Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

AP Cabinet Update

 AP Cabinet Update : 24 మంత్రుల రాజీనామాలకు గవర్నర్ ఆమోదం. గెజిట్ నోటిఫికేషన్ . కొత్త లిస్ట్ ఎప్పుడో వివరణ.

AP Cabinet Update

AP Cabinet Update: ఆంధ్రప్రదేశ్ మంత్రులంతా మాజీలు అయ్యారు.. మొన్న కేబినెట్ భేటీలో రాజీనామా చేసిన 24 మంత్రులు మాజీలుగా మారారు. వారి రాజీనామాలను గవర్నర్ ఆమోదించారు. అయితే వీరిలో తిరిగి ఎంతమంది మళ్లీ మంత్రులుగా మారనున్నారు..?

AP Cabinet Update: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మంత్రులు మాజీలు అయ్యారు. మొన్న జరిగిన చివరి కేబినెట్ భేటీలో.. 24 మంది మంత్రులు మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామా చేశారు. తాజాగా ఆ రాజీనామాలకు ఏపీ గవర్నర్ భిశ్వభూషన్ హరిచందన్ (Governoro Bishawbushan Harichandan) ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించి కాసేపట్లో గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. అయితే మొత్తం 24 మంది తమ పదవులకు రాజీనామ చేస్తే.. మొదట అనుకున్న దాని ప్రకారం వీరిలో ఇద్దరు ముగ్గురు మినహా అంతా మాజీలు అవుతారని ప్రచారం జరిగింది. కానీ చివరి రెండు రోజులు భారీ ట్విస్టులతో పరిస్థితి మొత్తం మారింది. పాత మంత్రుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. తాజాగా అందుకున్న సమాచారం ప్రకారం.. 24 మందిలో మళ్లీ 10 మంది మంత్రులు అవుతున్నారని వైసీపీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇప్పటికే వారికి సమాచారం కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది.

తాజాగా మాజీలైన మంత్రుల్లో 10 మంది మంత్రుల ఇంటి దగ్గర ఇప్పటికే కోలాహలం కనిపిస్తోంది. అయితే అధికారికంగా ఎవరికీ సమాచరం ఇవ్వకపోవడంతో కొందరిలో టెన్షన్ తప్పడం లేదు. అనుభవం, సామాజిక సమీకరణ, జిల్లా ప్రాతినిధ్యం, రాజకీయ అవసరాలు, విధేయతలే ప్రాతిపదికన మంత్రులు బొత్స సత్యనారాయణ (Botsa), పెద్దిరెడ్డి (Peddireddy), కొడాలి నాని (Kodali Nani), బుగ్గన (Buggana) , పేర్ని నాని (Perni Nani), అనిల్ (Anil), బాలినేని (Balineni), కన్నబాబు (Kannababu)లను అనుభవం ప్రకారం కొనసాగిస్తున్నారు.  సామాజిక సమీకరణాల నేపథ్యంలో మంత్రులు జయరామ్ (Jayaram), వేణుగోపాల్ (Venugopal), అప్పలరాజు (Appalaraju), సురేష్ (Suresh), అంజాద్ బాషా (Amzad Bhasa), శంకర్ నారాయణ (sankar Narayan), తానేటి వనిత (Taneti Vanitha)ను కొత్త కేబినెట్‌లోకి తీసుకున్నారు.

మరోవైపు  కొత్త మంత్రివర్గ కూర్పుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Rama Krishna Reddy) కీలక ప్రకటన చేశారు. సాయంత్రం 7 గంటలకు కొత్త  మంత్రి వర్గ జాబితాను గవర్నర్  కు పంపిస్తామని ప్రకటించారు.  అలాగే రేపటి మంత్రి వర్గ విస్తరణకు సంబంధించి ఏర్పాట్లు  పూర్తయ్యాయని ప్రకటించారు.. మరోవైపు ఇప్పటికే జాబితా ఫైనల్ అవ్వడంతో.. కొత్త మంత్రులకు సీఎంవో అధికారుల నుంచి ఫోన్ లు కూడా వెళ్తున్నట్టు సమాచారం. రేపటి ప్రమాణ స్వీకారానికి రావాలని వారి నుంచి ఫోన్లు వస్తున్నాయి. ఎవరికైతే ఫోన్లు వస్తున్నాయో.. వారి ఇంటి దగ్గర అప్పుడే కార్యకర్తల కోలాహలం కనిపిస్తోంది.  రేపు ఉదయం 11.31 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆంధ్రప్రదేశ్‌ కొత్త కేబినెట్‌ ఖరారైంది. 25 మందితో కొత్త మంత్రివర్గ జాబితా విడుదలైంది. 

కేబినెట్‌ కూర్పులో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  సామాజిక సమతుల్యతను పాటించారు. దీంతో పాటు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారీటి వర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.

కేబినెట్ పైనల్ లిస్టు



  1. గుడివాడ అమర్నాథ్‌
  2. దాడిశెట్టి రాజా
  3. బొత్స సత్యనారాయణ
  4. రాజన్నదొర
  5. ధర్మాన ప్రసాదరావు
  6. సీదిరి అప్పలరాజు
  7. జోగి రమేష్‌
  8. అంబటి రాంబాబు
  9. కొట్టు సత్యనారాయణ
  10. తానేటి వనిత 
  11. కారుమూరి నాగేశ్వరరావు
  12. మేరుగ నాగార్జున
  13. బూడి ముత్యాలనాయుడు
  14. విదుదల రజిని
  15. కాకాణి గోవర్ధన్‌రెడ్డి
  16. అంజాద్‌ భాష
  17. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  18. బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి
  19. పినిపె విశ్వరూప్‌
  20. గుమ్మనూరు జయరాం
  21. ఆర్కే రోజా
  22. ఉషశ్రీ చరణ్‌
  23. తిప్పేస్వామి
  24. చెల్లుబోయిన వేణుగోపాల్‌
  25. నారాయణస్వామి

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "AP Cabinet Update"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0