Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Gas Problem Home Remedies

 పరగడుపున తాగితే పొట్ట శుభ్రం అవ్వటమే కాకుండా గ్యాస్ , అజీర్ణం , మలబద్దకం వంటి సమస్యలు ఉండవు


Gas Problem Home Remedies : ఈ రోజుల్లో మనలో చాలా మందికి మసాలా ఆహారాలు తీసుకున్నప్పుడు, మోతాదుకి మించి ఎక్కువగా ఆహారం తీసుకున్న ప్పుడు, తీసుకున్న ఆహారం జీర్ణం కానప్పుడు గ్యాస్,కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తూ ఉంటాయి.

ఆ సమస్యలు వచ్చినప్పుడు చాలా మంది ఇంగ్లీష్ మందులు వేసుకుంటూ ఉంటారు.

అలా కాకుండా ఇంటి చిట్కాలను ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం వస్తుంది. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే గ్యాస్ సమస్య తగ్గటమే కాకుండా కడుపు కూడా శుభ్రం అవుతుంది. రాత్రి సమయంలో ఒక గ్లాస్ లో నిమ్మకాయలో సగాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఆ తర్వాత అంగుళం అల్లం ముక్కను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి.

ఆ తర్వాత ఒక స్పూన్ సొంపు, రెండు రెమ్మల కరివేపాకు ఆకులను వేసి.గ్లాస్ లో నీటిని పోసి మూత పెట్టి రాత్రంతా అలా వదిలేసి మరుసటి రోజు ఉదయం ఆ నీటిని వడకట్టి తాగాలి. ఈ విధంగా తాగటం వలన పొట్ట శుభ్రం అవ్వటమే కాకుండా గ్యాస్,అజీర్ణం,మలబద్దకం వంటి సమస్యలు ఉండవు.

అలాగే అధిక బరువు సమస్య ఉన్నవారిలో శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది. అంతేకాక శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. గ్యాస్ సమస్య ప్రారంభంలో ఉన్నప్పుడే తగ్గించుకొనే ప్రయత్నం చేయాలి. ఇంటి చిట్కాలు చాలా బాగా సహాయపడతాయి.



SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Gas Problem Home Remedies"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0