Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Healthy Heart

 Healthy Heart : ఛాతి నొప్పి మాత్రమే కాదు .. ఈ లక్షణాలు కూడా హార్ట్ స్ట్రోక్కు చిహ్నాలే.

Healthy Heart


Healthy Heart: ఛాతీ నొప్పి వస్తేనే గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయని, లేదంటే తాము సేఫ్ అని చాలా మంది ప్రజలు భావిస్తుంటారు. అయితే, అది తప్పు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

హార్ట్ స్ట్రోక్ లక్షణాల్లో ఛాతి నొప్పి మాత్రమే కాదని, మరికొన్ని లక్షణాలు కూడా ఉన్నాయని వివరిస్తున్నారు. అలాంటి లక్షణాలు ఉంటే గుండెకు సంబంధించి సమస్య ఉన్నట్లేనని చెబుతున్నారు వైద్య నిపుణులు. గుండెకు సంబంధించిన సమస్యల వల్ల శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయని, అలాంటి పరిస్థితుల్లో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. మరి ఆ లక్షణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

తీవ్రమైన అలసట..
మణిపాల్‌ ఆస్పత్రి వైద్యుడు నవీన్‌ చంద్ర మాట్లాడుతూ.. 'ఏదైనా పని చేసిన తర్వాత అలసటగా అనిపించడం గుండె బలహీనత లక్షణం. మీరు ఏదైనా శారీరక శ్రమ చేసిన తర్వాత అలసిపోయినట్లు అనిపిస్తే, ఒత్తిడికి గురైనట్లయితే మీ గుండె బలహీనంగా మారుతుంది అనటానికి నిదర్శనంగా చెప్పొచ్చు. నిరంతరం అలసిపోవడానికి ప్రధాన కారణం గుండె మీ శరీరానికి అవసరమైన రక్తాన్ని సరఫరా చేయలేకపోవడమే. సిరలు మూసుకుపోవడం వల్ల గుండె సరిగ్గా పనిచేయదు.. అలాంటి పరిస్థితుల్లో రక్త ప్రసరణ తగ్గిపోతుంది. ఈ కారణంగా తీవ్రమైన అలసటగా అనిపిస్తుంటుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తగినంత నిద్ర పోతే సరిపోతుంది.' అని చెప్పుకొచ్చారు.

ఉబ్బిన పాదాలు..
పాదాలు అప్పుడప్పుడు వాపు వస్తుంది. దీనికి కారణం గుండె సంబంధిత సమస్యలేనని డాక్టర్ చెబుతున్నారు. శరీరంలోని వివిధ భాగాలలో చెడు రక్తం పేరుకుపోతుందట. ముఖ్యంగా గురుత్వాకర్షణ కారణంగా రక్తం కాళ్లలో గడ్డకట్టడం ప్రారంభం అవుతుందని చెబుతున్నారు.

గురక..
స్లీప్ అప్నియా వంటి పరిస్థితి ఏర్పడటం వల్ల శ్వాస తీసుకోవడంలో అవరోధం ఏర్పడటంతో గురక వస్తుందని డాక్టర్ నవీన్ చెప్పుకొచ్చారు. అయితే, ''గురక రావడానికి ప్రధాన కారణం.. కండరాలు కదలడం ఆగిపోయి శ్వాస తగ్గడం మొదలవుతుంది. ఇది నిద్రలో సమస్యలను కలిగిస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీని కారణంగా రక్తంలో ఆక్సిజన్ పరిమాణం తగ్గడం ప్రారంభమవుతుంది. గుండె సక్రమంగా కొట్టుకోదు.'' అని చెప్పారు.

వేగవంతమైన హృదయ స్పందన..
తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభిస్తంది. అది సాధారణ విషయం. కానీ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా మీ గుండె సాధారణం కంటే ఎక్కువ వేగంతో కొట్టుకుంటే మాత్రం ప్రమాదం పొంచి ఉన్నట్లేనని వైద్యులు చెబుతున్నారు. నిద్రలేమి సమస్య, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం, తీవ్ర భయాందోళనలకు గురైనప్పుడు కూడా ఈ సమస్య రావచ్చు. కొన్నిసార్లు రక్తనాళంలో వాపు వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. హృదయ స్పందనను నియంత్రించే విద్యుత్ ప్రేరణలు సరిగ్గా పని చేయనప్పుడు ఇటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది హృదయ స్పందనలో సమస్యలను సృష్టిస్తుంది. జీవన శైలిలో సరైన మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చని డాక్టర్ నవీన్ తెలిపారు.

భయపడొద్దు..
అయితే, ఈ లక్షణాలున్నాయని కంగారు పడాల్సిన అవసరం లేదని డాక్టర్ నవీన్ చంద్ర సూచించారు. ఈ లక్షణాలు మీకు ఉంటే.. నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం అని సూచించారు. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారంలో మార్పులు, వ్యాయామంలో మార్పులు చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని సూచించారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Healthy Heart"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0