Hero Eddy Electric Scooter Unveiled . License and Registration Not Required
హీరో ఎలక్ట్రిక్ కొత్త మోడల్ ఈ స్కూటర్ - లైసెన్స్, రిజిస్ట్రేషన్ అక్కర్లేదు . వాటి వివరాలు .
ప్రముఖ విద్యుత్తు ద్విచక్రవాహన తయారీ సంస్థ హీరో ఎలక్ట్రిక్ మరో కొత్త మోడల్‌ను ఆవిష్కరించింది. తక్కువ దూరాలకు ప్రయాణించేందుకు అనువుగా ఉండే హీరో-ఎడ్డీ అనే ఎలక్ట్రిక్ స్కూటర్‌ను తీసుకొచ్చింది. దగ్గర్లో ఉండే కాఫీ షాప్, గోల్ఫ్ కోర్స్, జిమ్ వంటి ప్రాంతాలకు ప్రయాణించే వారికి ఇది సరిగ్గా సరిపోతుందని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.
ఫైండ్ మై బైక్, విశాలమైన బూట్ స్పేస్, రివర్స్ మోడ్, ఫాలో మీ హెడ్ ల్యాంప్స్ వంటి అత్యాధునిక ఫీచర్లు హీరో-ఎడ్డీలో ఉన్నాయి. పసుపు, లేత నీలి రంగులో ఇది అందుబాటులో ఉంది. దీనికి లైసెన్స్‌గానీ, రిజిస్ట్రేషన్‌గానీ అవసరం లేదని సంస్థ పేర్కొంది. దీన్ని వచ్చే త్రైమాసికంలో మార్కెట్‌లోకి విడుదల చేయాలని యోచిస్తోంది.క్రింది వెబ్సైట్ లో పూర్తి వివరాలు చూడగలరు.
0 Response to "Hero Eddy Electric Scooter Unveiled . License and Registration Not Required"
Post a Comment