Finance Minister Bugna Rajendra Nath and CS Sameer Sharma hold talks with unions on 16-12-21. Official press release.
ఉద్యోగ సంఘాలతో ది :16-12-21 న ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, సీఎస్ సమీర్ శర్మల చర్చలు.. అధికారిక పత్రికా ప్రకటన.
ఉద్యోగ సంఘాలతో ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, సిఎస్ సమీర్ శర్మలు సమీక్ష,
అమరావతి,16డిశంబరు:ఉద్యోగుల సమస్యలపై అమరావతి సచివాలయం రెండవ బ్లాకులో గురువారం రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ : శర్మలు సమావేశమై వివిధ అంశాలపై విస్తృతంగా సమీక్షించారు. ఈసమావేశంలో ఎపి జెఎసి మరియు ఎపి జెఎసి అమరావతి ఐక్యవేదిక. ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం తదితర సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా తొలుత ఎపి జెఎసి మరియు ఎపి జెఎసి అమరావతి ఐక్య వేదిక సంఘాలతో ఉద్యోగుల సమస్యలపై చర్చించగా 71 డిమాండులతో కూడిన నివేదికను ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాధ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మలకు వారు అందించడం జరిగింది. వాటిలో పిఆర్పి అంశంతో సహా _సుమారు 10 డిమాండులు మాత్రమే ఆర్ధిక అంశాలకు సంబంధించినవి కాగా మిగతా 61 ఆర్ధికేతర అంశాలకు సంబంధించినవి ఉన్నాయి. తదుపరి ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతోను, తదుపరి ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతోను విడివిడిగా వారు చర్చించగా వారు కూడా వివిధ అంశాలపై పలు డిమాండులను అందిచారు.
ఈ సందర్భంగా ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాద్ మాట్లాడుతూ అన్ని అంశాలను పరిశీలన జరిపి ఒక నిర్దిష్ట వ్యవధిలో ఆయా సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. సుమారు గత రెండేళ్ళుగా కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగా దెబ్బతిందని ఇప్పుడిప్పుడే పరిస్థితులు మెరుగవుతున్నాయని అన్ని సమస్యలపై పరిశీలన జరిపి సాధ్యమైనంత త్వరగా వీలైనన్ని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని కావున ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమాలను విరమించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈసమావేశం అనంతరం రెండవ బ్లాకు వద్ద ఉన్న మీడియాతో ఉద్యోగ సంఘాలతో కలిసి మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ మాట్లాడుతూ 12 సంవత్సరాల తర్వాత ఉద్యోగుల జాయింట్ సంయుక్త కమిటీ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వచ్చే బుధవారం వివిధ కార్యదర్శులతో సమావేశమై ఉద్యోగుల సమస్యలపై _చర్చించనున్నారని తెలిపారు. తాను కూడా ఉద్యోగుల సమస్యలకు సంబంధించి పీరియాడికల్ గా చర్చించి వీలైనన్ని సమస్యలను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని చెప్పారు. ప్రభుత్వంపై నమ్మకం ఉంచి ఉద్యోగుల నిరసన కార్యక్రమాలను విరమించాలని మరొకసారి విజ్ఞప్తి చేయగా అందుకు ఉద్యోగ సంఘాలన్నీ సానూకులంగా స్పందించి వారి ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నట్టు చెప్పారు.
అంతకు ముందు జరిగిన సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి 12 ఏళ్ళ అనంతరం జాయింట్ స్టాప్ కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. వచ్చే బుధవారం వివిధ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి వివిధ అంశాలపై చర్చించి వాటిని పరిష్కరించేలా కృషి చేయనున్నట్టు చెప్పారు.
ఈసమావేశంలో రాష్ట్ర సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్, ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సంక్షేమం) పి. చంద్రశేఖర్ రెడ్డి, ఎపి జెఎసి మరియు ఎపి జెఎసి అమరావతి ఐక్యవేదిక, ఎపి సచివాలయ ఉద్యోగుల సంఘం, ఎపి ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల అధ్యక్షులు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు, వెంకట్రామిరెడ్డి, సూర్య నారాయణలతో పాటు ఆయా సంఘాల కార్యదర్శులు ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.
(ప్రచార విభాగం సమాచార శాఖ అమరావతి సచివాలయం వారిచే జారీ చేయడమైనది)
0 Response to "Finance Minister Bugna Rajendra Nath and CS Sameer Sharma hold talks with unions on 16-12-21. Official press release."
Post a Comment