Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

If not reduced We ask why the old salaries

తగ్గకపోతే పాత జీతాలే ఎందుకు అడుగుతాం

If not reduced  We ask why the old salaries

  • జీవోలను ఉపసంహరించుకోవాల్సిందే
  • అశుతోష్ మి కమిటీ నివేదిక ఇచ్చాకే చర్చలు
  • తేల్చిచెప్తున్న ఉద్యోగ సంఘాలు
  • నేడు స్టీరింగ్ కమిటీ సమావేశం
  • రేపు సమ్మెకు అల్టిమేటం
  • చర్చలకు ససేమిరా

కొత్త పీఆర్సీ వల్ల జీతాలు తగ్గవని అధికారులు చెబుతున్న గణాంకాలు వాస్తవంకాదని ఏపీజేఏసీల నేతలు స్పష్టం చేస్తున్నారు. జీతాల్లో కోత పడకపోతే పాతజీతాలనే అమలుచేయాలని. ఎందుకు డిమాండ్ చేస్తామని ప్రశ్నిస్తున్నారు. పీఆర్సీపై ప్రభుత్వం మొండివైఖరిని అవలంబిస్తున్నందనే తాము ఆందోళనకు పూనుకుంటు న్నామని చెప్తున్నారు. సంప్రతింపుల కమిటీలో సైతం ఇదే విషయాన్ని వివరిస్తామని ఐక్యా వేదిక నాయకులు బొప్పరాజు వెంకటేశ్వర్లు, బండి శ్రీనివాసరావు, కాకర్ల వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రభకు తెలిపారు. ఆదివారం రాష్ట్రస్థాయిలో ఉద్యోగసంఘాల స్టీరింగ్ కమిటీ సమావేశంతో పాటు వివిధ టేబుల్ సమావేశాలు నిర్వహించి సోమవారం ప్రభుత్వానికి జిల్లాల్లో రౌండ్ సమ్మె అల్టిమేటం జారీ చేసేందుకు ఉద్యోగసంఘాలు సిద్ధమవుతున్నాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి వచ్చిన ఉద్యోగులకు ఇప్పటికీ నిలువనీడలేని పరిస్థితులు ఉన్నాయని అయినా ప్రభుత్వానికి సహకరిస్తున్నా ఇప్పుడున్న పరిస్థితుల్లో కోత విధిస్తే ఏరకంగా వెసులుబాటు కలుగుతుందని ప్రశ్నిస్తున్నారు.

ప్రభుత్వంతో గత మూడు విడతలుగా చర్చలు జరిపినా ప్రయోజనంలేదనేది జీవోల విడుదలతో తేటతెల్లమైందని చెప్తున్నారు. ఉద్యోగులు ఆందోళన విరమణకు ఒక్కటే మార్గమని తాజా జీవోల ఉపసంహరణతో పాటు అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికను ఉద్యోగులకు అందజేసి ఆ తరువాత మొదటి నుంచి చర్చలకు ఆహ్వానించే వరకు తమ పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని స్పష్టం చేస్తున్నాయి. జేఏసీలతో పాటు ఉద్యోగ సంఘాలు మొత్తం ఏకం కావడంతో నేడు భవిష్యత్ కార్యాచరణ ప్రకటించి ఆందోళన ఏరకంగా నిర్వహించాలనే దానిపై స్పష్టత ప్రకటించాలని నిర్ణయించాయి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "If not reduced We ask why the old salaries"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0