Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

March 1: Details of the new rules coming into force from today.

 March 1 నుంచి అమలులోకి వచ్చే కొత్త రూల్స్ వాని వివరాలు.

March 1: Details of the new rules coming into force from today.

ఈ కొత్త ఏడాదిలో అప్పుడే 3 నెలలోకి ఎంట్రీ ఇచ్చాం. కొత్త నెలతోపాటు దేశంలో కొత్త కొత్త నిబంధనలు అమలులోకి వస్తాయి. దీంతో చాలా మందిపై ప్రభావం పడే అవకాశముంది. అందువల్ల వల్ల ఈరోజు నుంచే మారే అంశాలు ఏంటివో ఇప్పుడు తెలుసుకుందాం.

అమూల్ సంస్థ తన లీటర్ పాల ప్యాకెట్ ధరలను రూ.2 పెంచుతున్నట్లు వెల్లడించింది. పెంచిన ధరలను మార్చి 1 నుంచి అమలలోకి రానున్నాయి. అమూల్ సంస్థ గోల్డ్, తాజా, శక్తి, టీ స్పెషల్ లాంటి వేరియంట్లలో పాల ప్యాకెట్లను ఉత్పత్తి చేస్తోంది. అమూల్ గోల్డ్ అరలీటర్ ప్యాకెట్ ప్రస్తుతం రూ.28గా ఉండగా మార్చి 1 నుంచి రూ.30కి పెరగనుంది.

చమురు మార్కెటింగ్ కంపెనీలు కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరలను పెంచాయి. 19 కేజీల సిలిండర్‌ ధరపై రూ.105లు, 5 కేజీల సిలిండర్‌పై రూ.27లు పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్‌ సిలిండర్‌ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్‌ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్‌ ధర రూ. 569గా ఉంది. వివిధ నగరాల వారీగా 19 కేజీల సిలిండర్ల ధరను పరిశీలిస్తే చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్‌కతా రూ.2089లు, హైదరాబాద్‌లో రూ.1904లుగా ఉన్నాయి 

అంతర్జాతీయ చమురు ధరలు ఏడేళ్ల గరిష్టానికి పెరగడంతో జెట్ ఇంధన ధరలు దేశవ్యాప్తంగా ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి 3.3 శాతం పెరిగాయి. ప్రపంచ చమురు ధరలు పెరిగిన తర్వాత జెట్ ఇంధనం లేదా ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్(ఏటిఎఫ్) ధర పెరగడం ఇది ఐదోసారి. 

లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిజిటల్'గా డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ మార్చి 1 నుంచి మారనున్నాయి. 2020 నవంబర్ నెలలో డీబీఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్(డీబీఎల్) విలీనం కావడంతో ఆ బ్యాంకుకు చెందిన ఐఎఫ్ఎస్‌సీ కోడ్స్ ఫిబ్రవరి 28, 2022 వరకు మాత్రమే చెల్లుతాయని డీబీఎస్ బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. 

చాలా రాష్ట్రాలలో కోవిడ్ 19 మహమ్మారి పెరగడంతో, సీనియర్ సిటిజన్స్ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని గతంలో కేంద్ర ప్రభుత్వం లైఫ్ సర్టిఫికేట్ డెడ్ లైన్‌ను ఫిబ్రవరి 28, 2022 వరకు పొడిగించింది. దీంతో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరూ లైఫ్ సర్టిఫికేట్‌ను 28.02.2022 వరకు సమర్పించవచ్చు. ఒకవేళ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే మార్చి 1 నుంచి పెన్షన్ తీసుకునే సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది.

ఇండియా పోస్టు పేమెంట్స్ బ్యాంకు(ఐపీపీబీ) డిజిటల్ సేవింగ్స్ అకౌంట్ క్లోజర్ ఛార్జీలను ప్రవేశపెట్టింది. మార్చి 5, 2022 నుంచి రూ.150 ప్లస్ జీఎస్టీ ఛార్జీలను విధించనున్నట్టు ఐపీపీబీ తెలిపింది. అయితే ఈ ఛార్జీలు కేవలం కేవైసీ అప్‌డేషన్ లేకుండా ఏడాది తర్వాత క్లోజ్ అయ్యే డిజిటల్ సేవింగ్స్ అకౌంట్లకు మాత్రమేనని తెలిపింది. మిగతా అకౌంట్ల మూసివేతకు ఈ ఛార్జీలు వర్తించవని పేర్కొంది. ఈ కొత్త నిబంధన మార్చి 5 2022 నుంచి అమల్లోకి వస్తుంది.

చక్రవాహనాల పెండింగ్‌ చలాన్లకు 75 శాతం రాయితీ ఇస్తున్నట్లు ట్రాఫిక్‌ జాయింట్‌ సీపీ రంగనాథ్‌ స్పష్టం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆన్‌లైన్‌ ద్వారా పెండింగ్ చలాన్లను చెల్లించవచ్చని, ఈ చలాన్ల రాయితీ మార్చి 1 నుంచి 31 వరకు అమలులో ఉంటుందని తెలిపారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "March 1: Details of the new rules coming into force from today."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0