Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Income tax return efiling-process within 5 minutes details

 Income Tax Return: 5 నిమిషాల్లోనే ఐటీఆర్ ఫైల్ చేసుకోవచ్చు ఇలా… మొత్తం ప్రాసెస్ 8 స్టెప్స్‌లోనే

Income tax return efiling-process within 5 minutes details

ఐటీఆర్ ఫైలింగ్ చేసుకునే ముందు, అవసరమైన అన్ని కీలక డాక్యుమెంట్లను మీరు సేకరించి పెట్టుకోవాలి. అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబర్,

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు చివరి తేది దగ్గర పడుతోంది. దీంతో ఐటీఆర్ ఇంకా దాఖలు చేయని వేతనదారులలో టెన్షన్ పెరిగిపోతుంది. తుది గడువు దగ్గర పడటంతో సీఏ లేదా ట్యాక్స్ ఫైలర్‌ను సంప్రదించి, పన్ను రిటర్నులు దాఖలు చేయించుకోవడం వీరికి సవాలుగా మారింది. ముఖ్యంగా నెలవారీ వేతనం తీసుకునే వారికి ఆదాయపు పన్ను పొదుపు అనేది అత్యంత కీలకం. టీడీఎస్ రూపంలో కట్ అయిన మొత్తాన్ని తిరిగి పొందడం కోసం పన్ను చెల్లింపుదారులు కచ్చితంగా రిటర్నులను ఫైల్ చేయాల్సి ఉంటుంది.

ఒకవేళ మీ దగ్గర అవసరమైన డాక్యుమెంట్లు అన్ని ఉంటే, ఆదాయపు పన్ను రిటర్ను(ఐటీఆర్) దాఖలు చేయడం కేవలం ఐదే నిమిషాలు. 5 నిమిషాలలో ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. దీని కోసం ఎలాంటి మనీని ఖర్చు పెట్టనవసరం లేదు.

ఐటీఆర్ ఫైలింగ్ చేసుకునే ముందు, అవసరమైన అన్ని కీలక డాక్యుమెంట్లను మీరు ముందే సేకరించి పెట్టుకోవాలి. అంటే పాన్ కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ నెంబర్, ఇన్వెస్ట్‌మెంట్ వివరాలు, వాటి ప్రూఫ్‌లు, ఫామ్ 16, ఫామ్ 26ఏఎస్ వంటివన్ని మీ దగ్గర ఉంచుకోవాలి. ఎందుకంటే ఐటీఆర్ దాఖలు చేసేందుకు అవసరమైన సమాచారమంతా ఈ డాక్యుమెంట్లలో ఉంటుంది.

ఐటీఆర్ దాఖలు ఎలా చేసుకోవాలో ఇక్కడ ఒకసారి చూద్దాం.

ఐటీఆర్ ఫైలింగ్ ప్రాసెస్

  • స్టెప్ 1..
  • https://eportal.incometax.gov.in/iec/foservices/#/loginకి వెళ్లాలి. మీ యూజర్ ఐడీ నమోదు చేసి, కంటిన్యూ నొక్కాలి. ఆ తర్వాత పాస్ వర్డ్ నొక్కి, లాగిన్ అవ్వాలి.
  • స్టెప్ 2..
  • లాగిన్ అయిన తర్వాత, ఈ-ఫైల్ అనే ఆప్షన్‌పై నొక్కాలి. ఆ తర్వాత ‘File Income Tax Return’ను క్లిక్ చేయాలి.
  • స్టెప్ 3…
  • అసెస్‌మెంట్ ఇయర్ 2021-22ను ఎంపిక చేసుకోవాలి.
  • స్టెప్ 4…
  • అసెస్‌మెంట్ ఇయర్ ఎంపిక చేసుకున్న తర్వాత, కంటిన్యూపై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ఆఫ్‌లైన్ లేదా ఆన్‌లైన్ విధానంలో “OFFLINE” విధానాన్ని ఎంపిక చేసుకోవాలి. “Filling Type”కి వెళ్లి, 139(1)-Original Return ను సెలక్ట్ చేయాలి. మీ కేటగిరీ బట్టి “ITR FORM”ను ఎంపిక చేసుకోవాలి. ఐటీఆర్ ఫామ్ ఎంపిక చేసుకున్న తర్వాత, ఆ ఫామ్ మీ సిస్టమ్‌లో డౌన్ లోడ్ అవుతుంది.
  • స్టెప్ 5…
  • ఆ తర్వాత మీరు డౌన్ లోడ్ చేసుకున్న ఫామ్ ఓపెన్ అవుతుంది. దానిలో మీ దగ్గరున్న సమాచారమంతా నమోదు చేయాలి. ఆ తర్వాత ఆ ఫైల్‌ని ఎక్స్‌ఎంఎల్‌లోకి మార్చాలి.
  • స్టెప్ 6..
  • సమాచారమంతా దాఖలు చేసిన తర్వాత, స్క్రీన్ పైకి వెళ్లాలి. స్క్రీన్‌పై “Attach File” అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఎక్స్‌ఎంఎల్‌లోకి మార్చిన మీ ఫామ్‌ను ఇక్కడ అటాచ్ చేయాలి.
  • స్టెప్ 7..
  • ఫైల్‌ని జత చేసిన తర్వాత, ఆ ఫైల్‌ని సైట్ వాలిడేట్ చేస్తుంది. వాలిడేట్ అయిన తర్వాత, “Proceed to Verification”ను క్లిక్ చేయాలి.
  • స్టెప్ 8…
  • ఈ విధానంలో కేవలం కొన్ని నిమిషాల్లోనే ఐటీఆర్‌ను దాఖలు చేసుకోవచ్చు. మీ రిటర్నును వెరిఫై చేసుకునేందుకు ఇక ఇప్పుడు ఈ-వెరిఫికేషన్‌కు వెళ్లొచ్చు.

పన్ను చెల్లింపుదారుల కోసం, ఐటీఆర్‌ను దాఖలు చేసుకునేందుకు సెంట్రల్ బోర్డు ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సస్(సీబీడీటీ) డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చింది. అంతకుముందు ఈ గడువు జూలై 31 వరకే ఉండేది.

ఆ తర్వాత సెప్టెంబర్ 31కి, ప్రస్తుతం డిసెంబర్ 31 వరకు ఈ గడువుని పొడిగించారు. పన్ను చెల్లింపుదారులకు ఐటీఆర్ దాఖలను సులభతరం చేయడం కోసం సీబీడీటీ ఈ-ఫైలింగ్ పోర్టల్‌ను లాంచ్ చేసింది.

డిసెంబర్ 3 వరకు ఈ-ఫైలింగ్ పోర్టల్‌ ద్వారా 3 కోట్ల మందికి పైగా ఐటీ రిటర్నులను దాఖలు చేసినట్టు ఆదాయపు పన్ను విభాగం వెల్లడించింది.

E-FILING OFFICIAL WEBSITE CLICK HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Income tax return efiling-process within 5 minutes details"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0