Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Employees Strike

 AP Employees Strike : ఏపీ ఉద్యోగులపై ప్రభుత్వం కన్నెర్ర .. ఎస్మా దిశగా అడుగులు .. ఏఏ శాఖలపైఉంటుందో చూడాలి

AP Employees Strike

AP Employees Strike: ఆంధ్రప్రదేశ లో ప్రభుత్వం వర్సెస్ ఉద్యోగుల పోరు తారీ స్థాయికి చేరింది. ఇక ఎదురు చూపులు లేవని మంత్రులు కమిటీ తేల్చి చెప్పేసింది..

పీర్సీసీ జీవోలు వెనక్కు తీసుకోవడం.. లేదా జనవరిలో పాత జీతాలు ప్రాసెస్ చేస్తేనే చర్చలలకు వస్తామని ఉద్యోగ సంఘాలు పట్టు పడుతున్నాయి. దీంతో ఇక చర్చలు లేనట్టే.. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి సమ్మెకు వెళ్లాలని ఉద్యోగ సంఘాలు గట్టిగా ఫిక్స్ అయ్యాయి.. ఇప్పటికే అన్ని సంఘాలు కూడా ఏకతాటిపైకి వస్తున్నాయి. ముఖ్యంగా అత్యవసర విభాగాలు సైతం ఉద్యమంలో భాగం అవుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది.. అత్యవసర శాఖలు ఉద్యమంలో పాల్గొంటే పరిస్థితి చేయి దాటిపోతుందని ఉన్నతాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళన బాట పట్టడంతో ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామంటూ స్పష్టం చేయడంతో అలెర్టయింది ప్రభుత్వం. సమ్మె దిశగా అడుగులేస్తోన్న ఆర్టీసీ, విద్యుత్‌, వైద్యారోగ్య శాఖ ఉద్యోగులను ఎలాగైనా దారికి తీసుకురావాలని భావిస్తోంది.

అయితే ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది. ఏయే శాఖల్లోని ఉద్యోగులపై ఎస్మా ప్రయోగించవచ్చనే అంశంపై శాఖల వారీగా జాబితాను సిద్దం చేస్తోన్నట్టు సమాచారం. అత్యవసరమైతేనే ఎస్మా ఉపయోగించాలని అధికారులకు సూచిస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. ముందుగా సమ్మెను విరమింపచేసే ప్రయత్నాలు చేయలని.. తప్పని సరి పరిస్థితి తలెత్తితే.. అత్యవసర సేవలపై మాత్రమే ఈ ఎస్మా అస్త్రాలను ప్రయోగించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. సమ్మెలను నిషేధిస్తూ ఇటీవలే జీవో జారీ చేసింది విద్యుత్‌ శాఖ.

తాము సమ్మెకు వెళ్లడానికి ఆర్టీసీ ఎండీకి ప్రత్యేక నోటీసు అవసరం లేదని.. సీఎస్‌కు పీఆర్సీ సాధన సమితి ఇచ్చిన నోటీసు చాలంటున్నాయి ఉద్యోగ సంఘాలు.. ప్రభుత్వం తమ నిర్ణయం వెనక్కు తీసుకోకుండా.. ఎన్ని హామీలు ఇచ్చినా ఉద్యోగులు నమ్మే పరిస్తితి లేదని ఉద్యోగ సంఘాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఉద్యమ కార్యాచరణ నోటీసును ప్రభుత్వానికి అందచేశారు వైద్య, విద్యుత్‌ శాఖ ఉద్యోగులు. ఇదే సమంలో మరోవైపు జీతాలు, పెన్షన్ల బిల్లులు ప్రాసెస్‌కు సహకరించడం లేదు ఉద్యోగులు.

ఇప్పటి వరకు 4.50 లక్షల బిల్లులకు గానూ.. కేవలం 1.10 లక్షల బిల్లులు మాత్రమే ప్రాసెస్‌ అయ్యాయంటోంది ఆర్థిక శాఖ. పరిస్థితి చేయిదాటకుండా చూసుకునేలా చర్యలు తీసుకుంటోంది ప్రభుత్వం. ఉద్యమం నుంచి వెనక్కు తగ్గేదే లేదంటున్నారు ఉద్యోగులు. మరి ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్తుందో చూడాలి.. సమ్మె తప్పని సరి అయినప్పుడు.. ఎస్మా బాణం ప్రయోగిస్తుందా.. అంత వరకు పరిస్థితి రాకుండా ముందే దిద్దుబాటు చర్యలు చేపడుతుందా అన్నది తేలాలి..

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Employees Strike "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0