Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Assurance on PRC

పీఆర్సీపై భరోసా

Assurance on PRC

  • మెరుగైనదే ఇస్తాం... మీరడిగినంత ఇవ్వాలనే ఉంది
  • పరిస్థితులు సహకరించడం లేదు
  • మీరు కొద్దిగా తగ్గండి ఐదు డీఏలు కూడా సర్దుబాటు చేస్తాం
  • ఉద్యోగ నేతలతో ముఖ్యమంత్రి జగన్ భేటీ.
  • సహకరించాలని వినతి రెండు, మూడ్రోజుల్లో తేల్చేయ్యాలని నిర్ణయం

వేతన సవరణ కమిటీపై మరో రెండు, మూడు రోజుల్లో ప్రభుత్వం తుది ప్రకటన వెలువరించాలని నిర్ణయించింది. ఓ వైపు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్, మరోవైపు ఉద్యోగ సంఘాల నేతలతో క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పీఆర్సీపై సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు హాజరైన ఈ సమావేశంలో గంటన్నరకు పైగా పీఆర్సీపై ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపారు. సీఎస్ కమిటీ ప్రతిపాదించిన 14.29 ఫిట్మెంట్ సెంట్రల్ పే రివిజన్ కమిటీ సిఫార్సుల ప్రకారం నిర్ణయించా రని ఉద్యోగులు ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చారు. ఫిట్మెంట్ ప్రకటిస్తే ఐఆర్ అమల్లో ఉండదు కనుక పెంచాలని కోరారు. పదవ పీఆర్సీ ప్రకారం 43 శాతం ఫిట్మెంట్ ఇచ్చారని అంతకంటే తగ్గించటం వల్ల ప్రయో జనం ఉండదని వాదించారు. పొరుగున తెలంగాణ రాష్ట్రంలో 30 శాతం అమలు చేస్తున్నారని సీఎం దృష్టికి తెచ్చారు. వీటితో పాటు డీఏ, హెచ్ఎస్ఏ, సీసీఏ (సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్), కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, సీపీఎస్ రద్దు, ఔట్ సోర్సింగ్ వేతనాల పెంచడంతో పాటు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశారు. రాష్ట్ర ఆదాయ, వ్యయాల గురించి ఆర్థిక శాఖ ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రజంటేషన్ చేసింది. రాష్ట్ర విభజన పర్యవసనాల ఫలితంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని అధికా రులు వివరించారు. జనాభా 58.32 శాతం కాగా రెవెన్యూ 46 శాతం మాత్రమే వచ్చిందని అధికారులు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 1,70, 215 గా ఉందన్నారు. విభజనతో షెడ్యూల్ 9 పరిష్కరిం చకపోవటం వల్ల లక్షా 6 వేల కోట్ల మేరకు ఆస్తుల్ని వదులుకోవాల్సి వచ్చిందని షెడ్యూల్ 10 ద్వారా 39, 191 కోట్ల మేర ఆస్తులు కోల్పోయామని చెప్పారు రెవెన్యూ లోటు రూపంలో కేంద్రం నుంచి రూ. 18వేల 969 కోట్లు రావాల్సి ఉందని కోవిడ్ కారణంగా రాష్ట్రానికి సొంత రాబడి (స్టేట్ ఓస్ రెవెన్యూ)తో పాటు కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా కూడా గణనీయంగా తగ్గిందన్నారు. సీఎస్ కమిటీ నివేదిక ప్రకారం 14.29 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తేనే ప్రభుత్వంపై ఏటా

