Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

PRC - Meeting of Trade Union Leaders with Committee of Ministers on PRC

 PRC - పీఆర్సీపై మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నేతల భేటీ.

కేబినెట్ సబ్ కమిటీతో జరిగిన చర్చలు వాటి వివరములు

 రాష్ట్ర సచివాలయంలో ఈరోజు జరిగిన కేబినెట్ సబ్ కమిటీ సమావేశానికి ప్రభుత్వ ముఖ్యసలహాదారు శ్రీ సజ్జల రామకృష్ణారెడ్డి , గౌరవ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణగారు , శ్రీ పేర్ని వెంకట్రామయ్య ( నాని ) గారు , ప్రభుత్వ సలహాదారు ( ఉద్యోగుల సంక్షేమం ) శ్రీ ఎన్ . చంద్రశేఖర్రెడ్డి గారు , ప్రభుత్వం తరపునుండి హాజరు కాగా , ఏ.పి. ఎన్జీవో సంఘం నుండి రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కామ్రేడ్ బండి శ్రీనివాసరావు , కామ్రేడ్ కె.వి. శివారెడ్డి , రాష్ట్ర ప్రచార కార్యదర్శి కామ్రేడ్ కె . జగదీశ్వరరావులు హాజరయ్యారు . ఈ సమావేశంలో 5-2-2022న ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ఇచ్చిన మినిట్స్లోని అంశాలలో ఇంకా రావలసిన జి.వో. లను గూర్చి చర్చించారు.

అందు ముఖ్యంగా...

 1. తేది 1-7-2019 నుండి 31-3-2020 వరకు ఐ.ఆర్ . రికవరీపై తగు క్లారిటీతో జి.వో. ఇవ్వవలసి ఉన్నదని , వెంటనే విడుదల చెయ్యాలని కోరారు.

2. విధి నిర్వహణలో మరణించిన ఉద్యోగి మరియు పెన్షనర్ల దహన సంస్కారాల ఖర్చుల కోసం ( మట్టి ఖర్చులు ) పెంపుదల చేసిన మొత్తముతో జి.వో.ను వెంటనే విడుదల చేయాలని ,

3. 11 వ పి.ఆర్.సి.ని పబ్లిక్ సెక్టార్ , యూనివర్సిటీలు , కార్పొరేషన్లు , సొసైటీలు మరియు గురుకులాల ఉద్యోగులకు వర్తింప చేస్తూ ఇవ్వలసిన జి.వో.ను తక్షణమే వారంలోపు విడుదల చేయాలని కోరారు.

4. అలాగే పబ్లిక్ ట్రాన్సుఫోర్టు డిపార్టుమెంట్ ( ఆర్.టి.సి. ) వారికి 11 వ పి.ఆర్.సి.ని వర్తింపజేస్తూ జి.వో.ను వెంటనే విడుదల చేయాలని కోరారు . దీనిపై సుదీర్ఘమైన చర్చ అనంతరం ఒక వారం లోపు జి.వో. విడుదల చేయాలని నిర్ణయించడమైనది.

 5. డి.ఏ.లకు సంబంధించిన ఎరియర్స్ చెల్లింపుకు కావలసిన జి.వో.ను వెంటనే విడుదల చేయాలని , 

6. కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు వెంటనే 2022 రివైజుడ్ పే స్కేల్స్ ప్రకారం అనగా పే , డి.ఏ. , హెచ్.ఆర్.ఏ. ఇస్తూ సర్వీస్ రెగ్యులరైజ్ చేయాలని కోరారు.

7. జిల్లాల పునర్విభజన సందర్భముగా ఉద్యోగుల కేటాయింపులలో అన్ని డిపార్టుమెంట్లకు సరియైన గైడ్లైన్స్ ఇవ్వాలని , ముఖ్యంగా ఉద్యోగులకు ఆప్షన్ ఇవ్వాలని , స్పౌజ్ ( భార్యాభర్తలు ) ఒకే చోట ఉండే విధంగా గైడ్లైన్స్ ఇవ్వాలని , గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల కార్యవర్గ సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరడమైనది.

8 . ప్రభుత్వం నుండి  చెల్లించవలసిన జి.పి.ఎఫ్ . , ఏ.పి.జి.ఎల్.ఐ. , మెడికల్ బిల్లులు , సరెండర్ లీవులు మరియు పోలీసుల ఎల్సరెండర్ లీవులు తక్షణమే విడుదల చేయాలని కోరారు . అలాగే ఆర్ధిక శాఖ అధికారులు ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు.

9. గతంలో ఏ.పి. జె.ఏ.సి. మరియు ఏ.పి. జె.ఏ.సి. అమరావతి సంయుక్తంగా ఇచ్చిన 71 అపరిష్కుత అంశాలపై చర్యలు తీసుకోవాలని కోరారు . వీటిపై త్వరలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని పరిష్కరించుకుందామని కేబినేట్ సబ్కాకమిటీ సభ్యులు తెలిపారు. 


- బండి శ్రీనివాసరావు.


వేతన సవరణ సంఘం సిఫార్సుల్లో పెండింగ్‌ అంశాలపై చర్చించేందుకు సచివాలయంలో గురువారం మంత్రుల కమిటీతో ఉద్యోగ సంఘాల నాయకులు సమావేశమయ్యారు. డీఏ రికవరీ నిలుపుదలకు ఉత్తర్వులు ఇవ్వాలని, డీఏ, పీఆర్సీ బకాయిలు ఇవ్వాలని నాయకులు కోరారు. పీఆర్సీ ప్రతి ఐదేళ్లకు అమలు చేసేలా ఉత్తర్వులు ఇవ్వాలని, పెండింగ్‌ పీఎఫ్‌, జీఎల్‌ఐ బిల్లులు మంజూరు చేయాలని విన్నవించారు. ప్రభుత్వరంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, గురుకులాలకు పీఆర్సీ అమలయ్యేలా ప్రత్యేక ఉత్తర్వులు ఇవ్వాలని ఐకాస అమరావతి ఛైర్మన్‌ బొప్పరాజు వెంకటేశ్వర్లు కోరారు. వీటిపై శుక్రవారం ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు మంత్రుల కమిటీ బదులిచ్చింది. సీపీఎస్‌ రద్దుపై ఏప్రిల్‌ 4న ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ అధికారులు చర్చించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు పీఆర్సీ అమలు ఉత్తర్వులు ఇచ్చేందుకు వారం సమయం పడుతుందని మంత్రులు పేర్కొన్నారు. పీఎఫ్‌, జీఎల్‌ఐ బిల్లుల డేటాను ఏప్రిల్‌ 4న ఇవ్వనున్నట్లు తెలిపారు. పీఆర్సీ పెండింగ్‌ అంశాలపై చర్చించేందుకు ఉపాధ్యాయ సంఘాలను ఆహ్వానించకపోవడం అప్రజాస్వామికమని ఏపీటీఎఫ్‌ అధ్యక్షుడు హృదయరాజు విమర్శించారు.

Download copy

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "PRC - Meeting of Trade Union Leaders with Committee of Ministers on PRC"

Post a Comment