Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Health cards are comprehensive information.

హెల్త్ కార్డ్ లు సమగ్ర సమాచారం.

Health cards are comprehensive information.

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తన ఉద్యోగులూ / రిటైర్డ్ పెన్షనర్లు మరియు వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యుల కోసం రాష్ట్రవ్యాప్తంగా అనేక ఎంపానెల్డ్ ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స అందించడానికి  EHS అనే ఆరోగ్య పథకాన్ని GO MS No174dt 1/11/2013 ద్వారా రూపొందించి 5/11/2013 నుండి అమలు లోనికి తెచ్చింది.

 EHS నిర్వహణ కొరకు ఆరోగ్య సంరక్షణా నిధి ఏర్పాటు చేసి ఉద్యోగులను మూడు గ్రేడులుగా విభజించి వారినుండి మూడు స్లాబ్ లలో మంత్లీ ప్రీమియం వసూలూ చేయాలని, ఆమొత్తంకు సరిపడు సొమ్ము ప్రభుత్వం కలసి ఆనిధికి జమచేసి  నగదు రహిత చికిత్సకు వినియోగించాలని నిర్ణయించారు.

 1) స్లాబ్ ఎ (పే గ్రేడ్ I నుండి IV వరకు): రూ .90

 2)స్లాబ్ బి (పే గ్రేడ్ V నుండి XVII వరకు ): రూ .90

3) స్లాబ్ సి ( పే గ్రేడ్ XVIII నుండి XXXII వరకు): రూ .120.

రాష్ట్ర ప్రభుత్వం , ఉద్యోగులు పెన్షనర్ల  60: 40 శాతం రేషియోలో నిధులను సమకూర్చాలని ఈ జివో లో స్పస్టంచేసారు. 

దరిమిల GOMS No83 dt25/12/16 లో రాష్ట్ర ప్రభుత్వం , ఉద్యోగులు పెన్షనర్ల  వాటా శాతం అప్పటివరకూ ఉన్న 60: 40 శాతంకాక 50:50 గా రివైజ్ చేయడం జరిగింది. ఈ కాలంలో EHS కార్డులు కేష్ లెస్ ట్రీట్మెంటుకుఉపయోగపడలేదు. కావునా మెడికల్ రీఎంబరెన్సు పధకం కొనసాగుతు వచ్చింది.

 12/3/2019లో ప్రభుత్వం GORT 162 ద్వారా EHS కార్డులు మెరుగైన నిర్వహణ ,నిధులు సమకూర్పుకు అందరికీ ఆరోగ్య సంరక్షణ , అధిక-నాణ్యమైన  వైద్య సేవలను అందించాలనే ప్రాధమిక లక్ష్యంతో సూచనలను కోరుతూ ఒక కమిటీ వేసింది. ఆ కమిటి చేసిన సూచనలమేరకు . ప్రభుత్వం 400కోట్ల కార్పస్ ఫండ్ తో డాక్టర్ వైయస్ఆర్ ఆరోగశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ప్రారంభించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పర్యవేక్షణలో EHS  అమలు చేస్తుదని , ఉద్యోగులు పెన్షనర్ల మంత్లీ కాంట్రిబ్యూషన్ షేర్ ఇప్పటి వరకూ ఉన్న స్లాబ్ A,B లనుండి వసూలుచేస్తున్న షేర్ రు.90 నుండి రు.225/— కు, స్లాబ్ C లో రూ.120 నుండి రు. 300 పెంచుతూ డిశంబర్ 2019 నుండి ఈ కంతు వసూలు చేయాలని ఉత్తర్వులు ఇచ్చి యున్నారు.

ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంఘాల కోరిక మేరకు పెంచిన వాయిదా సోమ్ము వసూలును డిశంబర్ 19 నుండికాక మే 2020నుండి వసూలు చేయసాగారు. దీనిని దృవీకరిస్తూ GOMS No 5 dt 22/1/2021 లో ఉత్తర్వులు ఇచ్చి యున్నారు.

 EHS అనేక  ఈ క్రింది ప్రయోజనాలను అందించాలనే లక్ష్యంతో ప్రారంభించారు.

