Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Good Friday is the day Jesus Christ was crucified

 ఏసు క్రీస్తును శిలువ వేసిన దినం గుడ్ ఫ్రైడే

Good Friday is the day Jesus Christ was crucified


భూమిపై అవతరించిన, పాపులను ద్వేశిం చకు.పాపాలను ద్వేషిం చూ.అన్న ప్రేమ మూర్తి, దైవ కుమారుడు ఏసుక్రీస్తుకు కల్వరిగిరి పై శిలువ చేసిన దినమే శుభ శుక్రవారం ( (good Friday).

క్రీస్తు సువార్త ల ప్రకారం క్రీ.శ.33లో చంద్ర గ్రహణం రోజున అని భావిస్తారు. క్రీస్తు మరణ తాలూకు జ్ఞాపకాలను క్రైస్తవులు జ్ఞాపకం చేసుకునే దినమిది. ఈస్టర్‌ కు ముందు వచ్చే శుక్రవారంను క్రైస్తవులు గుడ్‌ ఫ్రైడే గా జరుపు కుంటారు. దీనినే హోలీ ఫ్రైడే, బ్లాక్‌ ఫ్రైడే, గ్రేట్‌ ఫ్రైడే అని అంటారు. గుడ్‌ ఫ్రైడే పదం Gods Friday నుండి ఉద్భవించిందని కూడా చెపుతారు. ప్రపంచానికి శాంతి దూతగా అందించిన యేసు క్రీస్తును 2100 ఏళ్ల క్రితం ఇదే శుక్రవారం కల్వగిరి గిరి పై శిలువ వేశారు. మానవాళి పాప ప్రక్షాళన కోసం ప్రాణాలను అర్పించిన ఏసు ప్రభువు త్యాగానికి గుర్తుగా క్రైస్తవులు చర్చిలలో శిలువను ఉంచి ప్రార్థిస్తారు. క్రైస్తవ ధర్మాన్ని పాటించేవారు శుభ శుక్రవారం రోజున ప్రాయశ్చిత్తం ప్రార్థనలు, ఉపవాసాలు జరుపు కోవడం ఆచారం. ఏసు క్రీస్తు బోధనల ప్రకారం జీవించే వారిని క్రైస్తవులు అంటారు. పరిశుద్ధ గ్రంథము (హోలీ బైబిల్‌) క్రైస్తవుల పవిత్ర గ్రంథము.

యూదుల మతము

(Judaism) సుమారు క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల్లో (భారత దేశంలో వేద కాలం నడుస్తున్న కాలంలో) ఆవిర్భవించింది. బైబిలు పాత నిబంధనలో మొదటి ఐదు అధ్యాయాలైన ఆది కాండము, నిర్గమ కాండము, లేవీయ కాండము, ద్వితియోపదేశ కాండము, సంఖ్యా కాండము వంటి పుస్తకాలు యూదులు (Jews) కు పవిత్రమైనవి. వీటిని ధర్మశాస్త్ర గ్రంథాలని యూదులు నమ్ముతారు. అయితే కాల క్రమేణా విగ్రహారాధన ఊపందుకొని యూదుల ఆచార వ్యవహారాలు చాలా మార్పులకు లోనయ్యాయి. ఆ కాలంలో యూదులు పాప పరిహారార్థం బలులు అర్పించేవారు. కాలక్రమే ణా యూదుల ఆచారాలలో ధనిక - పేద, యజమాని - బానిస వంటి అసమానతలు, వ్యాధి గ్రస్తుల పట్ల చిన్న చూపు, మూడ నమ్మకాలు ఏర్పడ్డాయి. ఫలితంగా ధర్మ శాస్త్రాన్ని కాలానికి అనుగుణంగా సులభతరం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

యోషయా గ్రంథం రచించబడిన 700 సంవత్సరాల తర్వాత యూదుల కులంలో కన్య మరియ, యేసేపులకు యేసు క్రీస్తు జన్మించాడు. యేసు క్రీస్తు కాలానికి ఇశ్రాయేలు (Israel) దేశం అంతా రోమన్ల (Romans పరిపాలన లోకి వెళ్ళిపోయింది.

