Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

Revolutionary changes in education. Steps towards crowning talent and interest

 విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు . ప్రతిభ , ఆసక్తికి పట్టం కట్టే దిశగా అడుగులు

విద్యా రంగంలో వినూత్నమైన, విప్లవాత్మకమైన మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ (National Educational Policy ) 2020 కి అనుగుణంగా, నేటి సమాజ అవసరాలకు సరిపోయే విధంగా అనేక సంచలనాత్మక చర్యలకు కేంద్ర ప్రభుత్వం రూపు దిద్దుతున్నది.

భారతదేశ అభివృద్ధికి, ప్రపంచ పటంలో భారతశక్తిని ఆవిష్కరించడానికి విద్య కీలక పాత్ర పోషిస్తుందని గ్రహించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అనేక కీలక సంస్కరణలను చేపట్టుతున్నది.  .

చదువుకునే పిల్లలు ఉన్న ప్రతి తల్లి తండ్రి ఈ మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవడం, తమ పిల్లల భవిష్యత్తుకు అవసరమైన నిర్ణయాలు తీసుకుని వారికి మార్గదర్శకత్వం నెరపడం చాలా అవసరం.

లేకపోతే పిల్లలు కొన్ని అమూల్యమైన అవకాశాలను కోల్పోవచ్చు. 

తమ ప్రతిభ మరియు ఆసక్తి అనుగుణంగా ఐచ్చికాలను (options ) ఎంచుకుని విద్యార్థులు విద్యను అభ్యసించే విధంగా అనేక మార్పులకు శ్రీకారం చుట్టడం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఉద్దేశాలలో ప్రధానమైన అంశం. 2030 నాటికి అందరికి విద్య లక్ష్యంగా అడుగులు వేయాలన్నది పాలసీ సంకల్పం. 3 నుంచి 18 సంవత్సరాల వరకు అందరికి విద్య తప్పనిసరి చేయడం. 

6వ తరగతి నుండి ఒకేషనల్ కోర్సులు, కోడింగ్, ప్రోగ్రామింగ్ కోర్సులు ప్రవేశ పెట్టడం, 

ఇంటర్ విద్యను తీసివేయడం, 12 వ తరగతి వరకు స్కూలింగ్, 5+3+3+4 విద్య విధానం, డిగ్రీ విద్య 3 లేదా 4 సంవత్సరాలు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ 1 లేదా 2 సంవత్సరాలు, దేశవ్యాప్తంగా ప్రాథమిక విద్యకు ఒకటే పాఠ్యంశాలు, ఎంఫిల్ తొలగించి పీజీ నుంచి నేరుగా PHD చేసే అవకాశం కల్పించడం, పాఠ్యంశాల భారం తగ్గించి కాన్సెప్ట్స్ నేర్పించే విషయంపై ద్రుష్టి కేంద్రీకరించడం మొదలయిన అంశాలు ప్రధానమయినవి. 

నేషనల్ ఎడ్యుకేషన్ పాలిసీకి అనుగుణంగా కేంద్ర  ప్రభుత్వం మరియు తత్సంబంధిత సంస్థలు అనేక నిర్ణయాలను ప్రకటించడం జరిగింది.  అందులో ప్రధానమయినవి :

కొన్ని ఇంజనీరింగ్ కోర్సులకు మాథెమాటిక్స్ ఇంటర్లో చదివి ఉండాలన్న నిబంధన తొలగించడం 

జాతీయ అంతర్జాతీయ స్థాయి పోటీలలో మరియు  కేంద్ర ప్రభుత్వం గుర్తించిన (ప్రకటించిన లిస్టులో ఉన్న )వివిధ అవార్డ్స్,  scholarships పొందిన విద్యార్థులు ఎంసెట్, JEE మెయిన్ వంటి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయకున్నా, లేదా అవసరమయిన రాంక్ పొందలేకపోయినా వారి ప్రతిభ, ఆసక్తి ఆధారంగా ప్రత్యేక seats ద్వారా  BTech  లో అడ్మిషన్ లభించేలా అవకాశం కల్పించడం  వంటివి ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా AICTE తాజాగా నిర్ణయం తీసుకుంది. IIT వంటి విద్యాసంస్థలలో అడ్మిషన్ పొందడం ఎంత కష్టమో అందరికి తెలిసిందే. కనుక ఇటువంటి మెరిట్ బేస్డ్ అడ్మిషన్స్ కు అవకాశం ఉన్నపుడు సద్వినియోగం చేసుకోవడం తెలివయిన వారి లక్షణం. 

కనుక విద్యార్థులు కేవలం చదువు మాత్రమే కాకుండా వివిధ competitionsలో పాల్గొనడం, extra curricular activities లో పాల్గొనడం వంటి ద్వారా తమ ప్రతిభను అభివృద్ధి చేసుకోవడమే కాకుండా కెరీర్ పరంగా కూడా ప్రత్యేక సదుపాయాలు పొందే అవకాశం అధికంగా ఉంది. 

 

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "Revolutionary changes in education. Steps towards crowning talent and interest"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0