AP Job Mela
AP Job Mela: ఏపీలో రేపు భారీ జాబ్ మేళా.. HETERO, Justdial తదితర సంస్థల్లో ఉద్యోగాలు.. రూ. 20 వేల వరకు వేతనం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) రాష్ట్రంలో రేపు జాబ్ మేళా(Job Mela) ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఈ జాబ్ మేళాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక చేపట్టనున్నారు. వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరు విద్యార్హతలు, వేతనాలను నిర్ణయించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
6ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
1. Johnson Lifts Pvt Ltd: ఈ సంస్థలో 20 ఖాళీలను ఈ జాబ్ మేళా ద్వారా భర్తీ చేస్తున్నారు. డిప్లొమా/ITI ట్రైనీ విభాగంలో ఈ నియామకాలను చేపట్టారు. ఐటీఐ/డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ ఖాళీలకు నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఎంపికైన వారికి నెలకు రూ. 8 వేల నుంచి రూ. 10 వేల వరకు వేతనం చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ఎంపికైన వారు ప్రకాశం జిల్లాలో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలని ప్రకటనలో స్పష్టం చేశారు. ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
2. Hetero Drugs: ఈ సంస్థలో 100 ఖాళీలకు ఇంటర్వ్యూలను నిర్వహించనున్నారు. Jr.Chemist/QA/QC తదితర విభాగాల్లో ఈ నియామకాలు చేపట్టారు. ఐటీఐ/Diploma/B.Sc&M.Sc Chemist(2017-21 Passed Outs Only) విద్యార్హత కలిగిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్, విశాఖపట్నంలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో వెల్లడించారు. ఎంపికైన వారికి ఏడాదికి రూ.1.3 లక్షల నుంచి రూ.2.06 లక్షల వరకు వేతనం చెల్లించనున్నట్లు ప్రకనటలో వెల్లడించారు. అభ్యర్థుల వయస్సు 19-27 ఏళ్లు ఉండాలి. ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
3. Justdial: ఈ సంస్థలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. Business Development Executive విభాగంలో ఈ నియామకాలు చేపట్టారు. ఏదైనా డిగ్రీ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ. 17 వేల నుంచి రూ. 20 వేల వరకు వేతనం చెల్లించనున్నారు. వేతనంతో పాటు ఇన్సెంటీవ్స్ ఉంటాయి. ఎంపికైన అభ్యర్థులు ప్రకాశం జిల్లాతో పాటు హైదరాబాద్ లో పని చేయాల్సి ఉంటుంది. అభ్యర్థుల వయస్సు 19-28 ఏళ్లు ఉండాలి. ఈ ఉద్యోగాలకు కేవలం పురుషులు మాత్రమే అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
SBI CBO Recruitment 2021: ఎస్‌బీఐలో 1,226 ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే
ఇతర వివరాలు.
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ముందుగా www.apssdc.in వెబ్ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
-ఇంటర్వ్యూకు హాజరయ్యే సమయంలో అభ్యర్థులు Resume, విద్యార్హత సర్టిఫికేట్లు, ఆధార్ జిరాక్స్ కాపీలను వెంట తీసుకురావాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు.
-అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలకు 9952518187 నంబర్ ను సంప్రదించాలని సూచించారు.
ఇంటర్వ్యూ వేధిక: APSSDC Office, Old RIMS, Opp: Collector Office-Ongole-Prakasham District.
-అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 10న ఉదయం 10 గంటలకు పై చిరునామాలో నిర్వహించనున్న ఇంటర్వ్యూలకు హాజరు కవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
0 Response to "AP Job Mela"
Post a Comment