Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New districts from Ugadi festival review meeting details

ఉగాది నాటికి కొత్త జిల్లాలు.. సీఎం జగన్‌ కీలక ఆదేశాలు..

New Districts - Teachers' Situation.


ఉగాది నాటికి కొత్త జిల్లాల నుంచి కలెక్టర్లు, ఎస్పీలు కార్యకలాపాలు సాగించాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు సన్నాహకాలు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లాల పునర్విభజనపై తాడేపల్లిలోని తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం గురువారం సమీక్ష చేపట్టారు. కొత్త జిల్లాల ప్రతిపాదనలు, ప్రాతిపదికలను సీఎంకు అధికారులు వివరించారు. కొత్త జిల్లాల మ్యాపులు, జిల్లా కేంద్రాల నిర్ణయం వెనుక తీసుకున్న ప్రాధాన్యతలను వివరించారు.  అలాగే ప్రతిపాదనలపై వస్తున్న అభ్యంతరాలు, సలహాలు, సూచనలు కూడా నిశితంగా పరిశీలిస్తున్నామని అధికారులు తెలిపారు.

ఈ సందర్భంగా సీఎం ఏమన్నారో వివరణ

  • కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత… యంత్రాంగం అంతా సమర్థవంతంగా పనిచేయాలి
  • కొత్త జిల్లాలో పని ప్రారంభమైన తర్వాత ఎలాంటి అయోమయం ఉండకూడదు, పాలన సాఫీగా ముందుకు సాగాలి
  • దీనికోసం సన్నాహకాలను చురుగ్గా, వేగంగా, సమర్థవంతంగా మొదలు పెట్టాలి
  • వచ్చే ఉగాది నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు కావాలి
  • ఉగాది నాటికి కొత్త జిల్లాల కలెక్టర్లు , ఎస్పీలు.. ఆయా జిల్లాకేంద్రాల నుంచి పనిచేయాలి
  • ఉద్యోగుల విభజన, మౌలిక సదుపాయాల ఏర్పాటు, కొత్త భవనాలు వచ్చేలోగా యంత్రాంగం పనిచేయడానికి అవసరమైన భవనాల గుర్తింపు.. అన్నిరకాలుగా కూడా సిద్ధం కావాలి
  • కొత్తగా మౌలిక సదుపాయాలు ఏర్పాటయ్యేలోగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు కావాల్సిన భవనాలు తదితర వాటిని గుర్తించాలి
  • అలాగే కొత్త భవనాల నిర్మాణంపైనా ప్రణాళికలను ఖరారు చేయాలి
  • అందుకోసం స్థలాల గుర్తింపుపై దృష్టిపెట్టాలి
  • అభ్యంతరాల విషయంలో హేతుబద్ధత ఉన్నప్పుడు దానిపై నిశిత పరిశీలన చేయాలి
  • నిర్ణయం తీసుకునేముందు వారితో మాట్లాడ్డం అన్నది చాలా ముఖ్యం
  • దీనికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నాను

ఇప్పుడున్న కలెక్టర్లు, ఎస్పీలే కొత్త జిల్లాలకు.

  • ఇప్పుడున్న జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలనే కొత్త జిల్లాలకు పంపాలని సీఎం ఆదేశం
  • వీరికున్న అనుభవం కొత్త జిల్లాలకు ఉపయోగపడుతుందన్న సీఎం
  • పరిపాలన సాఫీగా సాగడానికి వీరి అనుభవం ఉపయోగపడుతుందన్న సీఎం
  • వీరు కొత్త జిల్లాల్లో మౌలికసదుపాయాలు, పాలన సాఫీగా సాగేందుకు వీలుగా సన్నాహకాలను పరిశీలిస్తారన్న సీఎం
  • స్థానిక సంస్థల (జిల్లాపరిషత్‌ల విభజన) విషయంలో కూడా అనుసరించాల్సిన విధానాన్ని న్యాయపరంగా, చట్టపరంగా పరిశీలించి తగిన ప్రతిపాదనలు తయారుచేస్తామన్న అధికారులు.

పెద్ద జిల్లా ప్రకాశం.. చిన్న జిల్లా విశాఖ 

  • ప్రకాశం జిల్లా విస్తీర్ణం 14,322 చదరపు కిలోమీటర్లు  
  • విశాఖ జిల్లా విస్తీర్ణం 928 చదరపు కిలోమీటర్లు 
  • కొత్తగా రెండు గిరిజన జిల్లాలు.. అల్లూరి, మన్యం 
  • అల్లూరి జిల్లాలో అతి తక్కువగా 3 నియోజకవర్గాలు

జిల్లాలు వాటి నియోజకవర్గాలు

శ్రీకాకుళం : (ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, శ్రీకాకుళం, ఆముదాలవలస, పాతపట్నం+ఎచ్చెర్ల,

విజయనగరం : 7నియోజకవర్గాలు (విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లి, గజపతినగరం, బొబ్బిలి, రాజాం,+ఎస్‌కోట)

వైజాగ్ జిల్లా : భీమిలి, గాజువాక, విశాఖ ఈస్ట్‌, వెస్ట్‌, నార్త్, సౌత్‌

అనకాపల్లి : 7నియోజకవర్గాలు... ( అనకాపల్లి,చోడవరం, పాయకరావుపేట,పెందుర్తి,  యలమంచిలి,మాడ్గుల, నర్సీపట్నం. 

