Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Exercise for Weight loss

 Exercise for Weight loss: బరువు తగ్గడానికి వ్యాయామాలు చేస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోగలరు.

Exercise for Weight loss


బరువు తగ్గాలనుకునేవారు వ్యాయామం చేస్తారు. వ్యాయామాలు (Exercise) చేయడం ద్వారా శరీరం ఫిట్‌ (Fit)గా ఉంటుంది. అలాంటి వారు ఈ విషయాలు తెలుసుకుంటే బెటర్​.

అధిక బరువును తగ్గించుకోవడానికి చాలా మంది ఏరోబిక్ వ్యాయామాలు, రన్నింగ్, స్విమ్మింగ్ వంటి గణనీయమైన వాటిని ఎంపిక చేసుకొని మరీ వెళుతుంటారు. మొత్తం మీద చాలా మంది నడక కూడా వ్యాయామం (Exercise) లాంటిదే అని చాలా తేలికగా తీసుకొంటారు. అందుకే వారు ప్రతి రోజూ నడుస్తున్నా కూడా బరువు మాత్రం తగ్గరు. వాకింగ్ లోనే ప్రతి రోజూ అరగంట పాటు బ్రిక్స్ వాక్ చేయడం వల్ల ఒక్క రోజులో 150 క్యాలరీస్ ను తగ్గించుకోవచ్చు. కాబట్టి బరువు తగ్గాలనుకొనే వారు వాక్ చేస్తూ బరువును కంట్రోల్ చేసుకోవడం ఎలా అనేది తెలుసుకుందాం.

20 నిమిషాల పాటు నెమ్మదిగా

అధిక బరువు తగ్గాలనుకొనే (weight loss) వారు సరైన ప్రణాళికతో వాకింగ్ చేయాలే గాని దానికి సుమారుగా 500 గ్రాముల నుంచి 1.5 కిలోల వరకు బరువు తగ్గవచ్చు (weight loss). ఈ క్రమంలో అలాంటి వారి కోసం నెల రోజుల (One month) పాటు వాకింగ్ ప్లాన్ ఇప్పుడు తెలుసుకుందాం. సోమవారం 20 నిమిషాల పాటు నెమ్మదిగా వాకింగ్ (walking) చేయాలి తర్వాత పదిహేను నిమిషాలపాటు ఒక మోస్తరు వేగంతో వాకింగ్ (walking) చేయాలి ఇలా మళ్ళీ ఐదు నిమిషాలు  నెమ్మదిగా వాకింగ్  చేయాలి. మంగళవారం రోజు పది నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ తరువాత 20 నిమిషాలు మోస్తారు వేగవంతమైన వాకింగ్ అలాగే ఐదు నిమిషాలు నెమ్మది వాకింగ్. మరుసటి రోజున విశ్రాంతి  తీసుకోవాలి.

గురువారం 20 నిమిషాల పాటు నెమ్మదిగా నడక (slow walking) చేయాలి. తర్వాత 15 నిమిషాలు మోస్తారు వాకింగ్ తర్వాత నిమిషాలు నెమ్మది నడక చేయాలి. శుక్రవారం పది నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ 20 నిమిషాలు మోస్తారు వాకింగ్ 20 నిమిషాల వేగవంతమైన వాకింగ్. శనివారం ఐదు నిమిషాలు నెమ్మదిగా నడక 5 నిమిషాలు మోస్తారు వాకింగ్  25 నిమిషాలు వేగమైన వాకింగ్ (fast walking) తరువాత ఐదు నిమిషాలు నెమ్మదిగా వాకింగ్. ఆదివారం రోజున విశ్రాంతి తీసుకోవాలి.

వేగవంతమైన నడక తర్వాత.

రెండో వారంలో (second week) సోమవారం 10 నిమిషాలు మోస్తరు వాకింగ్, 2 నిమిషాలు వేగమైన వాకింగ్, పది నిమిషాలు మోస్తరు వాకింగ్ ఐదు నిమిషాలు నెమ్మదిగా నడక. మంగళవారం ఐదు నిమిషాలు మోస్తరు వాకింగ్ ముప్పై ఐదు నిమిషాలు మోస్తారు మరియు వేగవంతమైన నడక తర్వాత ఐదు నిమిషాలు నిమ్మదిగా  వాకింగ్ చేయాలి.

బుధవారం రోజున విశ్రాంతి తీసుకోవాలి. గురువారం 10 నిమిషాలు మోస్తారు వాకింగ్, 30 నిమిషాలు వేగమైన వాకింగ్ పది నిమిషాలు మోస్తరు వాకింగ్ ఐదు నిమిషాలు నెమ్మదిగా నడక. శుక్రవారం 5 నిమిషాలు మోస్తరు వాకింగ్, 35 నిమిషాలు మోస్తరు వాకింగ్ మరియు వేగవంతమైన వాకింగ్ ఐదు నిమిషాలు నెమ్మదిగా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే మీ బరువు అదుపులో ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Exercise for Weight loss"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0