Details of the procedure, benefits and eligibility for applying to the Prime Minister's Awas Yojana.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కి అప్లై చేసుకునే పద్దతి , ప్రయోజనాలు , అర్హతల వివరాలు.
సామాన్యులు సైతం సొంత గృహాలను కొనుగోలు చేసే స్థోమతను పెంచడానికి భారత ప్రభుత్వం ద్వారా ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) స్కీమ్ ప్రారంభించింది.
PMAY పథకం 2022 నాటికి అందరికీ సరసమైన గృహ నిర్మాణాన్ని అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. సొంతింటి కల సాకారం చేసుకునేందుకు ఈ స్కీమ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ పథకం యొక్క ప్రయోజనం వార్షిక ఆదాయం 6-18 లక్షల మధ్య ఉంటుంది. ఈ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ .2.30 లక్షల రుణ రాయితీని ఇస్తుంది.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన (PMAY) ఎలా అప్లై చేసుకోవాలి…?
ఈ పథకానికి ఎలా అప్లై చేసుకోవాలనేది చూస్తే.. బ్యాంకుల్లో హోమ్ లోన్ కోసం అప్లై చేసినప్పుడే ప్రభుత్వ సబ్సిడీ అందించే దరఖాస్తు కూడా అడగాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీరు సబ్సిడీకి అర్హులు అయితే, మీ దరఖాస్తు సెంట్రల్ నోడల్ ఏజెన్సీ (సిఎన్ఎ) కు పంపిస్తారు. మీ దరఖాస్తు ని ఒకే చేస్తే, నోడల్ ఏజెన్సీ సబ్సిడీ మొత్తాన్ని బ్యాంకుకు పంపుతుంది. అప్పుడు ఇవి మీ అకౌంట్ లో పడతాయి. ఇది మీ మొత్తం రుణ మొత్తాన్ని తగ్గిస్తుంది.
ఉదాహరణకు, మీ వార్షిక ఆదాయం రూ .7 లక్షలు, రుణ మొత్తం రూ .9 లక్షలు ఉంటే, అప్పుడు సబ్సిడీ రూ .2.35 లక్షలు. గృహ రుణం నుండి ఈ రాయితీని తగ్గించినప్పుడు.. లోన్ రూ .6.65 లక్షలకు తగ్గించబడుతుంది. 6 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి 2.67 లక్షలు, 12 లక్షల ఆదాయం ఉన్నవారికి 2.35 లక్షలు, 18 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి 2.30 లక్షలు ఉంటుంది.
ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన ప్రయోజనం పొందాలంటే..?
ఈ స్కీమ్ ప్రయోజనం పొందాలంటే కుటుంబంలోని ఎవరి పేరుపై కూడా సొంతిల్లు ఉండకూడదు.
అలానే లోన్ తీసుకొని కట్టుకునే ఇల్లు ఇంట్లోని భార్య పేరుపై ఉండాలి. లేదంటే భార్యాభర్తల పేరుపై జాయింట్‌గా కూడా ఉండొచ్చు.
అదే విధంగా గరిష్టంగా 200 చదరపు మీటర్ల కార్పెట్ ఏరియాలో నిర్మించుకునే ఇళ్లకు మాత్రమే ఈ స్కీమ్ కింద సబ్సిడీ లభిస్తుంది.
0 Response to "Details of the procedure, benefits and eligibility for applying to the Prime Minister's Awas Yojana."
Post a Comment