Single ID: Aadhaar, PAN combined single ID card ... Center for Merchants Key: Decision is
Single ID : ఆధార్ , పాన్ కలిపి ఒకే ఐడీ కార్డు ... వ్యాపారుల కోసం కేంద్రం కీలక నిర్ణయం .
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో భాగంగా సులభంగా వ్యాపార అనుమతులు ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా వ్యాపారాలకు సులభంగా అనుమతులు ఇచ్చేందుకు ఓ సరికొత్త నిర్ణయం తీసుకుంది.
డిసెంబర్ 22న జరిగిన జాతీయ వర్క్‌షాప్‌లో కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ మాట్లాడుతూ, ''ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లక్ష్యంగా కేంద్రం గతంలో అనేక సులభతరమైన వాణిజ్య విధానాలను అమల్లోకి తెచ్చింది. తద్వారా ప్రభుత్వం ఇప్పటివరకు 25,000 కంటే ఎక్కువ సమస్యలకు పరిష్కారం చూపగలిగింది. ఫలితంగా దేశ విదేశీ పెట్టుబడిదారులను ఆకర్శించింది. సులభతరమైన వాణిజ్య విధానాలు, తక్కువ డాక్యుమెంటేషన్, వేగంగా అనుమతులు లభిస్తున్న కారణంగానే భారత్‌లో స్టార్టప్ సంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి." అని చెప్పారు.
కొత్త సాంకేతికతను ఉపయోగించుకోవాలి
వ్యక్తులు, వ్యాపారాల కోసం ఒకే గుర్తింపు సంఖ్యను రూపొందించడానికి నూతన సాంకేతికత ఉపయోగించుకోవాలని ఆయన అధికారులను కోరారు. ఇందుకు గాను డిజిలాకర్, నేషనల్ సింగిల్ విండో సిస్టమ్ వంటి వివిధ సేవలను మిళితం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. తద్వారా, బిజినెస్ పర్మిషన్ల కోసం దరఖాస్తు చేసేటప్పుడు అనేక సమస్యలు తొలగిపోతాయన్నారు. వ్యాపారుల సమస్యలు పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజమ్‌లు తప్పనిసరిగా యూజర్ ఫ్రెండ్లీ ఉండాలని అధికారులకు సూచించారు.
Tokenisation Rules: క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్‌కు కొత్త రూల్స్... మీరేం చేయాలంటే
వ్యాపారులు, వ్యక్తుల నుంచి వచ్చే ఫిర్యాదులను ప్రభుత్వ శాఖలు మానవ కోణంలో పరిష్కరించాల్సిన అవసరం ఉందని కేంద్రమంత్రి గుర్తు చేశారు. నియమాలు, విధానపరమైన అంశాల కారణంగా ఫిర్యాదులను పూర్తిగా పరిష్కరించలేని సందర్భాల్లో, ఫిర్యాదుదారునికి సున్నితంగా తెలియజేయాలని ఆయన అధికారులకు సూచించారు. స్వీయ-ధ్రువీకరణ, స్వీయ-నియంత్రణను ప్రోత్సహించాలని కూడా పిలుపునిచ్చారు. ఇక, భారతదేశం ఎదుర్కొంటున్న సమస్యలకు స్వదేశీ పరిష్కారాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఆయన గుర్తు చేశారు. సదస్సులో చర్చల ద్వారా రూపొందించిన ఆలోచనలను పీయూష్ గోయల్, కేబినెట్ సెక్రటరీ రాజీవ్ గౌబాకు అందించారు.
tấm xi măng cemboard thái lan
ReplyDeleteTấm Cemboard SCG Thái Lan
Tấm xốp Eco XPS Foam Panel
Tấm Cemboard Vĩnh Tường