Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Employees Chalo Vijayawada

 Employees Chalo Vijayawada : ఉద్యోగుల ' చలో విజయవాడ'కు ఆంక్షలు ముందస్తు అరెస్టులు.

Employees Chalo Vijayawada

Employees chalo vijayawada: ఉద్యోగుల చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. వివిధ జిల్లాల్లోని ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేసి.. కార్యక్రమానికి వెళ్లొదని నోటీసులు జారీ చేశారు.

Employees chalo vijayawada: ఉద్యోగుల 'చలో విజయవాడ' కార్యక్రమానికి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. 'చలో విజయవాడ'కు పోలీసులు అనుమతి నిరాకరించారు. ఉద్యోగులను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. వివిధ జిల్లాల్లో ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేశారు. 'చలో విజయవాడ'కు వెళ్లొద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పలువురికి ఇప్పటికే నోటీసులు జారీచేశారు. ఉద్యోగసంఘాల నాయకుల ఇళ్ల చిరునామాలు సేకరిస్తున్నారు. అలాగే విజయవాడకు వెళ్లే వారి వివరాలు సేకరించాలని వాలంటీర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది.

కృష్ణాజిల్లా

కృష్ణా జిల్లాలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. 'చలో విజయవాడ'కు వెళ్లవద్దంటూ ముందస్తు హెచ్చరికలు జారీ చేశారు. నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లో ఉద్యోగుల ఇళ్లకు వెళ్లిన పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగ సంఘాలతో నిన్ని రాత్రి నందిగామ డీఎస్పీ సమావేశం నిర్వహించారు. ఈ ఉదయం పోలీస్ స్టేషన్ రావాలని ఉద్యోగ సంఘాల నాయకులను కోరారు. దీంతో ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తోందని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి.

గుంటూరు జిల్లా

'చలో విజయవాడ'కు వెళ్లకుండా గుంటూరులో పోలీసుల ఆంక్షలు విధించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు.

పశ్చిమగోదావరి జిల్లా 

పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యోగ సంఘ నాయకులకు పోలీసులు ఫోన్లు చేశారు. చలో విజయవాడకు వెళ్లవద్దని హెచ్చరికలు చేశారు. అయితే నిన్న రాత్రే ఉద్యోగ సంఘం జిల్లా ప్రధాన నాయకులు విజయవాడ వెళ్లారు. మూడో శ్రేణి ఉద్యోగ నాయకులను పోలీసులు గృహనిర్భందం చేశారు.తూర్పుగోదావరి జిల్లాలో...

తూర్పుగోదావరి జిల్లా

పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు. ప్రత్తిపాడు ఎన్జీవో అధ్యక్షుడు కామిశెట్టి రాంబాబును గృహనిర్భంధం చేశారు. తుని జాతీయ రహదారిపై పోలీస్ చెక్​పోస్టును ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల నాయకులను విజయవాడకు వెళ్లకుండా నియంత్రిస్తున్నారు.

విశాఖ జిల్లా

చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. చలో విజయవాడకు అనుమతి లేదని విశాఖ జిల్లా అక్కడి ఉద్యోగులకు సమాచారం అందించారు.విజయనగరం జిల్లాలో...

విజయనగరంలో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టారు.బొబ్బిలిలో యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి విజయగౌరిని గృహనిర్బంధం చేశారు.

శ్రీకాకుళం జిల్లా

శ్రీకాకుళం జిల్లాలో 'చలో విజయవాడ'కు ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి బయల్దేరేందుకు ఏర్పాట్లు చేసుకోగా... పోలీసులు ఆంక్షలు విధించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నేతలకు ఫోన్లు చేసిన పోలీసులు కొవిడ్ దృష్ట్యా విరమించుకోవాలని సూచించారు.

చిత్తూరు జిల్లా

చలో విజయవాడ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకునేందుకు యత్నిస్తున్నారు. చిత్తూరులో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతల ఇళ్లకు వెళ్లిన పోలీసులు వారిని గృహనిర్బంధం చేశారు.

నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లాలో చలో విజయవాడ కార్యక్రమం భగ్నం చేసేందుకు పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. నెల్లూరు, గూడూరు, వాకాడు, వరికుంటపాడులో పోలీసులు అరెస్టు చేశారు. ఆత్మకూరులో ఉపాధ్యాయులను పోలీసులు గృహ నిర్భంధం చేశారు. పీఆర్సీ సాధన సమితి నేత చేజర్ల సుధాకర్​రావు పోలీసులు అదుపులోకి తీసుకోని నెల్లూరు ఒకటో పోలీస్ స్టేషన్​కు తరలించారు.

అనంతపురం జిల్లా

అనంతపురం నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో పోలీసుల మోహరించారు. చెక్​పోస్టులు ఏర్పాటు చేసి నిఘా పెంచారు. బుక్కరాయసముద్రం, నార్పల క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపట్టగా... హిందూపురంలో ఎన్జీవో నేత నరసింహులును గృహనిర్భంధం చేశారు.

ఒంగోలు జిల్లా

చలో విజయవాడకు వెళ్తున్న ఉద్యోగ సంఘాలకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. కొవిడ్‌ నిబంధనలు ఉన్నందున అనుమతి లేదని నోటీసుల్లో పేర్కొన్నారు. ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శరత్‌ను ఒంగోలులో గృహనిర్బంధం చేశారు.

విజయవంతం చేస్తాం.

నిర్బంధంతో తమ పోరాటాన్ని ప్రభుత్వం ఆపలేదని.. స్టీరింగ్ కమిటీ నేత ఆస్కార్‌రావు తెలిపారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని స్పష్టం చేశారు. ఉద్యమ కార్యాచరణ యథావిధిగా కొనసాగుతుందంటున్నారు.'చలో విజయవాడ'కు పోలీసుల అనుమతి నిరాకరణ

మరోవైపు ఉద్యోగుల ఫిబ్రవరి 3న తలపెట్టిన 'చలో విజయవాడ'కు పోలీసుల అనుమతి నిరాకరించారు. ఆ కార్యక్రమానికి అనుమతి లేదని విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా స్పష్టం చేశారు. కొవిడ్‌ దృష్ట్యా ఉద్యోగసంఘాలకు అనుమతి ఇవ్వలేదని వెల్లడించారు.

"చలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి లేదు. కొవిడ్‌ దృష్ట్యా ఉద్యోగసంఘాలకు అనుమతి ఇవ్వలేదు. 200 మందితోనే బహిరంగ కార్యక్రమాలకు అనుమతి ఉంది. 5 వేల మంది వస్తామని ఉద్యోగులు దరఖాస్తులో పేర్కొన్నారు. అంతమంది సభకు వస్తే నిబంధనలు ఉల్లంఘించినట్లవుతుంది. దయచేసి చలో విజయవాడ కార్యక్రమానికి ఉద్యోగులు ఎవరూ రావద్దు." -కాంతిరాణా, విజయవాడ సీపీ

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Employees Chalo Vijayawada"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0