With these tips the cough will be eaten in minutes.
ఈ చిట్కాలతో నిమిషాల్లో దగ్గు మాయం అవుతుంది వివరాలు.
శీతాకాలం వచ్చిందంటే లెక్కలేనన్ని జబ్బులు వెంటాడుతుంటాయి. ముఖ్యంగా జలుబు, దగ్గు,తుమ్ములు వస్తాయి. వీటికి తోడు వైరల్ ఫీవర్ కూడా వస్తుంది. దగ్గు ఒక్కసారి వచ్చిందంటే దానిని నివారించడం చాలా కష్టం.
మందులు వాడుతున్నప్పటికీ కూడా కొంతమందిలో ఎన్ని రోజులకు ఈ దగ్గు తగ్గదు. అలాంటప్పుడు దగ్గు నివారించడం ఎలా అనేది ఈ చిట్కాలను చూసి తెలుసుకోండి. దగ్గు ఎక్కువగా ఉన్నప్పుడు నీటిని బాగా మరిగించి చల్లార్చి ఆ నీటిని తాగుతూ ఉండాలి. నీటిని ఒకేసారి కాకుండా కొంచెం కొంచెం తీసుకుంటూ ఉండాలి.
తులసి ఆకులు, అల్లం, మిరియాలు వీటిని బాగా వేడి నీటిలో మరిగించి, దాని కషాయాన్ని తాగడం ద్వారా దగ్గు నుండి తొందరగా ఉపశమనం లభిస్తుంది. చిన్నపిల్లలు ఈ కషాయాన్ని తాగలేరు కాబట్టి, కొంత రుచి కోసం కొద్దిగా బెల్లం లేదా చక్కెరను కలిపి వారికి తాగించవచ్చు.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా తేనే నిమ్మరసం కలిపి తాగడం వల్ల తొందరగా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.
రాత్రి పడుకునే సమయంలో ఒక గ్లాసు గోరువెచ్చటి పాలలో కి చిటికెడు పసుపు కలుపుకుని తాగడం ద్వారా దగ్గు తగ్గుతుంది. పసుపులో ఉండే కర్క్యుమిన్ యాంటీ బ్యాక్టీరియా దగ్గు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
బాగా మరిగే నీటిలో అయిదారు చుక్కల పుదీనా ఆయిల్ కలిపి ఆవిరి పట్టడం ద్వారా గొంతులో ఉన్న కఫము మొత్తం కరిగి దగ్గు నుంచి విముక్తి కలిగిస్తుంది.
0 Response to "With these tips the cough will be eaten in minutes."
Post a Comment