Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Vastu Tips

 Vastu Tips : ఆర్ధిక ఇబ్బందులా వాస్తు ప్రకారం . లాఫింగ్ బుద్దాను ఇంట్లో ఇలా ఏర్పాటు చేసుకోగలరు.

Vastu Tips

Vastu Tips: లాఫింగ్ బుద్దాను ( Laughing Buddha) ఇంట్లో వాస్తు ప్రకారం ఉంచడం ద్వారా, జీవితంలోని అనేక సమస్యలు తొలగిపోతాయి. లాఫింగ్ బుద్ధ ప్రాముఖ్యత చైనీస్(China) గ్రంథమైన ఫెంగ్ షుయ్‌లో ఉన్నప్పటికీ, దీని ప్రాముఖ్యత భారతీయ వాస్తు శాస్త్రంలో కూడా చెప్పబడింది.

వాస్తు ప్రకారం, లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఉంచడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. భారతీయ వాస్తు శాస్త్రం ప్రకారం, లాఫింగ్ బుద్ధను వాస్తు ప్రకారం ఇంట్లో ఉంచడం వల్ల సంపద, శ్రేయస్సు లభిస్తుంది. లాఫింగ్ బుద్దా డబ్బుకు సంబంధించినదని అందుకే ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు లాఫింగ్ బుద్దా సాయం చేస్తుందని నమ్మకం. ఇది మాత్రమే కాదు, ప్రజలు ఇంట్లో మాత్రమే కాదు.. వ్యాపారంలో లాభం కోసం కూడా ఆయా ప్లేసెస్ లో ఉంచుతారు. చాలా సార్లు స్నేహితులకు, పరిచయస్థులకు అదృష్టానికి చిహ్నం అంటూ బహుమతిగా ఇస్తారు.

లాఫింగ్ బుద్ధుడు.. బుద్ధుని శిష్యుడు అని జపాన్ వాసుల నమ్మకం. బుద్ధుడి నుండి విద్యను పొందే సమయంలో అతను అకస్మాత్తుగా బిగ్గరగా నవ్వడం ప్రారంభించాడు. అంతేకాదు అతను ఎక్కడ ఉన్నా ప్రజలను నవ్వించడమే తన జీవిత లక్ష్యంగా చేసుకున్నాడు. అయితే ఇంట్లో ఎక్కడ బడితే అక్కడ లాఫింగ్ బుద్ధ ఉంచకూడదు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లాఫింగ్ బుద్ధను ఏ దిశలో పెట్టాలి అనే విషయంపై సరైన అవగాహన కలిగి ఉండడం అవసరం. లాఫింగ్ బుద్ధను ఇంట్లో ఎక్కడ ఉంచుకోవాలో, ఎక్కడ ఉంచకూడదో ఈరోజు తెలుసుకుందాం..

లాఫింగ్ బుద్ధను ఇంట్లో పెట్టె ప్లేసెస్..
లాఫింగ్ బుద్ధ విగ్రహాలు అనేక రకాలుగా అందుబాటులో ఉన్నాయి. అయితే డబ్బు కోసం ఇబ్బంది ఏర్పడితే.. ఇంట్లో డబ్బు కట్ట మోసే లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని పెట్టుకోండి. ఈ విగ్రహాన్ని ఇంటి ప్రధాన ద్వారం ముందు ఉంచాలని నమ్మకం. అంతేకాదు భూమి నుండి 30 అంగుళాలు లేదా గరిష్టంగా 32 అంగుళాల ఎత్తులో విగ్రహాన్ని ఉంచడం మంచిది. ఇలా చేయడం ద్వారా, ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తి తొలగిపోతుంది. డబ్బు ఇబ్బందులు తొలగిపోతాయి.

లాఫింగ్ బుద్ధను పెట్టకూడని ప్లేసెస్..
చాలా సార్లు లాఫింగ్ బుద్ధుని విగ్రహాన్ని ఎక్కడ పెట్టాలనే విషయంపై అవగాహన లేకుండా ఏర్పాటు చేసుకుంటారు. వాస్తు ప్రకారం.. లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని వంటగదిలో, డైనింగ్ ఏరియాలో, పడకగదిలో, టాయిలెట్‌లో అస్సలు పెట్టకూడదు. ఇది ఒక రకమైన పొరపాటు, కొన్ని సార్లు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Vastu Tips "

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0