Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good news for those who are buying a new home ..! This is the right time ..!

 కొత్త ఇంటిని కొనుగోలు చేసే వారికి శుభవార్త ఇదే సరైన సమయం.

Good news for those who are buying a new home ..!  This is the right time ..!


వచ్చే ఆర్థిక సంవత్సరానికిగాను కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌-2022 సామాన్యులకు నిరాశే మిగిల్చింది. ఆదాయపు పన్ను శ్లాబ్స్‌లో ఎలాంటి మార్పులు లేక పోవడంతో బడ్జెట్‌ చాలా మందిని నిరాశ పర్చింది.

కాగా భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తాజా నిర్ణయం కొత్తగా ఇంటిని కొనుగోలుచేసే వారికి శుభవార్తను అందించింది.

రెపో రేట్లు యథాతథం..!
ఆర్బీఐ నిర్వహించిన మానిటరీ పాలసీ కమిటీ (MPC) రెపో, రివర్స్ రెపో రేట్లను యథాతథంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. దీంతో దేశంలోని నివాస గృహాలకు డిమాండ్ మరింత పెరుగుతుందని రియల్ ఎస్టేట్ డెవలపర్లు అంచనా వేస్తున్నారు. మూడు రోజుల సుదీర్ఘ ద్వైమాసిక ఎంపీసీ సమావేశం తర్వాత, కమిటీ రెపో , రివర్స్ రెపో రేట్లను వరుసగా 4 శాతం, 3.35 శాతం గా ఉంచింది. రెపో రేట్‌ యథాతథంగా ఉండడంతో బ్యాంకులు రుణదాతలకు ఇచ్చే వడ్డీ రేట్లు అలాగే ఉంచే అవకాశం ఉంది.

గృహ రుణాలపై వడ్డీ రేట్లు అలాగే..!
రియల్‌ ఎస్టేట్‌ నిపుణుల అభిప్రాయం ప్రకారం...ఆర్బీఐ నిర్ణయం గృహనిర్మాణ పరిశ్రమకు మరింత ప్రయోజనకరంగా ఉండనుంది. దీంతో కొంత ఇంటిని కొనుగోలుదారులు చేసే వారికి తక్కువ వడ్డీకే రుణాలను పొందుతారు. ప్రస్తుతం చాలా ప్రముఖ బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు అందించే వడ్డీ రేట్లు 6.4-6.9 శాతం మధ్య ఉన్నాయి.

రియల్‌ ఎస్టేట్‌కు జోష్‌..!
రియల్ ఎస్టేట్ రంగం రికవరీ వైపు రావడానికి ఈ నిర్ణయం ఎంతగానో ఉపయోగపడుతుందని ఏబీఏ కార్పోరేషన్‌ డైరెక్టర్, క్రెడాయ్‌ వెస్ట్రన్ యూపీ ప్రెసిడెంట్ అమిత్ మోడీ అభిప్రాయపడ్డారు. ఆర్‌బిఐ తీసుకున్న అనుకూల వైఖరి ఆర్థిక వాతావరణాన్ని పెంపొందిస్తుందని ఆయన అన్నారు. తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లు ఉన్నందున ఇప్పటికీ కొత్త గృహాలను కొనుగోలు చేయగల గృహ కొనుగోలుదారులకు ఇది సానుకూలంగా ఉంటుందని భారతీయ అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ డెవలప్‌మెంట్ కంపెనీ సీఈఓ-రెసిడెన్షియల్, అశ్విందర్ ఆర్. సింగ్ తెలిపారు. కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమని రియల్‌ ఎస్టేట్‌ రంగ నిపుణుల అభిప్రాయపడ్డారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good news for those who are buying a new home ..! This is the right time ..!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0