Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Here are the details of the strengths of Russia and Ukraine!

 ఎవరి వద్ద ఎంత సైన్యం? ఎన్ని ఆయుధాలు?



  • ఉక్రెయిన్ పై రష్యా యుద్ధం
  • ప్రధాన నగరాలపై క్షిపణి దాడులు
  • చొచ్చుకు వెళుతున్న రష్యా బలగాలు
  • సైనిక శక్తిలో రెండో స్థానంలో ఉన్న రష్యా
  • 22వ స్థానంలో ఉన్న ఉక్రెయిన్

రష్యా, ఉక్రెయిన్ బలాబలాల వివరాలు 

ఉక్రెయిన్ ను అక్రమించడమే లక్ష్యంగా రష్యా భారీ ఎత్తున దాడు5లకు తెగబడింది. అత్యంత బలహీన దేశాల్లో ఒకటైన ఉక్రెయిన్ పై రష్యా నేడు పిడుగుల వర్షం కురిపిస్తోంది. ప్రపంచంలోనే క్షిపణి పరిజ్ఞానం పరంగా చూస్తే రష్యా అగ్రగామిగా ఉంటుంది. ఇది జగమెరిగిన సత్యం.

మరోవైపు ఉక్రెయిన్ అందుకు పూర్తి విరుద్ధం. ఇప్పటికే ఆర్థికలేమితో సతమతమవుతున్న ఉక్రెయిన్ ను అరకొర ఆయుధ సంపత్తి, పరిమితంగా ఉన్న సాయుధ బలగాలు తాజా గండం నుంచి గట్టెక్కిస్తాయని ఎవరూ భావించడంలేదు.

 దాదాపు 2 లక్షలకు పైగా రష్యా సైనిక దళాలు అర్ధచంద్రాకారంలో ఉక్రెయిన్ ను చుట్టుముట్టి ఉన్నాయి. ఇప్పటికే పలు చోట్ల ఉక్రెయిన్ దళాలు ప్రతిఘటించకుండానే రష్యా బలగాలకు దాసోహం అంటున్నాయని వార్తలు వినిపిస్తున్నాయి. చైనాలాగే రష్యా కూడా సైన్యం, ఆయుధాల కోసం భారీ బడ్జెట్ కేటాయించే దేశాల్లో ఒకటి.

2020లో రష్యా సైనిక వ్యయం 61.7 బిలియన్ డాలర్లు కాగా, అదే సమయంలో ఉక్రెయిన్ కేవలం 5.9 బిలియన్ డాలర్లు తన సైన్యంపై ఖర్చు చేసింది. ఆ లెక్కన ఉక్రెయిన్ కంటే రష్యా సైనిక బడ్జెట్ పది రెట్లు అధికం.  ప్రపంచదేశాల్లో అత్యంత శక్తిమంతమైన సైన్యం కలిగిన దేశాల్లో రష్యా 2వ స్థానంలో ఉంటే... ఈ జాబితాలో ఉక్రెయిన్ 22వ స్థానంలో ఉంది. ఈ నేపథ్యంలో, రష్యా, ఉక్రెయిన్ దేశాల బలాబలాలు ఎంతన్నది ఆసక్తి కలిగిస్తోంది

సోవియట్ రష్యా.

  • క్రియాశీలక సైనికులు- 8.50 లక్షల మంది
  • యుద్ధ ట్యాంకులు- 12,500
  • సాయుధ వాహనాలు- 30,000
  • మొత్తం వాయుసేన విమానాలు- 4,100 (వాటిలో 772 ఫైటర్ జెట్లు)
  • శతఘ్నులు-14,000
  • యుద్ధ నౌకలు- 600
  • జలాంతర్గాములు- 70

ఉక్రెయిన్.

  • క్రియాశీలక సైనికులు- 2.50 లక్షలు
  • యుద్ధ ట్యాంకులు-2,600
  • సాయుధ వాహనాలు- 12,000
  • శతఘ్నులు- 3,000
  • మొత్తం వాయుసేన విమానాలు- 318 (వాటిలో 69 ఫైటర్ జెట్లు)
  • యుద్ధ నౌకలు-38
  • జలాంతర్గాములు-0

ఇక, అణ్వాయుధాల విషయానికొస్తే రష్యా వద్ద ఈ ప్రపంచంలో మరే దేశం వద్ద లేనంతగా 6,257 ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే... 1994 నాటికి ప్రపంచంలో అణ్వస్త్ర శక్తుల్లో ఉక్రెయిన్ మూడోస్థానంలో ఉండేది. ఇప్పుడా దేశం వద్ద ఒక్క అణుబాంబు కూడా లేదు.

గతంలో రష్యా, ఉక్రెయిన్ రెండూ సోవియట్ యూనియన్ లో భాగమే. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నం అయ్యాక ఉక్రెయిన్ స్వతంత్ర దేశంగా అవతరించింది. అయితే, తనకు రక్షణ కల్పిస్తుందన్న భరోసాతో 30 ఏళ్ల క్రితం తన వద్ద ఉన్న అణ్వాయుధాలను ఉక్రెయిన్ దేశం రష్యాకు అప్పగించింది. ఈ వ్యవహారంలో అప్పట్లో అమెరికా, బ్రిటన్ మధ్యవర్తిత్వం వహించాయి.  

దీనిపై ఉక్రెయిన్ పార్లమెంటు సభ్యుడు అలెక్సీ గోన్ చెర్నెంకో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "1991లో సోవియట్ యూనియన్ విచ్చిన్నం తర్వాత వేలాదిగా అణ్వస్త్రాలు ఉక్రెయిన్ గడ్డపైనే ఉండిపోయాయి. ఆ తర్వాత కొన్నేళ్లకు ఉక్రెయిన్ బుడాపెస్ట్ మెమొరాండంపై సంతకం చేసింది. దాని ప్రకారం ఉక్రెయిన్ పూర్తిగా అణ్వస్త్ర రహిత దేశంగా మారింది. అమెరికా, బ్రిటన్, రష్యా భద్రతాపరమైన హామీలు ఇవ్వడంతోనే నాడు ఆ నిర్ణయం తీసుకున్నారు. అణుబాంబులను తిరిగిచ్చేసిన దేశం ప్రపంచ చరిత్రలో ఉక్రెయిన్ ఒక్కటే అని గర్వించాం. కానీ, ఎంత పెద్ద తప్పు చేశామో ఇప్పుడు అర్థమవుతోంది. ఒక్క అణ్వస్త్రం కూడా లేని మా దేశంపై రష్యా దాడికి తెగబడి, మా పౌరులను చంపేస్తోంది" అంటూ ఆ ఎంపీ వాపోయారు. "ఆనాటి ఒప్పందంలోని భద్రతా పరమైన హామీలు ఇప్పుడెక్కడ?" అని ఆయన ఆక్రోశించారు

ఫ్లాష్....ఫ్లాష్

రష్యాకు చెందిన 30 యుద్ధ ట్యాంకులు, 10 యుద్ధవిమానాలు, 6 హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ప్రకటించింది.

800మంది సైనికులను బందీలుగా పట్టుకున్నట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. రష్యా దళాలను ఎదుర్కొనేందుకు 10వేల అత్యాధునిక అసాల్ట్ రైఫిల్స్ ను ఉక్రెయిన్ పౌరులకు ఇచ్చింది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Here are the details of the strengths of Russia and Ukraine!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0