Central Railway Recruitment 2021
Central Railway Recruitment 2021: నిరుద్యోగులకు శుభవార్త.సెంట్రల్ రైల్వేలో ఉద్యోగాలు. ఇలా అప్లై చేయండి.
సెంట్రల్ రైల్వే నుంచి పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తుకు ఈ నెల 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
సెంట్రల్ రైల్వే (Central Railway) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Railway Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించించింది. ఈ మేరకు సెంట్రల్ రైల్వేకు చెందిన రిక్రూట్మెంట్ సెల్ స్పోర్ట్స్ కోటాలో (Sports Quota Jobs) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 21 ఖాళీలను భర్తీ చేయనున్నారు. లెవల్ 5/4, లెవల్ 3/2 విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో సూచించారు.
ఖాళీల వివరాలు.
విద్యార్హతల వివరాలు..
లెవల్ 5/4: ఈ విభాగంలో ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి.
లెవల్ 3/2: ఈ ఖాళీలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు 12 వ తరగతి లేదా ఇందుకు సమానమైన విద్యార్హతను పొంది ఉండాలి.
అభ్యర్థులు జనవరి 1 నాటికి 18-25 ఏళ్ల వయస్సు కలిగి ఉండాలి.
అప్లికేషన్:
-ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఈ నెల 13 నుంచి ప్రారంభం అవుతుంది. అప్లికేషన్ లింక్ https://www.rrccr.com/Home/Home వెబ్ సైట్లో ఆ తేదీ నుంచి అందుబాటులో ఉంటుంది.
దరఖాస్తుకు డిసెంబర్ 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
WEBSITE : CLICK HERE
NOTIFICATION : CLICK HERE
0 Response to "Central Railway Recruitment 2021"
Post a Comment