట్లోకి ప్రవేశిస్తారు. ఇంట్లోని వారు భయపడి కామ్ గా ఉండిపోతే చాలా వరకు మనుషుల మీద అటాక్ చేయరు. ఒకవేళ ఎదురు తిరిగితే మాత్రం విచక్షణ లేకుండా దాడి చేస్తారు.

దొంగతనం చేసిన ఇంట్లోనే భోజనం చేయడం, అదే ఇంటి మధ్యలో మలం కూర్చోవడం వీరికి అలవాటు. ఈ రెక్కీ కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది. దొంగతనం చేయాలనుకున్న ఇల్లు సిటీకి దూరంగా ఉండేలా చూసుకుంటారు. ఆ ఇంటి ముందు ఆరేసిన ఖరీదైన బట్టలు, పార్కింగ్ చేసిన బైకులు, కార్లును బట్టి.. ఆ ఇంట్లో ఎంత వరకు డబ్బు దొరకొచ్చో అంచనా వేసుకుంటారు. ఒక్కో ఇంటిపై వీరి రెక్కీ మొత్తం రెండు రోజుల పాటు ఉంటుంది. ఆ రెండు రోజుల్లోనే ఆ ఇంట్లో వాళ్ళు ఎన్ని గంటలకి నిద్రపోతున్నారు? ఆ ఇంట్లో ఎంత మంది నివశిస్తున్నారు? ఆ ఇంట్లో కాపలాకి కుక్క ఉందా? లేదా? అన్న విషయాలను పసిగడతారు.

చెడ్డీ గ్యాంగ్ తాము దొంగతనం చేయాల్సిన ఇంటి పరిసరాలకి చాలా త్వరగానే చేరుకుంటాయి. అంటే.. రాత్రి 12 గంటల లోపే చేరుకుంటారు. అక్కడ ఏదైనా నిర్మానుష ప్రాంతంలో నక్కి, దాడి చేయడానికి రెడీ అవుతారు. ఒక్కోసారి మన ఇళ్ల మిద్దెల మీదే చేరి, దర్జాగా తగు సమయం కోసం ఎదురు చూస్తుంటారు పొరపాటున వీరిలో ఏ ఒక్కరు దొరికినా.. మిగతా వారి ఆచూకీ మాత్రం చెప్పరు. వీరిలో అంత యూనిటీ ఉంటుంది. ఈ కారణంగానే ఇన్ని రాష్ట్రాల పోలీసులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. చెడ్డీ గ్యాంగ్స్ ని పూర్తిగా నిర్వీర్యం చేయలేకపోతున్నారు.

ఈ ముఠాలు ముందుగా ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ముంబై వంటి ప్రాంతాల్లో దొంగతనాలు చేసేవి. కానీ.., చాలా ఏళ్ళ తరువాత అక్కడ పోలీసులు వీరి ఆట కట్టించడంతో సౌత్ పై కన్నేశారు. చెడ్డీ గ్యాంగ్ లోని ఒక్కో గ్రూప్ లో 6 నుండి 8 మంది సభ్యులు ఉంటారు. తమకి కావాల్సినంత సొత్తు వచ్చాక, ఆ డబ్బుని పంచుకుని వీరు విడివిడిగా మాత్రమే తమ గమ్య స్థానాలను చేరుకుంటారు. అది కూడా కేవలం రైలు మార్గంలోనే. ఎందుకంటే వీరు రైలులో గుంపుల మధ్య తప్ప.. ఇక ఎందులోను ప్రయాణం చేయడానికి ఇష్టపడరు.

ఇప్పుడు వీరి టార్గెట్ ఆంధ్రప్రదేశ్ అయ్యింది. వీరు ఏపీని టార్గెట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో వీరు పాతిక ఇళ్లల్లో దొంగతనాలు చేశారు. ఇప్పుడు మాత్రం  వరుస దొంగతనాలతో రెచ్చిపోతున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Chedi gang information"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0