PM Modi on Omicron surge
PM Modi on Omicron surge : దేశంలో ఒమిక్రాన్ వ్యాప్తిపై ప్రధాని మోదీ కీలక సమీక్ష నేడు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచం పాలిట తాజా ముప్పుగా మారింది. డెల్టా వేరియంట్ కంటే ప్రమాదకారిగా భావిస్తోన్న ఒమిక్రాన్ ఇప్పటికే యూరప్ లో పదుల సంఖ్యలో జనాన్ని బలితీసుకుంది.
కొవిడ్ కొత్త వేరియంట్ ఒమైక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం కీలక సమావేశం నిర్వహించనున్నారు. దేశంలో కొవిడ్ వ్యాప్తి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఓవైపు ఒమైక్రాన్ కేసుల పెరుగుదల కొనసాగుతుండగా.. మరోవైపు దేశంలో బూస్టర్ డోసు పంపిణీకి డిమాండ్లు వస్తున్నాయి. కొత్త వేరియంట్‌పై కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. దీంతో ప్రధాని సమీక్ష ప్రాధాన్యం సంతరించుకుంది. ఒమైక్రాన్ వెలుగులోకి వచ్చాక నవంబరు నెలాఖరులో మోదీ సమీక్ష జరిపారు.
కాగా, దేశంలో ఒమైక్రాన్ కేసులు 250కి పెరిగాయి. 15 రాష్ట్రాల్లో కొత్త వేరియంట్ కేసులు నమోదయ్యాయి. కరోనా వేరియంట్లను ఎదుర్కొనేందుకు అవసరమైన టీకా బూస్టర్ డోసులు ఎంత వరకు అవసరం..? ఎప్పుడు ఇవ్వాలనే విషయంలో శాస్త్రీయ నిర్ణయాలకు అనుగుణంగా వ్యవహరిస్తామని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్య విభాగం) డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు. ఆక్సిజన్ సమర్థ నిర్వహణ, వృథా నివారణపై ఆరోగ్య కార్యకర్తలకు కేంద్రం శిక్షణ ఇస్తోంది. ''నేషనల్ ఆక్సిజన్ స్టీవార్డ్‌షిప్ ప్రోగామ్' కింద ప్రతి జిల్లాలో ఒక ఆరోగ్య కార్యకర్తను ''ఆక్సిజన్ స్టీవార్డ్(సారథి)''ను గుర్తించి శిక్షణ ఇస్తారు.
0 Response to "PM Modi on Omicron surge"
Post a Comment