Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Karunya Niyaamakam

కానరాని కారుణ్యం

Karunya Niyaamakam

  • కరోనాతో వెయ్యిమంది టీచర్లు బలి
  • అదేస్థాయిలో ఉద్యోగుల మరణాలువారి కుటుంబాలకు దక్కని కారుణ్యం

ఉద్యోగాలపై ప్రకటనతో సరిపెట్టిన సీఎంఅప్పులు, ఇబ్బందుల్లో కుటుంబాలువైద్య ఖర్చులు తిరిగి చెల్లించని వైనంమట్టి ఖర్చులూ ఇవ్వని జగన్‌సర్కారు

ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నవారిలో ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వడం ఎప్పటినుంచో పాటిస్తున్న ‘కారుణ్య’ పద్ధతి. కొవిడ్‌తో చనిపోయిన కేసులంటే ఇంకాస్త వేగంగా కారుణ్య నియామకాలు చేపట్టాలి. కానీ ప్రభుత్వం ఆ దిశగా జాలి, దయ చూపడంలేదు. ఆస్పత్రి ఖర్చులు, చివరకు మట్టి ఖర్చులూ  చెల్లించడం లేదు.

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి స్వయంగా హుకుం జారీచేశారు. జగన్‌ చెప్పాడంటే అధికారులు చేసేస్తారంతే...అని అనుకున్నారు. కరోనా మరణాలకు సంబంధించిన కారుణ్య నియామకాలపై చేసిన ప్రకటన కావడంతో మరింత నమ్మకం పెట్టుకున్నారు. కానీ, ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన శాఖ ఆదేశాలు ఇచ్చి.. వాటి గడువు దాటిపోయినా ఇంకా బాధిత కుటుంబాలు కన్నీరు పెడుతూనే ఉన్నాయి. 2021 ఆగస్టు నాటికి కొవిడ్‌తో మరణించిన ఉపాధ్యాయులందరికీ కచ్చితంగా కారుణ్య నియామకాలు చేయాలని స్వయంగా ఆయనే ఆదేశించారు. అంతకు కొన్ని నెలల ముందు కారుణ్య నియామకాలు చేయడానికి కొంత సమయం ఉండేలా....ఆగస్టు నెలను డెడ్‌లైన్‌గా పెట్టారు. కానీ ఈ గడువు తీరిపోయి దాదాపు 10నెలలు అవుతోంది. అంతేకాదు...ఆ తర్వాత 2021 అక్టోబరులో జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌ ఒక ఉత్తర్వు జారీచేశారు. కొవిడ్‌తో మరణించిన ప్రభుత్వ ఉద్యోగులందరికీ...నవంబరు 2021లోపు కారుణ్య నియామకాలు ఇవ్వాలని అన్ని శాఖల కార్యదర్శులు, అన్ని విభాగాల అధిపతులకు నిర్దేశించారు. ఆ గడువు కూడా తీరిపోయి నాలుగు నెలలు దాటేసింది. కానీ బాధిత కుటుంబాలకు మాత్రం న్యాయం జరగలేదు.

వారికి కారుణ్య నియామకం కింద ఉద్యోగాలు రాలేదు. ప్రభుత్వ ఉపాధ్యాయులు సహా పలు శాఖల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు పెద్ద సంఖ్యలోనే కరోనా రెండు విడతల్లో చనిపోయారు. అక్కడక్కడా కొంతమందికి మాత్రం కారుణ్య నియామకాలుచేసి.. అత్యధికుల విషయంలో ఇప్పటికీ మొండిచెయ్యే చూపిస్తున్నారు.

మట్టి ఖర్చులూ లేవు..అన్ని శాఖలు, విద్యాశాఖ... కొవిడ్‌తో మరణించినవారి కుటుంబాల్లో అర్హులు ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ ప్రకటించి...దరఖాస్తులు మాత్రం తీసుకున్నాయి. కానీ వారందరికీ కారుణ్య నియామకాలు మాత్రం ఇవ్వలేదు. ఆ దరఖాస్తులు అలా ప్రాసెసింగ్‌లోనే ఉంటూ ఉన్నాయి తప్ప...పరిష్కారం మాత్రం కావడం లేదు. దీంతో కొవిడ్‌ మొదటి దశ, రెండో దశల్లో చనిపోయిన వందల ఉద్యోగులు, ఉపాధ్యాయుల కుటుంబాలు దిక్కులేని పరిస్థితిలోకి వెళ్లిపోయాయి. ఒకవైపు ఆర్థిక కష్టాలు, మరోవైపు కుటుంబాన్ని పోషించేవారే లేని పరిస్థితి, ఇబ్బందులు వర్ణణాతీతం. ఉపాధ్యాయులు ఎవరైనా మరణిస్తే వారికి మట్టి ఖర్చుల కింద రూ.20వేలు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది చిన్న మొత్తమే అయినా...ఆ క్షణంలో ఎంతో అక్కరకు వస్తుంది. అయితే.. ఈ చిన్నపాటి మొత్తాలు కూడా కొవిడ్‌తో ప్రభుత్వ ఉద్యోగులు చనిపోయిన కుటుంబాల్లో కొంతమందికి అందలేదు. ప్రకాశం జిల్లాలో మరణించిన ఒక ఎయిడెడ్‌ ఉపాధ్యాయుడి కుటుంబానికి మట్టి ఖర్చులూ ఇవ్వలేదు. అంతేకాదు...రాష్ట్రంలో పలు శాఖల్లో మరణించిన ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ, ఉపాధ్యాయులకు సంబంధించిన గ్రాట్యుటీల చెల్లింపులు కూడా చేయలేదు. 

ఖర్చు రూ. 23 లక్షల్లో పైసా ఇవ్వలేదుప్రకాశం జిల్లాలో ఒక ఎయిడెడ్‌ స్కూలులో పాఠాలు చెప్పే టీచరుకు కరోనా సోకింది. ఆయనను బతికించుకునేందుకు కుటుంబసభ్యులు అనేక ఆస్పత్రులకు తిప్పారు. సుమారు రూ.23లక్షలు ఖర్చుచేశారు. కానీ కొవిడ్‌తో పోరాడలేక ఆయన మరణించారు. ఆ కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామకం ఇవ్వాలి. అదెలాగూ ఇప్పటివరకూ ఇవ్వలేదు. ఆస్పత్రుల్లో చేసిన ఖర్చును కూడా రీఎంబర్స్‌ చేయలేదు. ఈయనొక్కరే కాదు...ఇలా చాలామంది ఉద్యోగుల కుటుంబాలు ఒకవైపు కొవిడ్‌తో పోషకుడు మరణించి...అదే సమయంలో వైద్య ఖర్చుల కోసం చేసిన అప్పులను తీర్చలేక సతమతం అవుతున్నారు.

కొవిడ్‌తో మృతిచెందిన టీచర్లు : వెయ్యిమందిప్రభుత్వ ఉపాధ్యాయులు : 931ఎయిడెడ్‌ టీచర్లు : 169

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Karunya Niyaamakam"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0