No Objection Certificate (NOC)
నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC)
పాస్ పోర్ట్ కు కాని, విదేశాలకు వెళ్ళడానికి అనుమతి పొందేందుకు ముందుగా నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ పొందాలి.అది ఎవరు మంజూరుచేస్తారు. ఏమేమి ధృవపత్రాలు సమర్పించాలి అను విషయంలో చాలామంది ఉపాధ్యాయులకు స్పష్టతలేదు.అట్టి విషయంలో కొంత సమాచారం.
SA,SGT,LP,PET తత్సమాన క్యాటగిరి ఉపాధ్యాయులకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ జారిచేయు అధికారం జిల్లా విద్యాశాఖాధికారి గారికి,గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు,యం.ఈ.వో ల విషయంలో RJD లకు అధికారమిస్తూ తెలంగాణ పాఠశాల విద్యాశాఖ ఆర్.సి.నం.212/SER-IV-2/2014;తేది:26-2-2015 ను జారీచేసింది.
పాస్ పోర్ట్ పొందుటకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ప్రొఫార్మా ను పూరించి 1 ఒరిజినల్ సెట్,ఒక జిరాక్స్ సెట్ సంబంధిత అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖధికారి/RJD కార్యలయంలో సమర్పించాలి. 3 పాస్ పోర్ట్ ఫొటోలు అదనంగా జత చేయాలి.
విదేశాలకు వెళ్ళుటకు అనుమతి కొరకు అయితే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ప్రొఫార్మా ను పూరించి *3* ఒరిజినల్ సెట్లు,సంబంధిత అధికారి ద్వారా జిల్లా విద్యాశాఖధికారి/RJD కార్యలయంలో సమర్పించాలి.
0 Response to "No Objection Certificate (NOC)"
Post a Comment