Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Are teacher unions making a mistake?

 ఉపాధ్యాయ సంఘాలు తప్పు చేస్తున్నాయా?

Are teacher unions making a mistake?

కొత్త పీఆర్సీ రూపంలో ఉద్యోగులు, టీచర్లకు జీతాలు, రిటైరయిన వారికి పెన్షన్లు పడిపోయిన తర్వాత జీతాలు, పెన్షన్ల విషయంలో అందరికీ క్లారిటి వచ్చేసింది.

జీతాలు, పెన్షన్లలో కచ్చితంగా పెరుగుదల కనిపించింది. వాళ్ళు ఆశించిన స్ధాయిలో పెరగకపోయినా పెరింగిదనేది మాత్రం వాస్తవం. ఉద్యోగుల బేసిక్ ఆధారంగా చాలామందికి సుమారు రు. 8 వేల నుండి రు. 30 వేల వరకు పెరిగింది. అలాగే పెన్షనర్లలో సుమారు రు. 8 వేల నుండి రు. 20 వేలు పెరిగిన వారుకుడా ఉన్నారు.

జీతాలు, పెన్షన్లు పెరిగిన తర్వాత కూడా ఉద్యోగులు, టీచర్లు సమ్మె చేయటం ఏమిటనేది సమాజంలోని వివిధ వర్గాల నుండి ఎదురవుతున్న ప్రశ్న. సరే మొత్తానికి సమ్మెను విరమించుకుంటున్నట్లు పీఆర్సీ సాధన సమితి ప్రకటించింది. అయితే ఇక్కడే ఉపాధ్యాయసంఘాలు ఆందోళన మొదలుపెట్టాయి. వీళ్ళ ఆందోళన సక్సెస్ అవుతుందా లేదా అన్న విషయాన్ని పక్కనపెట్టేద్దాం. అసలు వీళ్ళ డిమాండులోనే లోపముందనేది మెజారిటి జనాల ఆరోపణ.

జనాల వాదన ఏమిటంటే జీతాలు పెరగాలని ఇంతగా ఆందోళన చేస్తున్న ఉపాధ్యాయులు ఏనాడైనా విద్యావ్యవస్ధలోని లోపాలను సరిదిద్దాలని డిమాండ్ చేశారా ? చాలా స్కూళ్ళు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న సమస్యలున్నాయి. ఉపాధ్యాయుల కొరత పట్టి పీడిస్తోంది. స్కూళ్ళల్లో మౌళిక సదుపాయాలు ఉండటంలేదు. టీచర్ల నియామకాలు ఆగిపోయాయి. స్కూళ్ళల్లో ఉత్తీర్ణతా శాతం తగ్గిపోతోంది. చదువుకునే పిల్లల సంఖ్య తగ్గిపోతోంది. ఇలాంటి అనేక సమస్యలు ప్రత్యక్షంగా పట్టిపీడిస్తున్నా ఉపాధ్యాయ సంఘాలు ఏరోజన్నా వీటి పరిష్కారం కోసం ఆందోళనలు, సమ్మెలు చేశాయా ?

ఎంతమంది టీచర్లు తాము పనిచేస్తున్న స్కూళ్ళున్న ఊర్లలోనే ఉంటున్నారు ? ఎంతమంది టీచర్లు సక్రమంగా స్కూళ్ళకు వెళ్ళి పాఠాలు చెబుతున్నారు ? టీచర్లలో చిట్టీలు, వడ్డీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటున్న వాళ్ళు, ఇన్స్యూరెన్స్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వాళ్ళు లేరా ? తమ స్కూళ్ళకు సెలవులు పెట్టో పెట్టకుండానో మ్యానేజ్ చేస్తు ప్రైవేటు స్కూళ్ళల్లో పనిచేస్తున్నవాళ్ళు లేరా ? అని జనాలు0ల్ నిలదీస్తున్నారు. అంకితభావంతో పనిచేస్తున్న టీచర్లు కూడా ఉన్నారు. కాబట్టే విద్యా వ్యవస్ధ ఇంతమాత్రంగా అయినా ఉంది.

జనాల బాధంతా సక్రమంగా పనిచేయని టీచర్ల గురించే. స్కూళ్ళ బాగుకోసం, టీచర్ల నియామకాల కోసం, స్కూళ్ళల్లో మౌళిక సదుపాయాల ఏర్పాటు కోసం టీచర్లు ఆందోళనలు చేస్తే జనాలు కూడా మద్దతిచ్చేవారే. అలాకాకుండా తాము ఆశించినంత జీతాలు పెరగలేదనే కారణంతో ఆందోళనలని, సమ్మెలని రోడ్డెక్కుతున్నారు కాబట్టే సమాజం నుండి వీళ్ళకు మద్దతు దొరకటంలేదు. కాబట్టి తాము చేస్తున్నది తప్పో ఒప్పో టీచర్ల సంఘాలే ఆలోచించుకోవాలి.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Are teacher unions making a mistake?"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0