Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Movement until demands are met

డిమాండ్లు సాధించే వరకు ఉద్యమం


  • కలిసివచ్చే సంఘాలతో 12న రౌండ్‌టేబుల్‌
  • ఆ తరువాత భవిష్యత్‌ ఉద్యమ కార్యాచరణ
  • ఉద్యోగుల్లోనూ అసంతృప్తి ఉందన్న నేతలుజిల్లాల్లో కొనసాగిన ఆందోళనలు
  •  ఏకతాటిపైకి ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు

రివర్స్‌ పీఆర్సీపై ఉద్యమాన్ని కొనసాగించాలని ప్రధాన ఉపాధ్యాయ సంఘాలు నిర్ణయించాయి. కలిసి వచ్చే ఉద్యోగ సంఘాలనూ కలుపుకొని వెళ్లాలని నిర్ణయించాయి. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించేందుకు ఈనెల 12న రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించనున్నాయి. మరోవైపు జిల్లాల్లో ఉపాధ్యాయులు ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ద్రోహం చేసిన జేఏసీ నేతల చిత్రపటాలకు పిండ ప్రదానాలు, వారి దిష్టిబొమ్మల దహనాలు నిర్వహించారు. 

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల డిమాండ్లు సాధించే వరకు ఉద్యమాన్ని కొనసాగించాలని ఏపీ యూటీఎఫ్‌, ఏపీటీఎఫ్‌, ఎస్‌టీయూ సంఘాల నేతలు నిర్ణయించారు. ఉద్యోగుల డిమాండ్లు సాధించకుండానే సమ్మె విరమిస్తున్నట్టు ప్రకటించిన పీఆర్సీ సాధన సమితి స్టీరింగ్‌ కమిటీకి రాజీనామా చేశారు. కమిటీ సభ్యులైన యూటీఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎ్‌సఎస్‌ ప్రసాద్‌, ఎస్‌టీయూ రాష్ట్ర అధ్యక్షుడు జోసెఫ్‌ సుధీర్‌బాబు, ఏపీటీఎఫ్‌-1938 రాష్ట్ర అధ్యక్షుడు జి.హృదయరాజు మంగళవారం విజయవాడలోని యూటీఎఫ్‌ ప్రధాన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. కమిటీకి తాము రాజీనామా చేస్తున్నామని ప్రకటించారు. సుధీర్‌బాబు మాట్లాడుతూ పీఆర్సీపై నియమించిన మిశ్రా కమిటీ ఇచ్చిన రిపోర్టును తమకు ఇవ్వకుండానే ప్రభుత్వంతో చర్చలకు వెళ్లడం వల్లే ఉద్యోగులకు అన్యాయం జరిగిందన్నారు. ఈనెల 12న కలిసివచ్చే సంఘాలు, వ్యక్తులతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించి ఉద్యమ భవిష్యత్తు కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామన్నారు. రాజకీయ పార్టీల మద్దతు కోరడం లేదని, వారు అండగా నిలబడితే స్వాగతిస్తామన్నారు. కేఎ్‌సఎస్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ అనేక సంవత్సరాలుగా తమ సీనియర్లు సాధించి పెట్టిన హక్కులను కాపాడుకునేందుకు ఉద్యమాన్ని కొనసాగిస్తామన్నారు. హృదయరాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీఆర్సీ అంశాన్ని పోలవరం ప్రాజెక్టులా సాగదీస్తూ గందరగోళం సృష్టిస్తోందన్నారు.   జిల్లాలో నిరసనలు..: రివర్స్‌  పీఆర్సీని వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఉపాధ్యాయులు నిరసనలు కొనసాగించారు. నల్లబ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యారు. అనంతపురం జిల్లాలో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు సైతం నిరసనలు తెలిపారు. తమ డిమాండ్లను అంగీకరించాలంటూ సీఎం జగన్‌కు బుధవారం మెయిల్స్‌ పంపుతామని కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సంఘం జేఏసీ నాయకులు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలో టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ యలమంచిలి, పాలకొల్లు తదితర మండలాల్లోని పాఠశాలలను సందర్శించి పీఆర్సీ నష్టంపై ఉపాధ్యాయులతో చర్చించారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్‌ నేతృత్వంలో టీచర్లు బిక్షాటన చేసి నిరసన తెలిపారు. టీచర్లకు చేతిలో సీఎం ఖాళీ చిప్ప పెట్టారని నిప్పులు చెరిగారు. కాగా, టీచర్ల సంఘాల మండలస్థాయి నాయకులను సమాచార సేకరణ కోసమంటూ పోలీసులు స్టేషన్లకు పిలిపించుకుని ఒత్తిళ్లు తెస్తున్నారని ఫ్యాప్టో నాయకులు ఆరోపించారు. ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచి రాత్రికి రాత్రే ఉద్యమాన్ని నీరుగార్చిన ఉద్యమ ద్రోహులకు తూర్పు గోదావరి జిల్లా కూనవరం బస్టాం డ్‌ దగ్గర ఉద్యమద్రోహుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. కర్నూలు దామోదరం సంజీవయ్య నగరపాలక ఉన్నత పాఠశాలలో టీచర్లు స్టీరింగ్‌ కమిటీ సభ్యుల చిత్రపటాలకు పిండ ప్రదానం చేశారు. విశాఖ జిల్లా అనకాపల్లి గాంధీనగరం జీవీఎంసీ హైస్కూల్‌లో మధ్యాహ్నం భోజన విరామ సమయంలో ఉపాధ్యాయులు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు.

దీక్ష చేసిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్‌

చిత్తూరు జిల్లా నిమ్మనపల్లె మండలం బాలినాయనిపల్లె హైస్కూల్‌లో టీచర్‌ విష్ణువర్ధన్‌రెడ్డి(వైఎస్సార్‌ టీఎఫ్‌ నేత) 48 గంటలదీక్ష మంగళవారం సాయంత్రంతో ముగిసింది. తోటి ఉపాధ్యాయులు ఆయనను సన్మానించి, దీక్షను విరమింపజేశారు. అయితే, విష్ణువర్ధనరెడ్డిని ప్రభుత్వం సస్పెండ్‌ చేసింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు డీఈవో శేఖర్‌, ఎంఈవో రాజగోపాల్‌ ద్వారా విచారించి ఈ చర్యలకు ఉపక్రమించారు.

ఉద్యోగులకే క్షమాపణ చెప్పాలి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌  అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.రాజారావునలుగురు జేఏసీ నాయకులు ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పడం కాదని, ఉద్యోగులకు క్షమాపణలు చెప్పాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు డిమాండ్‌ చేశారు. ఉద్యోగులకు అన్యాయం చేయడంతోపాటు, ఇక భవిష్యత్‌లో ఉద్యోగులు తమ హక్కుల కోసం పోరాడేందుకు భయపడే పరిస్థితిని ఆ నాయకులు తీసుకువచ్చారన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Movement until demands are met"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0