Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

South Central Railway Recruitment 2021

 Railway Jobs 2021: దక్షిణ మధ్య రైల్వేలో ఉద్యోగాలకు మరో నోటిఫికేషన్... ఖాళీల వివరాలు ఇవే.

South Central Railway Recruitment 2021

South Central Railway Recruitment 2021 దక్షిణ మధ్య రైల్వే మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం తెలుసుకోగలరు.

మొత్తం ఖాళీలు : 21

రైల్వేలో ఉద్యోగాలు కోరుకునే నిరుద్యోగులకు శుభవార్త. దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) పలు ఖాళీల భర్తీకి మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. మొత్తం 21 ఖాళీలను ప్రకటించింది. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. పలు క్రీడల్లో రాణించినవారు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేయాలి. బాక్సింగ్, క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ లాంటి క్రీడల్లో రాణించినవారై ఉండాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2022 జనవరి 17 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోగలరు.

ఖాళీల వివరాలు

మొత్తం ఖాళీలు 21
 అథ్లెటిక్స్ (మెన్) 2
 అథ్లెటిక్స్ (వుమెన్) 2
 బాల్ బ్యాడ్మింటన్ (మెన్) 2
 బాస్కెట్ బాల్ (మెన్) 2
 బాస్కెట్ బాల్ (వుమెన్) 1
 బాక్సింగ్ (మెన్) 1
 క్రికెట్ (మెన్) 1
 హ్యాండ్‌బాల్ (మెన్) 1
 హ్యాండ్‌బాల్ (వుమెన్) 1
 హాకీ (మెన్) 1
 కబడ్డీ (మెన్) 1
 ఖోఖో (మెన్) 1
 వాలీబాల్ (మెన్) 2
 వాలీబాల్ (వుమెన్) 1
 వెయిట్‌లిఫ్టింగ్ (మెన్) 1

గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 18.12.2021

దరఖాస్తుకు చివరి తేదీ- 17.01.2022

విద్యార్హతలు- టెక్నికల్ పోస్టులకు ఎస్ఎస్సీ పాస్ కావాలి. లేదా సంబంధిత గ్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. ఇతర పోస్టులకు 10+2 లేదా ఇంటర్మీడియట్ పాస్ కావాలి.

క్రీడార్హతలు- ఒలింపిక్ గేమ్స్, వాల్డ్ కప్, వాల్డ్ ఛాంపియన్‌షిప్స్, ఏషియన్ గేమ్స్, కామన్‌వెల్త్ గేమ్స్, యూత్ ఒలింపిక్స్, డేవిస్ కప్, ఛాంపిటన్స్ ట్రోఫీ, థామర్, ఉబెర్ కప్, కామన్‌వెల్త్ ఛాంపియన్‌షిప్స్, ఏషియన్ ఛాంపియన్‌‌షిప్స్, ఏషియా కప్, సౌత్ ఏషియన్ ఫెడరేషన్ గేమ్స్, వాల్డ్ యూనివర్సిటీ గేమ్స్‌లో రాణించినవారై ఉండాలి.

దరఖాస్తు ఫీజు- రూ.500. ఎస్‌సీ, ఎస్‌టీ, మహిళలు, మైనార్టీలు, ఎకనమికల్లీ బ్యాక్‌వర్డ్ క్లాస్ అభ్యర్థులకు ఫీజు రూ.250.

వయస్సు- 2022 జనవరి 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు

South Central Railway Recruitment 2021: దరఖాస్తు విధానం

  • Step 1- అభ్యర్థులు ముందుగా https://scr.indianrailways.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
  • Step 2- హోమ్ పేజీలో Online application for recruitment under Sports Quota for the year 2021-22 లింక్ పైన క్లిక్ చేయాలి.
  • Step 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో New User Registration పైన క్లిక్ చేయాలి.
  • Step 4- పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పుట్టిన తేదీ లాంటి వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
  • Step 5- ఆ తర్వాత యూజర్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ చేయాలి.
  • Step 6- అడ్రస్, విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
  • Step 7- లేటెస్ట్ ఫోటో, సంతకం, విద్యార్హతల సర్టిఫికెట్స్, క్రీడార్హతల సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
  • Step 8- దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
  • Step 9- దరఖాస్తు ఫామ్ డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

APPLY : CLICK HERE

NOTIFICATION : CLICK HERE

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "South Central Railway Recruitment 2021"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0