Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

  • AP Teachers Latest InfoIMP
  • More

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

CISF Constable/ Fire (Male) Recruitment 2022

 CISF Constable Jobs: 1149 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఏపీ, తెలంగాణలో ఖాళీల వివరాలు.

CISF Constable/ Fire (Male) Recruitment 2022
ప్రధానాంశాలు:
  • సీఐఎస్‌ఎఫ్‌ కానిస్టేబుల్‌ రిక్రూట్‌మెంట్‌ 2022
  • మొత్తం 1149 పోస్టుల భర్తీకి ప్రకటన
  • ఏపీ, తెలంగాణలోనూ ఖాళీలు

CISF Constable/ Fire (Male) Recruitment 2022:  భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) దేశ వ్యాప్తంగా తాత్కాలిక పాతిపదికన కానిస్టేబుల్ పోస్టుల (Constable Jobs) భర్తీకి అర్హులైన పురుష అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 1149 పోస్టులను భర్తీ చేయనుంది. వీటిలో తెలంగాణలో 30, ఆంధ్రప్రదేశ్‌లో 79 ఖాళీలున్నాయి. అర్హత, ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో ఫిబ్రవరి 4 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు పూర్తి వివరాలకు https://cisfrectt.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

మొత్తం పోస్టుల : 1149

  • తెలుగు రాష్టాల్లో ఖాళీల వివరాలు: తెలంగాణ- 30
  • ఆంధ్రప్రదేశ్‌- 79

అర్హతలు: సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన అర్హత ఉండాలి. అలాగే నిర్దేశిత శారీరక ప్రమాణాలుండాలి. పురుుష అభ్యర్ధులు మాత్రమే అర్హులు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు మార్చి 4, 2022 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్య ఉండాలి. అభ్యర్ధులు మార్చి 5, 1999 నుంచి మార్చి 4, 2004 మధ్య జన్మించి ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.21,700 నుంచి 69,100లతోపాటు ఇతర అలవెన్సులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం: ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్ట్/ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, మెడికల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

రాత పరీక్ష విధానం: పీఈటీ/పీఎస్టీలో అర్హత సాధించిన అభ్యర్ధులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. CBT మోడ్‌లో మొత్తం 100 మార్కులకు పరీక్ష ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఈ పరీక్ష ఇంగ్లీష్/హిందీ మాధ్యమాల్లో నిర్వహిస్తారు. ఐతే నెగెటివ్ మార్కింగ్ ఉండదు. అన్ని ప్రశ్నలకు రెండు గంటల్లో సమాధానాలు రాయవల్సి ఉంటుంది.

క్వశ్చన్ పేపర్ మోడల్: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్- 25 ప్రశ్నలు జనరల్ నాలెడ్జ్ అండ్ అవేర్నెస్- 25 ప్రశ్నలు ఎలిమెంటరీ మ్యాథమేటిక్స్- 25 ప్రశ్నలు ఇంగ్లీష్/హిందీ భాషా నైపుణ్యం- 25 ప్రశ్నలు ఉంటాయి.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము: ఓబీసీ, ఇతర అభ్యర్ధులు రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్ధులు ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 29.01.2022.

దరఖాస్తులకు చివరి తేదీ: 04.03.2022.

పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌:https://cisfrectt.in/

NOTIFICATION

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "CISF Constable/ Fire (Male) Recruitment 2022"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0