Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Name donors for schools .. Clarification to be completed within 2 weeks.

స్కూళ్లకు దాతల పేర్లు పెట్టండి.రెండు వారాల్లో పూర్తి చేయాలని స్పష్టీకరణ.

Name donors for schools .. Clarification to be completed within 2 weeks.

జీవో లక్ష్యాన్ని అధికారులు నీరుగారుస్తున్నారు

ప్రభుత్వ పాఠశాలల( public schools ) అభివృద్ధి కోసం విరాళాలు(Donations) ఇచ్చిన దాతలు లేదా వారు సూచించిన పేర్లను ఆయా పాఠశాలలకు పెట్టాల్సిందేనని హైకోర్టు(High Court) తేల్చి చెప్పింది. రెండు వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. పాఠశాలల అభివృద్ధి కోసం లక్షల్లో విరాళాలు తీసుకొని దాతలు, వారు సూచించిన పేర్లు పెట్టకపోవడం సరికాదని పేర్కొంది. కొంతమంది దాతలు సూచించిన పేర్లను పాఠశాలలకు పెడుతూ, మరికొందరి అప్లికేషన్లను నిబంధనల పేరిట తిరస్కరించడం వివక్ష చూపడమేనని వ్యాఖ్యానించింది. పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలనుకునేవారిని ప్రోత్సహించేందుకు 2004లో అప్పటి ప్రభుత్వం జీవో 162 తీసుకొచ్చిందని, అయితే అధికారుల తీరుతో ఆ లక్ష్యం నీరుగారుతోందని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బట్టు దేవానంద్‌ ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రాపురం గ్రామంలోని ఎంపీపీ ప్రైమరీ(స్పెషల్‌)స్కూల్‌కు కొవ్వూరి సత్యనారాయణరెడ్డి పేరు పెట్టకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కేవీవీ సత్యనారాయణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశా రు. అలాగే ఇదే గ్రామంలో ఉన్న ఎంపీపీ మోడల్‌ ప్రైమరీ స్కూల్‌కు కొవ్వూరి వెంకటరెడ్డి పేరు పెట్టకపోవడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన కుమారుడు కొవ్వూరి వెంకటరామిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి గ్రామంలోని ఎంపీపీ ఎలిమెంటరీ స్కూల్‌కు తేతలి వెంకటరెడ్డి, రెడ్డి సుబ్బాయమ్మ పేరు పెట్టకపోవడంపై వారి కుమారు డు తేతలి ఈశ్వరరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలోని జిల్లా షరిషత్‌ పాఠశాలకు నారపురెడ్డి సీతారామిరెడ్డి పేరు పెట్టాలని కోరుతూ 2021 సెప్టెంబరులో ఇచ్చిన వినతిని పాఠశాల విద్యశాఖ డైరెక్టర్‌ తిరస్కరించడాన్ని సవాల్‌ చేస్తూ ఆయన కుమారుడు ఎన్‌. కిరణ్‌కుమార్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. న్యాయమూర్తి ఇటీవల విచారణ జరిపా రు. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ.. స్మార్ట్‌ విలేజ్‌ కార్యక్రమంలో భాగంగా పిటిషనర్లు పాఠశాలలను దత్తత తీసుకున్నారన్నారు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Name donors for schools .. Clarification to be completed within 2 weeks."

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0