Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Biography of Mahatma Jyotirao Poole

మహాత్మా జ్యోతిరావు పూలే జీవిత చరిత్ర


ఏప్రిల్11-04-2020-మహాత్మా ఫూలే 193 వ జయంతి కార్యక్రమం సందర్భంగా నివాళులు అర్పిస్తూ.        

భారత ప్రథమ సామాజిక తత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘసేవకుడెైన జ్యోతీబా ఫులే మహారాష్ట్ర లోని సతారా జిల్లాలోని వ్యవసాయ తోట మాలి కులానికి చెందిన కుటుంబంలో 1827 ఏప్రిల్‌ 11న జన్మించాడు. ఆయన తండ్రి గోవిందరావు మొదట్లో కూరగాయలు అమ్మేవాడు. కాలక్రమేణా పీష్వా పరిపాలనాకాలంలో పూల వ్యాపారం చేయడంవల్ల వారి ఇంటి పేరు ఫూలే గా మార్పు చెందింది. జోతిరావ్‌కి సంవత్సరం వయస్సు రాకుండానే తల్లి తనువు చాలించింది. 7 సంవత్సరాల వయస్సులో ఫూలే ఒక మరాఠీ పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించాడు. తరువాత చదువు మానివేసి వ్యవసాయంలో తండ్రికి సాయంగా ఉండేవాడు. అతి తక్కువ కాలం పాఠశాలకు వెళ్ళినప్పటికీ ఫూలేకి పుస్తక పఠనం పట్ల ఆసక్తి ఎక్కువ. ప్రతిరోజూ నిద్రకుపక్రమించే ముందు లాంతరు వెలుతురులో చదువుకునే వాడు. జ్యోతిరావు ఫూలే చదువుపట్ల ఆసక్తిని గమనించిన ఒక ముస్లిం టీచర్‌, ఇంటి ప్రక్కనే ఉండే ఒక క్రైస్తవ పెద్దమనిషి జోతిరావ్‌ తండ్రిని ఒప్పించి ఆయన విద్యాభ్యాసం కొనసాగేలా చేశారు. ఆయన1841లో స్కాటిష్‌ మిషన్‌ పూణేలో నడుపుతున్న పాఠశాలలో చేర్పించాడు. అప్పటి ఆధిపత్య వర్గాలకు చెందిన

 సదాశివ భిల్లాల్‌ గోవింద్‌ తో  ఫూలే పరిచయం జీవితకాల స్నేహంగా మారింది. చిన్నప్పుడే మానవ హక్కుల ప్రాథమిక సూత్రాలపై జ్ఞానాన్ని సంపాదించాడు ఫూలే. జోతిరావ్‌కు చిన్నప్పటి నుంచే శివాజీ అంటే అభిమానం ఎక్కువ. శివాజి, జార్జ్‌ వాషింగ్టన్‌ల జీవితచరిత్రలు ప్రభావితం చేయడంవల్ల దేశభక్తి, నాయకత్వ గుణాలు అలవాటయ్యాయి. థామస్‌ రచించిన ‘మానవ హక్కులు’ పుస్తకం అతని ఆలోచనలను ప్రభావితం చేసింది.

అమెరికా స్వాతంత్య్రపోరాటం అతనిని ప్రభావితం చేయడమే కాకుండా మానవత్వపు విలువలెైన స్వేచ్ఛ, సమానత్వం గురించి లోతుగా ఆలోచింపచేసింది. గులాంగిరి, పూణే సత్య సోధక సమాజ నివేదిక, తృతీయ రత్న, ఛత్రపతి శివాజీ, రాజ్‌భోంస్లే యాంఛ, విద్యాకాథాతిల్‌, బ్రాహ్మణ్‌ పంతోజి మొదలెైనవి మహాత్మ ఫూలే ముఖ్య రచనలు. 13 ఏళ్ళ ప్రాయంలో జోతిరావ్‌కి 9 సంవత్సరాల సావిత్రితో వివాహం జరిగిందివిద్యాభ్యాసం పూర్తయినతర్వాత ఆయన తన కుటుంబవ్యాపారమైన పూలవ్యాపారం ప్రారంభించాడు.1848లో జరిగిన తన  స్నేహితుడి వివాహంలో ఫూలే, బిసి ‘మాలి’ కులానికి చెందిన వాడవడం వల్ల కులవివక్షకు గురయ్యాడు. ఆ క్షణం నుండి కుల వివక్షపెై పోరాడాలని నిశ్చయించుకున్నాడు,కుల విధానాలను భూస్వామ్య పెత్తందారీ వర్గాలను వ్యతిరేకించాడు. జ్ఞాన సంపద అందరికీ అవకాశం ఇవ్వక పోవడానికి ఆయన అభ్యంతరం తెలిపాడు.