1) ఇన్-పేషెంట్ ట్రీట్మెంట్ ప్రభుత్వం విడుదల చేసిన జాబితా లో గుర్తించిన వ్యాధులకు చికిత్స మరియు ఫాలో అప్ సేవలు అందించాలి

 10 రోజుల వరకు ఎండ్-టు-ఎండ్ క్యాష్‌లెస్ సర్వీస్ పోస్ట్-డిశ్చార్జ్ మందులు మరియు 30 రోజుల పోస్ట్-డిశ్చార్జ్ వరకు సమస్యల కవరేజ్.

 ఇన్ పెషెంట్ కు వసతి

 స్లాబ్ A (పే గ్రేడ్లు - I నుండి IV): సెమీ ప్రైవేట్ వార్డ్

స్లాబ్ B (పే గ్రేడ్లు - V నుండి XVII వరకు): సెమీ ప్రైవేట్ వార్డ్

స్లాబ్ సి (పే గ్రేడ్లు - XVIII నుండి XXXII వరకు): ప్రైవేట్ వార్డ్

2) అవుట్-పేషెంట్ సేవలు

EHS లో జాబితా చేయబడిన దీర్ఝకాలిక వ్యాధులకు  మాత్రమే చికిత్సలు అందుబాటులో ఉన్నాయి.దీర్ఘకాలిక వ్యాధులకు అవుట్-పేషెంట్ గా నోటిఫైడ్ ఆసుపత్రులలో  చికిత్స అందించాలి.

ఆర్థిక కవరేజ్అర్హత మొత్తం :

 EHS క్రింద లబ్దిదారు కుటుంబానికి సంవత్సరానికీ రూ .3 లక్షలు భీమా ఉంటుంది. అవసరం బట్టి అదనపు నిధుల మంజూరు ఉంటుంది.

 రూ .2 లక్షలకు మించిన దావాలను డాక్టర్ వైయస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ సిఇఓ పరిష్కరిస్తారు.

దాదాపుగా రెండు వేలకు పైబడిన రోగాలకు EHS వర్తిస్తుంది.

హెల్త్ కార్డు Website

 http://www.ehs.ap.gov.in

 EHS కార్డులపై పూర్తి స్ధాయిలో వైద్యం అందకపోవడంతో మెడికల్ రి ఎంబర్స్ మెంట్ పధకం అమలు చేసారు. గత సంవత్సరం ఆగష్టు నుండి సదరు పధకం పొడిగించుతూ ఉత్తర్వులు నేటివరకూ ఇవ్వబడలేదు.

మంత్రివర్గ ఉపసంఘం మార్చి నెలాఖరువరకూ రి ఎంబర్స్ మెంట్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇస్తామని చెప్పి నెలలు గడిచింది .మార్చి మూడోవారంలోకీ వచ్చినప్పటికీ అమలు శూన్యం- వేలాదిమంది స్వంత సొమ్ము హెచ్చించి వైద్యంచేయించుకొని బిల్లులు సబ్మిషన్కు వేచియున్నారు. బిల్లులు తీసుకున్న ఆరు నెలల గడువు ముగిసి ఇబ్బందులు పడుతున్నవారున్నారు.

సంవత్సరంన్నర  కాలం క్రితమే బిల్లులు సబ్మిట్ చేసి EHS అనుమతులు పొంది బిల్లులు చెల్లించబడలేని వారు'వారి ఎపుడు చెల్లిస్తారో అని వేయికళ్ళతో ఎదురుచూస్తూ ఉన్నారు. 

ఇప్పటివరకూ పెండింగ్ లో ఉన్న బిల్లులు వెంటనే చెల్లించాలని, EHS స్మార్ట్ కార్డులపై పూర్తి స్ధాయి వైద్యం అందించాలని , అప్పటివరకూ రి ఎంబర్స్మెంట్ పధకం కొనసాగిస్తూ వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోషియేషన్ ,ఆంధ్రప్రదేశ్ ,గుంటూరు అధ్యక్షలు ,సెక్రటరీ జనరల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Health cards are comprehensive information."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0