బాల్యంనుండే ఆధ్యాత్మిక చింతన అలవర్చుకొన్న ఏసు క్రీస్తు సమాజంలో అణగద్రొక్క బడినవారిని అక్కున చేర్చు కొన్నారు. సంఘ సంస్కర్తగా అప్పటి సమాజంలో మంచి మార్పు తీసుకు రావడానికి ప్రయత్నించారు. రాజ్యాంగం వంటి యూదుల పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని సులభ తరం చేసి క్రొత్త నిబంధనగా బోధించారు. యేసుక్రీస్తు ఆధ్యాత్మిక బోధనలకు పలు యూదులు, మరికొన్ని కులాలవారు ప్రభావితు లయ్యారు. రోమన్‌ సామ్రాజ్యపు రాజులకు, యూదుల్లో మత చాందస్తులకు ఏసుక్రీస్తు బోధనలు నొప్పి కలిగించాయి. యూదుల్లో కొంతమంది మత చాందస్తులు యేసుక్రీస్తును దైవ ద్రోహిగా, దేశ ద్రోహిగా చిత్రీకరించి, చివరికి రోమన్‌ సామ్రాజ్యపు చక్రవర్తికి అప్పగించారు. చక్రవర్తి జూడాల ఆరోపణలను అంగీకరించక పోయినా, ఆయన దేవుని ప్రతి నిధిగా చెప్పు కుంటున్నారని, వివిధ ఆరోపణలను జోడించి వొత్తిడి తెచ్చి, చక్రవర్తి మత ప్రవక్తకులకు వదిలి వేయగా, వారు ఏసు క్రీస్తును అత్యంత కిరాతకంగా శిలువ వేశారు. తర్వాత శిలువ యాగం కారణంగా నిర్యాణం చెందిన ఏసు క్రీస్తును దైవ కుమారుడని యూదు లు, రోమన్స్ అంగీకరించారు.

ఆనాటినుండి క్రైస్తవ్యం అనే మార్గం ప్రపంచ మంతా విస్తరించ సాగింది. క్రీస్తు సమాకాలిక శిష్యులు, భక్తులు క్రొత్త నిబంధన రచించారు.యేసును శుక్రవారం సిలువ వేసి, అనేక విధాలుగా హింసించగా, మూడు రోజుల తర్వాత ఆదివారం అయిన ఆరోజు కూడా ఆయన జీవించి ఉన్నారు. గుడ్‌ ఫ్రైడే తరువాత ఆదివారం ఈస్టర్‌ సండే అని పిలవడానికి కారణం ఇదే."గుడ్‌ ఫ్రైడే" అనేది "బైబిల్‌ లో ఎక్కడా ప్రస్తావించ బడకున్నా", యేసు ప్రభువును శిలువ వేయడాన్ని ప్రస్తావించడం జరిగింది. దానికి గుర్తుగా గుడ్‌ ఫ్రైడేను జరుపు కుంటారు. క్రైస్తవ మతాన్ని అనుసరించే వారి ఇళ్లలో గుడ్‌ ఫ్రైడే కు 40 రోజుల ముందు ప్రార్థనలు శోధన దినాలు (లెంట్ డేస్ )మరియు ఉపవాసం ప్రారంభ మవుతాయి. గుడ్‌ ఫ్రైడే రోజున, ప్రజలు చర్చికి వెళ్లి ప్రభువైన యేసును స్మరిస్తారు. ఆయన ఇచ్చిన విద్యను కూడా గుర్తు చేసుకుంటారు. ఈస్టర్‌ ఆదివారం యేసు జీవించి ఉన్న ఆనందంలో, ప్రజలు ప్రభువు భోజనంలో పాల్గొని ఒకరికొకరు బహుమతులు ఇచ్చి పుచ్చు కుంటారు.*

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Good Friday is the day Jesus Christ was crucified"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0