Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

As if the Committee of Ministers talks on the PRC had failed

PRC పై మంత్రుల కమిటీ చర్చలు విఫలమైనట్లే : బండి శ్రీనివాస్

As if the Committee of Ministers talks on the PRC had failed

  • చలో విజయవాడకు నో పర్మిషన్
  • విజయవాడ సీపీ కాంతిరాణా టాటా

 కొత్త పీఆర్సీ జీవోల అంశంపై మంత్రుల కమిటీతో చర్చలు విఫలమైనట్లేనని ఏపీ జేఏసీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి శ్రీనివాస్ వెల్లడించారు . ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుందన్నారు . ఉద్యోగ సంఘాలు చేపట్టిన చలో విజయవాడను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు . ఉద్యోగులను భయపెట్టవద్దని కలెక్టర్లకు విజ్ఞప్తి చేశారు . ప్రభుత్వానికి వత్తాసు పలికే పనులను కలెక్టర్లు మానుకోవాలని హితవు పలికారు . సమ్మె , ఆందోళన తాత్కాలికమనీ , మళ్లీ అందరూ కలిసే పని చేయాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. చర్చలకు పిలిచి గతంలో ఏం చేశారో ఇప్పుడూ అదే చేశారు . కొత్త పీఆర్సీతో నష్టపోతున్నట్లు పదేపదే చెప్పాం . ఇవాల్టి మంత్రుల భేటీలోనూ పాత అంశాలపైనే మాట్లాడారు . మేం చెప్పిన 3 అంశాలపై తేల్చాలని స్పష్టం చేశాం . మేం చెప్పిన అంశాల పరిష్కారం సాధ్యపడదని చెప్పారు . " అని మంత్రులు భేటీ అనంతరం బండి శ్రీనివాస్ మీడియాకు వెల్లడించారు. వేతన సవరణను ప్రహసనంలా మార్చారు : సూర్యనారాయణ వేతన సవరణను ఏపీ ప్రభుత్వ ప్రహసనం మార్చిందని ఏపీ ప్రభుత్వ ఉద్యోగస్తుల సంఘ అధ్యక్షుడు సూర్యనారాయణ అన్నారు . నిర్బంధ వేతన సవరణను నిలుపుదల చేయాలని కోరామని , బలవంతంగా కొత్త జీతాలు ఇవ్వడాన్ని ఖండిస్తున్నామని అన్నారు . డీఏ బకాయిలతో జీతాలు పెరిగాయనడం ఉద్యోగులను మోసం చేయడమేనని ఆయన వ్యాఖ్యానించారు . మా డిమాండ్లు అసంబద్ధమైనవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సమాచారం పంపినట్లు చెప్పారు . ఉద్యమ కార్యాచరణ యథావిధిగా జరుగుతుందన్నారు .

చలో విజయవాడకు నో పర్మిషన్

విజయవాడ సీపీ కాంతిరాణా టాటా

 పీఆర్సీ సాధన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన 'చలో విజయవాడ'కు పోలీసులు బ్రేక్ వేశారు. విజయవాడ బీఆర్టీ ఎస్ రోడ్డులో గురువారం ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఐదువేల మందితో నిరసన నిర్వహించేందుకు పీఆర్సీ సాధన కమిటీ పిలుపునిచ్చింది. అయితే కోవిడ్ నిబంధనల అమలు కారణంగా ఈ ప్రదర్శనకు అనుమతి నిరాకరిస్తున్నట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా టాటా స్పష్టం చేశారు. పీఆర్సీ సాధన కమిటీ సభ్యులు 5 వేల మందితో పాదయాత్ర నిర్వహించేందుకు కోరిన అనుమతిని కోవిడ్ కారణంగా తిరస్కరించినట్లు తెలిపారు. కరోనా మూడో దశ నేపథ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాల్సి ఉందన్నారు. 'చలో విజయవాడ' కార్యక్రమానికి దరఖాస్తులో పేర్కొన్న సంఖ్య కన్నా భారీ సంఖ్యలో ఉద్యోగస్తులు వచ్చే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల సమాచారం ప్రభుత్వానికి అందింది. మరోవైపు విజయవాడలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమలులో ఉన్నాయని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని ఆయన హెచ్చరించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "As if the Committee of Ministers talks on the PRC had failed"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0