 రూ. 7136 భారం పడుతుందని తెలంగాణ, చత్తీస్గఢ్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్, హరియానా వంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ లోనే అధికమన్నారు. అయితే అధికారులు చెబుతున్న గణాంకాలు సరికాదని న్యాయపరంగా ఉద్యోగులకు పీఆర్సీని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఉద్యోగ నేతలు వాదించారు. తామేమీ గొంతెమ్మ కోర్కెలు కోరటంలేదని హక్కు పరంగా రావాల్సినవే అడుగుతున్నామని ముఖ్యమంత్రికి స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఉదారంగా.. మానవతా దృక్పథంతో వ్యవహరించే విషయంలో నాకంటే ఎక్కువగా స్పందించే వాళ్లు తక్కువగా ఉంటారు.. ఎవరికైనా మంచి చేయా లనేదే నా తాప త్రయం.. ఆ మంచిలో ఏ ఒక్కరూ భాగస్వాములు కాకుండా మిగలరాదనేదే నా నైజమని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర వాస్తవ పరిస్థితులను పరిగణనలోకి తీసుకోకుండా ఉండే వెసులు. బాటు కనిపించటంలేదన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ఆ ప్రభావం రాష్ట్ర భవిష్యత్పై ప్ర భావం చూపుతుందన్నారు. వాస్తవానికి ఏటా 15 శాతం వరకు ప్రభుత్వాలకు ఆదాయాలు పెరుగుతుం టాయన్నారు. అయితే గత రెండేళ్లుగా కోవిడ్ కారణంగా కోలుకోలేని దెబ్బ తగిలింది. తాజాగా ఒన్ కారణంగా రాష్ట్రా ల్లో లాక్ డౌన్లు మొదలయ్యాయి.. ఇది ఏ పరిణామాలకు దారి తీస్తుందో ఆర్థిక వ్యవస్థను ఏ రకంగా చిన్నాభిన్నం చేస్తుందో తెలీని పరిస్థితి.. ఈ సమయంలో మనం పీఆర్సీపై చర్చిస్తున్నామని ఉద్యోగ సంఘాలకు నచ్చజెప్పారు. గత ఏడాది నవంబర్తో పోలిస్తే డిసెం బర్లో ఆదాయం తగ్గింది.. అనేక రాష్ట్రాల్లో నైట్ కర్ప్యూ అమలు చేస్తున్నారు. దేశంలో తాజాగా 198వేల కేసులు నమోదు కాగా మరో 24 గంటల్లో రెండు లక్షలకు చేరవచ్చనే హెచ్చరికలు వస్తున్నాయని తెలిపారు. ఐజీఎస్ఆ, జీఎస్ఓ ఆదాయాలు కూడా తగ్గాయన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అంతా కలిసి ముందుకు సాగాల్సిన అవసరం ఉందని తేల్చిచెప్పారు.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇదీ

ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ముఖ్యమంత్రి వివరిం చారు. 2018-19లో ఎస్ఓఆరూ. 62,503 కోట్లు కాగా, 2019-20లో 60,934 కోట్లకు, 2020-21లో 60, 688 కోట్లకు చేరిందన్నారు. ప్రతి ఏటా 15 శాతం పెరుగుదల ఉండాల్సింది కరోనా కారణంగా తగ్గిందని చెప్పారు. సాధారణ పరిస్థితుల్లో అయితే రూ. 72వేల కోట్ల నుంచి 84వేల కోట్లకు పెరిగేదని వివరించారు. మరోవైపు జీతాలు, పెన్షన్లను పరిశీలిస్తే 2018-19లో ఉద్యోగులకు జీతాలు, పెన్షన్ల రూపేణ రూ. 52513 కోట్లు ఖర్చు కాగా 2020-21 నాటికి ఆ వ్యయం 67వేల 340 కోట్లకు చేరిందన్నారు. ఉద్యోగులకు అనుకూలంగా తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగానే పెరుగుదలకు కారణంగా చెప్పారు. అధికారంలోకి రాగానే ఉద్యోగులకు ప్రకటించిన 27 శాతం మధ్యంతర భృతిగా సుమారు 18 వేల కోట్లు చెల్లించామని గుర్తుచేశారు. ఇంకా జూలై 2019 నుంచి ఇప్పటి వరకు ఆ ప్రభావం ఉందని దీంతో పాటు అంగన్వాడీ, ఆశావర్కర్లతో సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు ప్ర భుత్వం వేతనాలు పెంచిందన్నారు. కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు మొత్తం 3,01,021 కాగా ఏడాదికి రూ.1.198 కోట్లు ఉన్న జీతాలు రూ.3,187 కోట్లకు పెంచామన్నారు. మినిమం టైం స్కేల్ వర్తింప చేస్తున్నామని తెలిపారు. ప్రమాదవశాత్తు ఉద్యోగులు మరణిస్తే రూ. 5 లక్షలు, సహజ మరణానికి రూ.2లక్షల ఎక్స్ గ్రేషియా వల్ల ప్ర భుత్వంపై ఏటా రూ. 360 కోట్ల మేరకు భారం పడుతోంది.. ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయటం ద్వారా 2020 జనవరి నుంచి 2021 అక్టోబర్ వరకు రూ. 5380 కోట్ల అదనపు భారం ప్రభుత్వం మోస్తోందని వివరించారు. ఇవికాక 1.28 లక్షల శాశ్వత ఉద్యోగాల కల్పనపై మరో రూ. 2300 కోట్లు ఆరోగ్య రంగంలో ఆస్పత్రుల్లో వైద్యులులేరనే అపవాదు రాకూడదనే భావనతో 14వేల మందిని నియమించటం ద్వారా రూ. 820 కోట్లు ఖజానాపై భారం పడిందన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయటం ద్వారా ఏడాదికి రూ. 2040 కోట్లు ఖర్చవుతోందని ఎసీఆర్ తగ్గుతు న్నప్పటికీ ఉద్యోగుల జీతాలు మాత్రం 52,513 కోట్ల నుంచి 67 వేల కోట్లకు పెరిగాయని, ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో తలసరి ఆదాయం 2,37,632 కాగా, ఏపీలో 1,70,215 మాత్రమే ఉందని జీతా లపై ఆ రాష్ట్రం ఖర్చుచేసేది రూ. 17వేల కోట్లు కాగా పింఛన్లు రూ. 5603 కోట్లు వెరసి రూ. 22,608 కోట్లుగా ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కాగ్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. అదే మన రాష్ట్రంలో 2021-22లో తొలి 7 నెలల జీతాలు రూ. 24,681.47 కోట్లు పెన్షన్లు రూ. 11,324 కోట్లు వెరసి సుమారు 36వేల కోట్లు చెల్లించామని పోల్చి చెప్పారు. ఇదే కాలానికి గుజరాత్లో వేతనాలు, పెన్షన్లు కలిపి రూ. 16053 కోట్లు కాగా బీహార్లో రూ.25,567 కోట్లుగా ఉందన్నారు. మధ్యంతర భృతి అమలుతో ఎంత జీతాలు చెల్లిస్తున్నామో సీఎస్ కమిటీ సిఫార్సు మేరకు 14.29 శాతం ఫిట్మెంట్ వల్ల ఏడాదికి రూ. 7137 కోట్ల భారం పడుతుందన్నారు. ఫిట్మెంట్ ఇచ్చే నాటికి డీఏలను కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. మీరు చెప్పినవన్నీ పరిగణనలోకి తీసుకుంటా.. ఎంత మంచి చేయగలిగితే అంత చేస్తానని ఉద్యోగ సంఘాలకు హామీ ఇచ్చారు. 2, 3 రోజుల్లో పీఆర్సీపై తుది ప్రకటన వెలువరిస్తామని, ఉద్యోగులు సానుకూల దృక్పథంతో స్పందించాలని కోరారు. ఆర్థికశాఖ అంచనాలు.. ఉద్యోగులు చెప్పేదానికి చాలా వ్యత్యాసం ఉందన్నారు. సమస్య పరిష్కారానికి కొద్దిగా పెంచాలని ఆర్థికశాఖను ఆదేశిస్తూ అదే సమయంలో కూడా తగ్గాలని ఉద్యోగ నేతలకు ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. నేను మీ అంచనాలు అందరి కుటుంబ సభ్యుడ్ని.. మనసా..వాచా.. మంచి చేయాలనే తపనతోనే ఉన్నా.. సహకరించాలన్నారు.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Assurance on PRC"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0