అరకు : 3 నియోజకవర్గాలు (అరకు,పాడేరు,రంపచోడవరం)

పార్వతీపురం : నాలుగు నియోజకవర్గాలు(పార్వతీపురం,కురుపాం,సాలూరు, పాలకొండ)

రాజమండ్రి : కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం,రాజమండ్రిసిటి, రాజమండ్రి రూరల్‌, రాజానగరం, అనపర్తి

కాకినాడ : కాకినాడ, కాకినాడ రూరల్, పిఠాపురం, ప్రత్తిపాడు, జగ్గంపేట, తుని, పెద్దాపురం

అమలాపురం : అమలాపురం, పి.గన్నవరం, రాజోలు, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట, రామచంద్రపురం

ఏలూరు : ఏలూరు, చింతలపూడి, దెందులూరు, పోలవరం,ఉంగుటూరు, నూజివీడు,కైకలూరు

నరసాపురం : నరసాపురం, ఉండి, భీమవరం, పాలకొల్లు, ఆచంట, తణుకు,తాడేపల్లిగూడెం.

విజయవాడ : విజయవాడ ఈస్ట్‌, వెస్ట్, సెంట్రల్‌, నందిగామ,జగ్గయ్యపేట, మైలవరం, తిరువూరు

మఛిలీపట్నం : మఛిలీపట్నం, పెడన, గుడివాడ, పామర్రు, పెనమలూరు, అవనిగడ్డ, గన్నవరం.

బాపట్ల : బాపట్ల, రేపల్లే,వేమూరు,చీరాల,పరచూరు,అద్దంకి

గుంటూరు : గుంటూరు వెస్ట్‌, గుంటూరు ఈస్ట్‌, ప్రత్తిపాడు,పొన్నూరు, తాడికొండ, తెనాలి, మంగళగిరి

నరసరావుపేట : నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి, గురజాల, వినుకొండ, మాచర్ల, పెదకూరపాడు

ఒంగోలు : ఒంగోలు, కొండపి,దర్శి, కనిగిరి, గిద్దలూరు,మార్కాపురం,ఎర్రగొండపాలెం + సంతనూతలపాడు

నెల్లూరు : నెల్లూరుసిటీ, నెల్లూరు రూరల్‌, కోవూరు,కావలి,ఆత్మకూరు, ఉదయగిరి,కందుకూరు+సర్వేపల్లి

తిరుపతి : తిరుపతి,శ్రీకాళహస్తి,సత్యవేడు, వెంకటగిరి, గూడురు, సూళ్లూరుపేట+చంద్రగిరి

చిత్తూరు :చిత్తూరు, నగరి, గంగాధర నెల్లూరు,పూతలపట్టు, పలమనేరు, కుప్పం+పుంగనూరు

రాజంపేట : రాజంపేట, రైల్వేకోడూరు,రాయచోటి, పీలేరు, మదనపల్లి, తంబళ్లపల్లి

కడప : కడప, పులివెందుల, జమ్మలమడుగు,పొద్దుటూరు, కమలాపురం,మైదుకూరు, బద్వేలు

నంద్యాల : నందికట్కుకూరు,శ్రీశైలం, ఆళ్లగడ్డ, డోన్‌, బనగానపల్లి, నంద్యాల

కర్నూలు : కర్నూలు,కొడుమూరు, ఎమ్మిగనూరు,ఆదోని, మంత్రాలయం, ఆలూరు,పత్తికొండ+పాణ్యం

అనంతపురం : అనంతపురం, సింగనమళ,తాడిపత్రి, గుంతకల్లు, ఉరవకొండ, కళ్యాణదుర్గం,రాయదుర్గం +రాప్తాడు

హిందూపురం : హిందూపురం,పెనుకొండ, మడకశిర,పుట్టపర్తి,ధర్మవరం,కదిరి

మలాపురం : కోనసీమ జిల్లా..

అరకు : అల్లూరి సీతారామారాజు జిల్లా

హిందూపురం : పుట్టపుర్తి హెడ్‌క్వార్టర్‌గా సత్యసాయి జిల్లా

తిరుపతి : బాలాజీ జిల్లా

కృష్ణాజిల్లా : ఎన్టీఆర్ జిల్లా

రాజమండ్రి : గోదావరి జిల్లా

రాజంపేట : రాయచోటి హెడ్‌క్వార్టర్‌గా  అన్నమయ్య జిల్లా

బాపట్ల హెడ్‌క్వార్టర్‌గా : భవపురి జిల్లా

అరకు పార్లమెంటు పరిధిలో పార్వతీపురం జిల్లా.

New 26 Districts of AP

1) Srikakulam District

2) Vizianagaram District

3) Manyam District – Parvathipuram

4) Visakhapatnam District

5) Anakapalli District

6) Sri Alluri Seetharamaraju District – Paderu

7) EGDT – Rajahmundry

8) Kakinada District

9) Konaseema District – Amalapuram

10) WGDT – Bheemavaram

11) Eluru District

12) Sri NTR District – Vijayawada

13) Krishna District – Machilipatnam

14) Guntur District

15) Bapatla District

16) Palanadu District – Narasaraopeta

17) Prakasam District

18) SPSR Nellore District

19) Sri Balaji District – Tirupati

20) Chithoor District

21) YSR Kadapa District

22) Sri Annamayya District – Rayachoti

23) Kurnool District

24) Nandyal District

25) Ananathapuram District

26) Sri Satya Sai District – Puttaparthy.


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New districts from Ugadi festival review meeting details"

Post a Comment