An additional burden in the name of development charges on electricity consumers who take on new connections
- కొత్తగా విద్యుత్తు కనెక్షన్లు తీసుకునే వారిపై భారం
- డిస్కంల ప్రతిపాదనకు ఏపీఈఆర్‌సీ ఆమోదం
కొత్త కనెక్షన్లు తీసుకునే విద్యుత్ వినియోగదారులపై అభివృద్ధి ఛార్జీల పేరిట అదనపు భారం పడనుంది.
* వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు కిలో వాట్‌కు ప్రస్తుతం రూ.1,200 అభివృద్ధి ఛార్జీల కింద డిస్కంలు వసూలు చేస్తున్నాయి. కొత్త ఛార్జీల ప్రకారం కిలోవాట్‌కు రూ.1,500 చెల్లించాలి.
* పరిశ్రమలు, స్థానిక సంస్థలు, తాగునీటి పథకాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, ఇతర ఎల్‌టీ కేటగిరీ వినియోగదారులు కాంట్రాక్ట్ లోడ్ ఆధారంగా కిలోవాట్‌కు రూ.2 వేల వంతున అభివృద్ధి ఛార్జీలు చెల్లించాలి. పాత ఛార్జీల ప్రకారం కిలో వాట్‌కు రూ.1,200 వంతున డిస్కంలు వసూలు చేస్తున్నాయి.
* కాంట్రాక్ట్ లోడ్ 20 కిలోవాట్లకు మించితే.. వారికి ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేయడానికి ఏపీఈఆర్‌సీ అనుమతించింది. వారి నుంచి ట్రాన్స్‌ఫార్మర్ కొనుగోలు ఖర్చును వసూలుచేసి అభివృద్ధి ఛార్జీల వసూలు నుంచి మినహాయింపు ఇవ్వాలంది.
0 Response to "An additional burden in the name of development charges on electricity consumers who take on new connections"
Post a Comment