Sim Card Rules
Sim Card Rules: ఒకటి కన్నా ఎక్కువ సిమ్ కార్డులు వాడేవారికి కేంద్రం షాక్.. నూతన మార్గదర్శకాలివే.
మనలో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ డ్యుయల్ సిమ్ కార్డ్ ఫోన్లను వాడుతుంటారు. ఇందుకోసం ఇష్టం వచ్చినట్లుగా సిమ్ కార్డులను కూడా కొనుగోలు చేస్తూ ఉంటారు. దీంతో చాలా సిమ్ కార్డులు నిరుపయోగంగా మారుతుంటాయి. అయితే ఇకపై ఆ ఛాన్స్ ఉండదు.
నిరుపయోగంగా మారుతుంటాయి. అయితే ఇకపై ఆ అవకాశం ఉండదు. ఎందుకంటే ఎవరికైనా 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులు ఉంటే, వాటికి కనెక్షన్లను డిస్కనెక్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. టెలీ కమ్యూనికేషన్ విభాగం(DoT) జారీ చేసిన ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం ఎక్కువ సిమ్ కార్డులుంటే వాటిని అధికారులు మళ్లీ ధ్రువీకరణ చేస్తారు. ఏవైనా కార్డులు వెరిఫై కాకపోతే, ఒక నెంబర్ మినహా మిగిలినవాటిని డీయాక్టివేట్ చేస్తారు. జమ్మూ, కశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో ఉండేవారికి ఆరు కార్డులను వెరిఫై చేస్తారు.
ఈ తాజా నిబంధనల ప్రకారం సబ్స్క్రైబర్లు వెంటనే వారికి కావాల్సిన సిమ్ కార్డులు ఉంచుకుని మిగిలిన వాటిని డియాక్టివ్ చేసుకోవాల్సి ఉంటుంది. తాము నిర్వహించిన డేటా విశ్లేషణల్లో వ్యక్తుల వద్ద 9 (ఈశాన్య, జమ్మూ, కశ్మీర్లో 6) కంటే ఎక్కువ మొబైల్ కనెక్షన్లు ఉన్నట్లు గుర్తించామని టెలికాం విభాగం తెలిపింది. అందుకే ఈ కనెక్షన్లను రీవెరిఫికేషన్ చేస్తామని తాజా మార్గదర్శకాల్లో పేర్కొంది. ఆర్థిక నేరాలు, ఇబ్బందికరమైన కాల్స్, మోసపూరిత కార్యకలాపాలకు సిమ్ కార్డులను వినియోగించకుండా ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించింది.
ఉపయోగంలో లేని, డేటాబేస్ నుంచి ఫ్లాగ్ చేసిన మొబైల్ కనెక్షన్లను తీసివేయాలని టెలికాం విభాగం ఆపరేటర్లను కోరింది. ఫ్లాగ్ చేసిన మొబైల్ కనెక్షన్ల అవుట్ గోయింగ్ సేవలు 30 రోజులలోపు నిలిపివేస్తామని, వినియోగదారులు వెరిఫికేషన్‌కు హాజరైతే 45 రోజులలోపు నిలిపివేస్తామని స్పష్టం చేసింది. ఒకవేళ రీ-వెరిఫికేషన్ కోసం సబ్స్క్రైబర్లు రాకపోతే, వారికి సంబంధించిన ఫ్లాగ్ చేసిన నెంబర్‌ను 60 రోజుల్లో డియాక్టివేట్ చేస్తామని, డిసెంబరు 7 నుంచి కౌంట్‌డౌన్ ప్రారంభమైందని తెలిపింది.
ఆపరేటర్లు ఫ్లాగ్ చేసిన నెంబర్‌ను ఏదైనా చట్టబద్ధత సంస్థలు, ఆర్థిక సంస్థలు ఇబ్బందికరమైన కాలర్గా నిర్ధారిస్తే సదరు నెంబర్‌కు సంబంధించిన అవుట్ గోయింగ్ సేవలు 5 రోజులలోపు, ఇన్ కమింగ్ సేవలు 10 రోజులలోపు నిలిపివేస్తారు. ఎవరూ రాని పక్షంలో 15 రోజులలోపు ఆ సిమ్ కార్డులను పూర్తిగా డిస్కనెక్ట్ చేస్తారు. ఒకవేళ చందాదారు విదేశీ పర్యటనల్లో లేదా ఆసుపత్రిలో ఉంటే, మరో 30 రోజుల అదనపు సమయాన్ని ఇస్తారు.
కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం సెప్టెంబరులో సిమ్ కార్డులకు సంబంధించిన కేవైసీ నిబంధనలను సవరించింది. వీటి ప్రకారం ప్రస్తుతం సిమ్ కార్డు తీసుకోవడానికి ఎలాంటి పత్రాలు నింపాల్సిన పనిలేదు. అలాగే ప్రీపెయిడ్ నుంచి పోస్ట్ పెయిడ్ లేదంటే పోస్ట్ పెయిడ్ నుంచి ప్రీపెయిడ్కు మారలన్నా ఇదే నిబంధన వర్తిస్తుంది.
0 Response to "Sim Card Rules"
Post a Comment