పెత్తందారీ వర్గాలను వ్యతిరేకించవలసినదిగా సామాన్యుల్ని ప్రోత్సహించాడు.సమాజంలో సగభాగంగా ఉన్న స్త్రీలు అభివృద్ధి చెందకపోతే సమాజం అభివృద్ధి చెందదని ఫూలే భావించాడు. అందువల్ల స్ర్తీలు విద్యావంతులు కావాలని నమ్మాడు. ఇతరులకు ఆదర్శంగా ఉండాలని ముందుగా తన భార్య సావిత్రిని పాఠశాలకు పంపాడు. 1948 ఆగస్టులో బాలికలకు పాఠశాల స్థాపించాడు. ఈ పాఠశాలలో అన్ని కులాలకు ప్రవేశం కల్పించడం, అంటరానివారిని కూడా బోధించవలసి రావడంతో ఉపాధ్యాయులెవరూ ముందుకు రాలేదు. చివరకు జోతిరావ్‌ఫూలే తనభార్య సావిత్రి సహాయంతో పిల్లలకు పాఠాలు బోధించేలా చేశాడు, పాఠశాల నిర్వహణలో అనేక ఆర్థిక ఇబ్బందులను 

ఎదుర్కొన్నాడు. కొంతకాలం పాఠశాలను నిర్వహించలేక మూసివేశాడు. అయినా పట్టు వదలక తన మిత్రులెైన గోవింద్‌, వల్వేకర్‌ల సహాయంతో పాఠశాలను పునఃప్రారంభించాడు. క్రమంగా ఆదరణ పెరగడంతో 1851-52లో మరో రెండు పాఠశాలలు స్థాపించాడు. బ్రిటిష్‌ ప్రభుత్వం ప్రాథమిక విద్యను నిర్లక్ష్యం చేయడాన్ని ఫూలే విమర్శించేవాడు.

ఆనాడు సమాజంలో బాల్య వివాహాలు సర్వసాధారణంగా జరిగేవి. ముసలివారికిచ్చి పెళ్ళి చేయడంవల్ల చిన్నతనంలోనే మహిళలు వితంతువులయ్యేవారు. వీరు మళ్ళీ వివాహం చేసుకోవడానికి సమాజం అంగీకరించేదికాదు. అందువల్ల వితంతు పునర్వివాహాల గురించి ఫూలే ప్రజల్లో చెైతన్యం తీసుకువచ్చాడు. స్వయంగా వితంతువులకు వివాహాలు జరిపించాడు. 1864లో "బాలహత్య ప్రధిబంధక్ గృహ" స్థాపించి, వితంతువులెైన గర్భిణీ స్ర్తీలకు అండగా నిలిచాడు. దేశంలోనే ఇటువంటి కేంద్రం స్థాపించడం ఇదే మొదటిసారి. 1872లో ఈ కేంద్రంలో జన్మించిన ఒక బ్రాహ్మణ వితంతువు కుమారుణ్ణి ఫూలే దత్తత తీసుకున్నాడు.1873 సెప్టెంబరు 24న సత్య శోధక సమాజాన్ని ఫూలే స్థాపించాడు. దేశంలోనే ఇది మొట్టమొదటిసంస్కరణోద్యమం. శూద్రులను అప్పటి పెత్తందారి వర్గాల  చెర నుండి కాపాడటమే ఈ ఉద్యమ ముఖ్య ఉద్దేశం. 

కుల, మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి సభ్యత్వం కల్పించేవారు, 1891లో ప్రచురించిన సార్వజనిక్‌ ధర్మపుస్తక్‌ మత, సాంఘిక విషయలపెై ఫూలే అభిప్రాయాలను తెలియచేస్తుంది. స్ర్తీ, పురుషుల మధ్య లింగవివక్షను ఫూలే విమర్శించాడు. సమానత్వం, స్వేచ్ఛ, ఐకమత్యంతో కూడిన సమసమాజాన్ని కాంక్షించాడు. 1853లో వితంతు మహిళల అనాథ శిశువుల కోసం సేవాసదనం ప్రారంభించాడు. ఈ తరహలో ఒక భారతీయ హిందువు ఒకసంస్థను ప్రారంభించడం అదే మొదటిసారి. 1968లో తన ఇంటి దగ్గరున్న స్నానాల తొట్టి వద్ద స్నానం చేసేందుకు అంటరాని వారికి కూడా అనుమతి ఇచ్చాడు. 1869లో "పౌరోహిత్యం యొక్క బండారం" పుస్తక రచన చేశాడు. 1871 సత్యశోధక సమాజం తరపున ‘దీనబంధు’ వార పత్రిక ప్రారంభించాడు. 1880లో భారత ట్రేడ్‌ యూనియన్‌ ఉద్యమ పితామహుడు లోఖాండేతో కలసి రెైతులను, కార్మికులను సంఘటితం చేసేందుకు ప్రయత్నించాడు. 1873లో ‘గులాంగిరి’ (బానిసత్వం) పుస్తకం ప్రచురించాడు.

