Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Key changes in AP from next academic year Description of how public schools will be

 Education Andhra Pradesh : వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఏపీలో కీలక మార్పులు  ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో వివరణ

Key changes in AP from next academic year Description of how public schools will be

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)ప్రభుత్వ పాఠశాలలు(Government Schools) రాబోయే విద్యా సంవత్సరం నుంచి ఔట్‌ కమ్‌-సెంట్రిక్‌ ఎడ్యుకేషన్‌(ఫలితాల కేంద్రీకృత విద్య)కు మారనున్నాయి.

విద్యార్థులలో సానుకూల ప్రవర్తనా మార్పులను తీసుకురావడానికి, సామాజిక, సహకార నైపుణ్యాలను అభివృద్ధి(Develop) చేయడానికి, విద్యార్థులను ప్రపంచ పౌరులుగా మార్చడానికి ఈ విద్యా విధానం(Education Policy) ఉపయోగపడుతుందని చెబుతున్నారు. జాతీయ విద్యా విధానం 2020(New Education Policy-2020)కి అనుగుణంగా, ఉపాధ్యాయులు(Teachers), ప్రధానోపాధ్యాయులు 'పిల్లల పనితీరు తక్కువగా ఉండటానికి పిల్లలు కారణం కాదు' అనే నినాదాన్ని అనుసరించి పని చేస్తారు.

నూతన జాతీయ విద్యా విధానం అమలుపై దృష్టి

నూతన జాతీయ విద్యా విధానంపై ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు అవగాహన కలిగి ఉండి విద్యార్థుల పనితీరుకు బాధ్యత వహించాలని పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌ సురేశ్‌కుమార్‌ సూచించారు. ఆయన మాట్లాడుతూ..'స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (SCERT)కి విద్యా ప్రమాణాలను నిర్వహించడం, విద్యార్థులందరూ వారి తరగతి, వయస్సుకు సంబంధించి అభ్యాస ఫలితాలను సాధించేలా చూసే బాధ్యతను అప్పగించారు. UN సుస్థిర అభివృద్ధి లక్ష్యాలకు (నాణ్యమైన విద్య) అనుగుణంగా విద్యకు సంబంధించిన ప్రతి ప్రాంతాన్ని పునర్విమర్శ చేయడం, పునరుద్ధరించడం చేయాలన్నారు. నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయడమే ప్రభుత్వ ప్రధాన అంశం' అని కమిషనర్ అన్నారు.

మౌలిక సదుపాయాల పునరుద్ధరణ

లక్ష్యాలను సాధించే ప్రయత్నాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాల మౌలిక సదుపాయాలు పూర్తిగా పునరుద్ధరించారు. కొత్త తరగతి గదులు, స్వచ్ఛమైన టాయిలెట్లు, ఆట స్థలాలు, ఆర్ట్ సెషన్‌లు మొదలైన వాటితో పాటు డిజిటల్ లెర్నింగ్ ఎయిడ్‌లు ఉన్నాయి. సరైన దిశలో ప్రతిభను పెంపొందించే లక్ష్యంతో ఉన్న మరో సంచలనాత్మక కార్యక్రమం కెరీర్ కౌన్సెలింగ్. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు భాగస్వామ్యంతో ఎనిమిదవ తరగతి నుంచి విద్యార్థులకు కెరీర్‌ అవకాశాలపై అవగాహన కల్పిస్తారు.

అన్ని పాఠశాలల్లో అనుకూలమైన అభ్యాస వాతావరణం

పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ..'మన బడి: నాడు-నేడు కార్యక్రమం కింద అన్ని పాఠశాలల్లో నేర్చుకునేందుకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తున్నాం. ప్రభావవంతమైన తరగతి గది ద్వారా పిల్లలలో తగిన అభ్యాస ఫలితాలను పెంపొందించాల్సిన అవసరం ఉంది. ప్రతి తరగతి గదిలో వినూత్నమైన, అర్థం చేసుకొనే విధానంలో పాఠాలో బోధించడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల, ప్రాంతీయ స్థాయిలలోని విద్యా అధికారులతో మాట్టాడాం'. అని చెప్పారు.

ఉపాధ్యాయుల పాత్ర

'పాఠశాల విద్యలో ఏదైనా సంస్కరణను క్షేత్రస్థాయిలో విజయవంతంగా అమలు చేయగలరు, ఎందుకంటే వారు పిల్లలతో మమేకమై వారికి విజ్ఞానాన్ని పంచే ప్రత్యక్ష సహాయకులు. విద్యార్థులకు సులువుగా అర్థం అయ్యేలా సబ్జెక్టులకు సంబంధించిన వినూత్నమైన, సౌకర్యవంతమైన పాఠ్య ప్రణాళికలను సిద్ధం చేయాలి. లెసన్ ప్లాన్‌లో కరెంట్ అఫైర్స్‌తో పాటు ప్రతి సబ్జెక్ట్‌పైన అప్‌డేట్ చేసిన సమాచారం కూడా ఉంటుంది.' అని పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ చెప్పారు.

కో-కరిక్యులర్ యాక్టివిటీస్‌

పాఠ్యేతర కార్యకలాపాల గురించి పాఠశాల విద్యా కమిషనర్ ఎస్ సురేష్ కుమార్ మాట్లాడుతూ.. 'కేవలం విద్యావేత్తలకు మాత్రమే కాకుండా, సహ-పాఠ్య, పాఠ్యేతర కార్యకలాపాలకు కూడా ప్రాధాన్యం ఇచ్చాం. తద్వారా బోధన, అభ్యాసం సమగ్రంగా మారుతాయి. రిమిడియల్ లెర్నింగ్ అనేది మరొక ముఖ్య అంశం. ఇందులో విద్యార్థుల మధ్య వ్యక్తిగత అసమానతలు తొలగుతాయి.' అని ఆయన చెప్పారు.

అకడెమిక్ మానిటరింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి SCERT

RTE చట్టం ప్రకారం పాఠశాల విద్య కోసం అకడమిక్ అథారిటీ అయిన SCERT, అకడమిక్ మానిటరింగ్ సిస్టమ్‌ను రూపొందించి. క్షేత్రస్థాయి అధికారులందరికీ దిశానిర్దేశం, సహకారం అందిస్తుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Key changes in AP from next academic year Description of how public schools will be"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0