Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Half day Schools

ఒంటిపూట బడులు ఏప్రిల్ 1 నుంచి


  • నిర్ణయం తీసుకున్న విద్యాశాఖ
  •  పరీక్షల దృష్ట్యా మేలో పూర్తి పనిదినాలు
  •  జూన్ లో వేసవి సెలవులివ్వాలని యోచన

అమరావతి, ఆంధ్రప్రభ: రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి ఒంటిపూట బడులు నిర్వహిం చాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయం తీసుకున్నట్లు తెలు స్తోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ఒంటిపూట బడులను ఈ నెల 15వ నిర్వహించాలని ప్రతిపాదనలు అందినప్పటికీ.. సిలబస్ పూర్తికానందున నెలాఖరు వరకు రెండు పూటలా తరగతులు నిర్వహించాలని, ఏప్రిల్ ఒకటి నుంచి ఒక పూటకు కుదించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వులు విడుదల కాను న్నాయి. అలాగే దేశవ్యాప్తంగా నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) తేదీల్లో మార్పులు చేయడంతో ఇంటర్ పరీక్షల తేదీలను మరోసారి మార్చనున్నారు. ఇప్పటికే పరీక్షల మధ్య జేఈఈ తేదీలు రావడంతో ఒకసారి మార్పు చేసి షెడ్యూల్ ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రాతినిధ్యాల దృష్ట్యా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ తేదీలనే మా రుస్తున్నట్లు ప్రకటించింది. ఈ నేప థ్యంలో ఇంటర్ పరీక్షా తేదీల్లో మార్పులు చోటు చేసుకోను ఉన్నాయి. పదో తరగతి పరీక్షా తేదీలు, జేఈఈ తేదీలు కలవ కుండా వీటిని ప్రకటించే విషయంపై ఇంటర్ బోర్డు కసరత్తు చేస్తోంది. మరోవై పు పదో తరగతి పరీక్షా తేదీలను మార్చాలని, ఇంటర్మీడియట్ పరీక్షలు జరిగే సమయంలోనే నిర్వహిస్తే పరీక్షా కేంద్రాలు, సమయం, సిబ్బంది విషయంలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో మే నెలాఖరులోగా పది పరీక్షలను నిర్వహించే అంశంపై పరిశీలన జరుగుతోంది. పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూళ్లు ఖరారైన తర్వాత పరీక్షలు పూర్తయిన నాటి నుంచి ఆయా తరగతుల విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మే నెలాఖరు వరకు ఉపాధ్యాయులకు పూర్తి పనిదినాలు ఉండనున్నాయి. జూన్ నెల మొత్తం వారికి సెలవులు ఇచ్చే అవకాశముంది. వీటన్నింటిపై ఈ వారంలోనే స్పష్టత రానుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

1 Response to "Half day Schools"

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0