Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Complete procedure on how to apply for PAN card for your child.

 మీ పిల్లలకు పాన్ కార్డు తీసుకోవాలా ఎలా అప్లై చేయాలో పూర్తి విధానం.

Complete procedure on how to apply for PAN card for your child.

1. పాన్ కార్డ్ ఆర్థిక లావాదేవీలు జరపడానికి కావాల్సిన ముఖ్యమైన డాక్యుమెంట్. భారీ స్థాయిలో లావాదేవీలు జరిపితే పాన్ కార్డును (PAN Card) ప్రూఫ్‌గా చూపించాల్సి ఉంటుంది. కొన్ని లావాదేవీలకు (Financial Transactions) పాన్ కార్డ్ తప్పనిసరి. ముఖ్యంగా 18 రకాల లావాదేవీలు జరిపినప్పుడు పాన్ కార్డ్ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలని ఆదాయపు పన్ను శాఖ వెల్లడించింది. 

2. పాన్ కార్డును 18 ఏళ్లు దాటిన పౌరులు ఎవరైనా తీసుకోవచ్చని తెలుసు. ఆధార్ నెంబర్ ఉంటే చాలు... పాన్ కార్డును 10 నిమిషాల్లో తీసుకోవచ్చు. అయితే 18 ఏళ్ల లోపువారికి కూడా పాన్ కార్డు తీసుకునే వెసులుబాటు కల్పించింది ఆదాయపు పన్ను శాఖ. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) అధికారిక వెబ్‌సైట్‌లో పాన్ కార్డుకు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. 

3. పిల్లల పేర్ల మీదా ఆస్తులను మెయింటైన్ చేసేవాళ్లు ఉంటారు. వారి పేర్ల మీద బ్యాంక్ అకౌంట్లు కూడా తెరుస్తుంటారు. తల్లిదండ్రులు తమ పెట్టుబడులకు పిల్లల్ని నామినీగా వెల్లడిస్తే వారి పేరు మీద పాన్ కార్డ్ ఉండటం తప్పనిసరి. కాబట్టి 18 ఏళ్ల లోపు వారు కూడా పాన్ కార్డు తీసుకోవచ్చు. ఇందుకోసం కొన్ని నియమనిబంధనలు ఉన్నాయి. 

4. మైనర్లు పాన్ కార్డ్ కోసం స్వయంగా దరఖాస్తు చేయకూడదు. వారి తల్లిదండ్రులు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఒకప్పుడు పాన్ కార్డ్ తీసుకోవాలంటే పెద్ద ప్రాసెస్ ఉండేది. కానీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో సులువుగా పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేయొచ్చు. 18 ఏళ్లు దాటినవారు మాత్రమే కాదు... 18 ఏళ్లలోపు మైనర్ల తరఫున వారి తల్లిదండ్రులు పాన్ కార్డుకు అప్లై చేయొచ్చు. ఎలా అప్లై చేయాలో తెలుసుకోండి. 

5. పిల్లలకు పాన్ కార్డ్ తీసుకోవాలనుకుంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్ (NSDL) అధికారిక వెబ్‌సైట్ https://www.tin-nsdl.com/ ఓపెన్ చేయాలి. Services లో PAN పైన క్లిక్ చేయాలి. Application for allotment of New PAN (Form 49A) సెక్షన్‌లో Apply పైన క్లిక్ చేయాలి. పాన్‌కార్డ్ తీసుకోవాలనుకునే పిల్లల వివరాలతో పాటు తల్లిదండ్రుల వివరాలు ఎంటర్ చేయాలి.

6. తల్లిదండ్రుల ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి. వీటితో పాటు ఐడీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ కోసం పిల్లల ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీలో ఏదైనా ఓ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి. డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాత చివరగా రూ.107 చెల్లించి ఫామ్ సబ్మిట్ చేయాలి. 

7. దరఖాస్తు ఫామ్ సబ్మిషన్ పూర్తైన తర్వాత రిసిప్ట్ నెంబర్ వస్తుంది. ఈ నెంబర్‌తో అప్లికేషన్ ట్రాక్ చేయొచ్చు. వెరిఫికేషన్ తర్వాత పాన్ కార్డ్ జారీ అవుతుంది. 15 రోజుల్లో పాన్ కార్డ్ పోస్టులో వస్తుంది. పాన్ కార్డ్ వచ్చిన తర్వాత వివరాలన్నీ సరిచూసుకోవాలి. వివరాల్లో ఏవైనా మార్పులు ఉంటే పాన్ కార్డ్ కరెక్షన్ కోసం దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Complete procedure on how to apply for PAN card for your child."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0