Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Asani Cyclone

ఏపీకి హైఅలర్ట్.

Asani Cyclone

  • అంచనాలకు అందని అసని తుఫాన్..!
  • డేంజర్ జోన్లో ఈ జిల్లాలు.
  • నేటి ఉదయానికి అమలాపురం సమీపాన తీరాన్ని తాకే అవకాశం
  • అక్కడి నుంచి సముద్ర తీరం వెంట ఈశాన్యదిశలో ముందుకు
  • కోస్తాలో భారీ వర్షాలు
  • గంటకు గరిష్ఠంగా 95 కి.మీ.వేగంతో గాలులు

అసని తుఫాన్ (Asani Cyclone) ఊహించని ట్విస్టులిస్తోంది. టెక్నాలజీకి కూడా అందకుండా దిశలు మారుస్తోంది. 

తొలుత ఉత్తరాంధ్ర వైపు పయనించి ఒడిసా దిశగా సాగుతుందని అంతా భావించినా.. తుఫాన్ గమనం ఉన్నట్లుండి కృష్ణా జిల్లా (Krishna District) మచిలీపట్నం వైపు మళ్లింది..

ప్రస్తుతం తుఫాన్ మచిలీపట్నం-బాపట్ల తీరాల మధ్య కేంద్రీకృతమైంది. ప్రస్తుతం మచిలీపట్నంకు సమీపిస్తున్న తుఫాన్.. 

మంగళవారం మధ్యాహ్నం తుఫాన్ బాపట్ల తీరాన్ని సమీపించడంతో ఒంగోలు, బాపట్ల, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి..

తుఫాన్ ఎఫెక్ట్ తో ఒంగోలు, అద్దంకి, మచిలీపట్నం, దివిసీమ ప్రాంతాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయి. తీరప్రాంతంలో గంటకు 70 కిలోమీటర్ల వరకు తుఫాన్ ఎఫెక్ట్ తీవ్రంగా ఉండే అవకాశముండటంతో 10 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఇవాళ, రేపు ఉమ్మడి కృష్ణ, గుంటూరు..

ఇక బుధ, గురువారాల్లో కృష్ణా, విజయవాడ, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలకు పయనం.

దిశ మార్చుకున్న అసని తుపాను.. కోస్తాంధ్ర తీరానికి దగ్గరగా వచ్చే కొద్దీ అలజడి సృష్టిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా.. అర్ధరాత్రి నుంచి తీవ్రత మరింత పెరగనుంది. బుధవారం ఉదయానికి అమలాపురం-కాట్రేనికోన మధ్య తుపాను తీరాన్ని తాకుతుందని వాతావరణశాఖ అంచనా. ఈ సమయంలో గాలుల వేగం గంటకు 95 కిలోమీటర్లకు పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కోస్తా జిల్లాల్లో కంట్రోల్‌ రూంలు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావం అధికంగా ఉన్న ప్రాంతాల్లో మంగళవారం రాత్రి నుంచే మెరైన్‌ పోలీసులు, జిల్లా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రధాన బీచ్‌లలో ప్రవేశాలను నిలిపేశారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి. తుపాను రక్షిత భవనాలనూ సిద్ధంగా ఉంచారు. కృత్తివెన్ను, నాగాయలంక, మచిలీపట్నం సహా చుట్టుపక్కల రక్షిత భవనాలను అందుబాటులోకి తెచ్చారు. నిజాంపట్నం హార్బర్‌లో ఎనిమిదో నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. అసని తీవ్రతపై కేంద్ర హోం మంత్రిత్వశాఖ అధికారులు సమీక్షించారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయ చర్యల నిమిత్తం ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ దళాలను సిద్ధం చేసినట్లు విపత్తు నిర్వహణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌, డైరెక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ వివరించారు.

కోస్తా తీరానికి దగ్గరగా వచ్చి..

గంటకు 6 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న అసని తీవ్ర తుపాను.. మంగళవారం రాత్రికి కాకినాడకు 190 కి.మీ, విశాఖపట్నానికి 300 కి.మీ, గోపాలపూర్‌కు 530 కి.మీ, పూరీకి 630 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. ఇది వాయవ్యదిశగా ప్రయాణిస్తూ బుధవారం ఉదయానికి కోస్తా తీరానికి దగ్గరగా రానుంది. అమలాపురం- కాట్రేనికోన సమీపంలో తీరాన్ని తాకే అవకాశం ఉంది. అక్కడి నుంచి యానాం మీదుగా ఈశాన్య దిశలో కదులుతుంది. తీరాన్ని తాకే సమయంలో తుపానుగా బలహీనపడుతుంది. అనంతరం కాకినాడ, విశాఖపట్నం దిశగా తీరంలో ముందుకు కదులుతూ నైరుతి బంగాళాఖాతంలోకి చేరి బలహీనపడుతుంది. గురువారం ఉదయానికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది.

అసని తుఫాను లైవ్ అప్డేట్స్ - తుఫాను కదలికలు, మినిట్ టు మినిట్ అప్డేట్స్.

https://bit.ly/asani_alert

ఏ.పి లో పలు తీర ప్రాంత జిల్లాల్లో పింక్ అండ్ రెడ్ అలెర్ట్. ముందు నుండి అంచనాలకు చిక్కకుండా పయనిస్తున్న అసని తుఫాను..

 ఇప్పుడు తుపాను ఎక్కడ ఉందో చూడాలనుకుంటున్నారా?

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Asani Cyclone"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0