Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

'Career Week in schools from 14th

14 నుంచి పాఠశాలల్లో ' కెరీర్ వీక్

'Career Week in schools from 14th

 వృత్తుల ఎంపికపై అవగాహన

ప్రభుత్వ , జడ్పీ , పురపాలక , కార్పొరేషన్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు భవిష్యత్తు కోర్సులు , జీవితంలో స్థిరపడేందుకు ఎంచుకోవాల్సిన కెరీర్ గురించి అవగాహన కల్పించనున్నారు ఉన్నత పాఠశాలల్లో 9 , 10 వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడేలా ఈ కార్యక్రమాన్ని తీర్చిదిద్దారు .

పాఠశాలల్లో కెరీర్ గైడెన్సుపై ఉన్నత ఉపాధ్యాయులకు డైట్ అధ్యాపకులు , ప్రత్యేక రిసోర్సు పర్సన్లు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు . ఈ ఉపాధ్యాయులు తరగతి గదిలో విద్యార్థులకు కెరీర్పై మార్గదర్శనం చేస్తారు

ఈ నెల 14 నుంచి 19 వ తేదీ వరకు ' కెరీర్ వీక్ ' నిర్వహించనున్నారు . ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో 9 , 10 వ తరగతుల విద్యార్థులకు రోజూ రెండు పిరియడ్లు కెరీర్పై అవగాహన కల్పిస్తారు . 14 న ముందుస్తు పరీక్ష , 19 న తుది పరీక్ష నిర్వహించి వారి ప్రత్యేక సామర్థ్యాల్ని అంచనా వేస్తారు . వీటి ఆధారంగా వారు ఏ కెరీర్లో రాణించే అవకాశం ఉందో తెలియజేస్తారు . దీనికి సంబంధించి విద్యార్థులకు , ఉపాధ్యాయులకు ప్రత్యేక బోధన సామగ్రి పంపారు .

కార్యక్రమం ఇలా 

  • ఈ నెల 14 న విద్యార్థి కుటుంబంలో ఉన్న వృత్తులు , రోల్ మోడల్ గురించి చెప్పి ముందస్తు పరీక్ష నిర్వహిస్తారు .
  • 15 న విద్యార్థి బలాలు , వాటిని ఉపయోగించుకునే విధానం , అతనికి ఇష్టమైన కెరీర్ను అంచనా వేసి సొంతంగా అవగాహ పొందే విధంగా మార్గదర్శనం చేస్తారు .
  • 16 న హాల్ల్యాండ్ కెరీర్ కోడ్ పరీక్ష నిర్వహిస్తారు
  • 17 న వృత్తులకు సంబంధించిన , విద్యాపరమైన సమాచారం , జాబ్ కార్డులు , కెరీర్ను ఎంచుకునే విధానం గురించి చెబుతారు .
  • 18 న విద్యార్థి భవిష్యత్తు ప్రణాళిక , తన ప్రత్యేకను చాటుకునే విధానంపై వివరిస్తారు .

19 న కెరీర్ డే వేడుకలు 

తాను ఎంచుకున్న కెరీర్కు  అనుగుణమైన దుస్తులు ధరించటం , ' నా కెరీర్ - నా ఎంపిక అనే అంశంపై రెండు నిమిషాల వీడియోను సంబంధిత విద్యార్థితో చేయిస్తారు . అదే రోజు రెండో పూట అతిథి ఉపన్యాసాలు , తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు .

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "'Career Week in schools from 14th"

  1. It is a good and great program implemented ap government which is very usefulfor children to choose their career to lead better life.children can able to understand select their occupation according to their ability and interest s..

    ReplyDelete

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0