దీనిలో అప్పటి పెత్తందారీ వర్గాల అమానుష సూత్రాలను, శూద్రులు- అతి శూద్రుల పై పెత్తందారి వర్గాల క్రూర వెైఖరిని ఫూలే తులనాత్మకంగా పరిశీలించాడు. సహపంక్తి భోజనానికి సంసిద్ధత ప్రకటించాడు. 1883 కల్టివేటర్స్‌ విప్‌కార్డ్‌ (సేద్యగాడిపెై చెర్నకోల) పుస్తక రచన పూర్తిచేశాడు. ఏప్రిల్‌లో బొంబాయిలో జరిగిన ఒక సమావేశంలో పుస్తకాన్ని వినిపించాడు. 1885లో సత్యసారాంశం ప్రచురించాడు. ఇదే సయంలో ప్రచురితమైన తన హెచ్చరిక (వార్నింగ్‌) బుక్‌లెట్‌లో ప్రార్థనా సమాజం, బ్రహ్మసమాజం తదితర  సంస్థలమీద తీవ్ర విమర్శలు చేశాడు.1891లో ఫూలే రచించిన ‘సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకం’ ఆయన మరణాంతరం ప్రచురితమైంది. ఇందులో చాతుర్వర్ణ వ్యవస్థను దుయ్యబట్టాడు. మద్యపానాన్ని వ్యతిరేకించి,1888లో  మద్యం షాపులను మూసి వేయ వలసిందిగా ఉత్తరం వ్రాశాడు. ఆయన వ్రాసిన 33 ఆర్టికల్స్‌ గల సార్వజనిక్‌ సత్యధర్మ పుస్తకంలో కుటుంబ సృష్టి నియమాల గురించి వివరిస్తూ ప్రపంచం మొత్తాన్ని ఒక కుటుంబంగా వ్యక్తీకరించాడు.

ప్రతి ఒక్కరికి సమాన స్వేచ్ఛ హక్కును తీర్మానించాడు. 1879 చివర్లో ‘దీనబంధు’ వారపత్రికను ముంబయిలో స్థాపించాడు. దీనిలో రెైతులు, కార్మికుల సమస్యలు, బాధలు వివరించేవాడు, శెత్కర్యాచ అస్సోడ్‌ పుస్తకం సామాజిక ప్రాముఖ్యం గలది.భారతదేశంలో కులం గురించిన సిద్ధాంతాన్ని శాస్ర్తీయంగా రూపొందించిన తొలి దార్శ నికుడు ఫూలే. దుర్మార్గమైన కులవ్యవస్థ సమూలంగా నిర్మూలన కావాలని ఆయన కోరుకున్నాడు. ఆయన ఆలోచనలరి, విశ్లేషణకి ‘గులాంగిరి’ అద్దం పడుతుంది. మనుషుల చుట్టూ భూస్వామ్య పెత్తందారీ లు చుట్టిన దాస్యపు సంకెళ్ళ నుండి వాళ్ళు విముక్తికావడం, తోటి శూద్రుల నిజపరిస్థితిని బహిర్గతం చేయడం, ఇవి ఏకాస్త విద్యనెైనా నేర్చిన శూద్రసహోదరుల కర్తవ్యాలు. ప్రతిగ్రామంలోనూ శూద్రులకు పాఠశాలలు కావాలి. కానీ వాటిలో చాందస వాద ఉపాధ్యాయులు మాత్రం వద్దన్నాడు.

దేశమనే దేహానికి శూద్రులు ప్రాణం, రక్తనాళాలలాంటి వాళ్ళు అని చెప్పాడు. మహాత్మాఫూలే ఆధునిక భారతదేశ సమాజంలో అందరికంటే గొప్ప శూద్రుడు. హిందూ సమాజంలో భూస్వామ్య పెట్టుబడి పెత్తందారి వర్గాలకు బానిసలుగా బతుకుతున్న కిందికులాల వారిలో తమ బానిసత్వంపట్ల ఆయన చెైతన్యం రగిలించారు. సామాజిక ప్రజాస్వామ్యం సాధించటం భారత దేశానికి ముఖ్యమనే మహత్తర సందేశాన్ని అందించిన మహాత్మ ఫూలే తన గురువు అని డా బి.ఆర్‌. అంబేడ్కర్‌ ప్రకటించారు. దక్షిణాఫ్రికా జాతీయోద్యమ నాయకుడు నెల్సన్‌ మండేలా భారతదేశ పర్యటనకు వస్తున్న సందర్భంలో ఆ మహనీయునికి సమర్పించాలని నిర్ణయించు కొన్న గౌరవ కానుక మహాత్మ ఫూలే రచించిన మహత్తర గ్రంథం ‘గులాంగిరి’. సమాజంలో వెనుకబడినవర్గాల ప్రజలు, మహిళల అభ్యున్నతికోసం చేసినకృషికి ఆయనకు ‘మహాత్మ’ బిరుదు ఇచ్చారు. దీర్ఘకాల జబ్బుతో బాధపడుతూ నిరంతరం సమసమాజ స్థాపన కోసం పరితపించిన మహాత్మ ఫూలే 1890 నవంబరు 28న కన్నుమూశాడు. భారత దేశ సబ్బండ కులాల  సామాజిక మార్పుకోసం తన జీవితకాలాన్ని త్యాగం చేసిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Biography of Mahatma Jyotirao Poole"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0