Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Income Tax Information

 ట్యూషన్ ఫీజుతో పన్ను ఆదా 

Income Tax Information

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆదాయపు పన్ను మినహాయింపు కోసం అవసరమైన పెట్టుబడులను పెట్టేందుకు చివరి తేదీ మార్చి 31. పొదుపు , పెట్టుబడులతో పాటు కొన్ని ఖర్చులనూ పన్ను కోసం క్లెయిం చేసుకునే వీలుంది . అందులో పిల్లల ట్యూషన్ ఫీజులు ఒకటి . గుర్తింపు పొందిన పాఠశా లలు , కళాశాలలు , ఇతర విద్యా సంస్థల్లో చదువు కోసం చెల్లించిన ఫీజులను ఇందు కోసం చూపించుకోవచ్చు . గరిష్ఠంగా ఇద్దరి పిల్లలకు ఇది వర్తిస్తుంది . సెక్షన్ 80 సీ పరి మితి మేరకు రూ .1,50,000 వరకూ ఈ మినహాయింపు పొందవచ్చు . ప్రతి పన్ను చెల్లింపు దారుడికీ ఈ వెసులుబాటు ఉంటుంది . విదేశాల్లో చదువుకుంటున్న పిల్లలకు చెల్లించే ఫీజులకు ఇది వర్తించదు. పిల్లల కోసం యాజమాన్యం ఏదైనా ప్రత్యేక భత్యాలు ( అలవెన్స్ ) ఇచ్చినప్పుడు పరిమితుల మేరకు మినహాయింపు లభిస్తుంది . చదువు కోసం ఇచ్చే భత్యానికి ఏడా దికి రూ .1,200 , హాస్టల్ కోసం ఇచ్చే భత్యం రూ .3,600 వరకూ ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 10 కింద క్లెయిం చేసుకునే వీలుం టుంది . అలెవెన్సులు ... ట్యూషన్ ఫీజులు ఈ రెండూ వేర్వేరని ఇక్కడ గమనించాలి . 

విద్యారుణం తీసుకుంటే 

పిల్లల ఉన్నత విద్యాభ్యాసం కోసం తీసు కున్న విద్యా రుణానికి చెల్లించే వడ్డీకి సెక్షన్ '80 ఈ ' ప్రకారం పూర్తి మినహాయింపును క్లెయిం చేసుకోవచ్చు . మన దేశంలో లేదా విదేశాల్లో చదువుకునేందుకు రుణం తీసు కున్నా ఈ మినహాయింపు లభిస్తుంది . వడ్డీ చెల్లించడం ప్రారంభించిన తర్వాత వరసగా ఎనిమిదేళ్లపాటు ఇది వర్తిస్తుంది . పన్ను చెల్లింపుదారుడు సొంత చదువు కోసం , తన జీవిత భాగస్వామి , పిల్లల కోసం విద్యారుణం తీసుకోవచ్చు .


SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Income Tax Information"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0