Educational and General Updates కోసం నా వాట్సాప్ నెంబర్ 9390696970 ను మీవాట్సాప్ గ్రూపులో add చేయగలరు www.apedu.in.

Latest information

Teachers Corner

More

Student Corner

More

Sponcerd links

Sponcerd Links

General Information

More

New feature from WhatsApp .. Status update in the chat list!

వాట్సాప్‌ నుంచి కొత్త ఫీచర్‌.. చాట్‌ లిస్ట్‌లోనే స్టేటస్‌ అప్‌డేట్‌!

New feature from WhatsApp .. Status update in the chat list!

వాట్సాప్‌ స్టేటస్‌ గురించి మనందరికీ తెలిసిందే. స్టేటస్‌ ట్యాబ్‌లోకి వెళితే ఎవరెవరు ఏ స్టేటస్‌ పెట్టారో తెలుసుకోవచ్చు. అయితే, ఆ ట్యాబ్‌లోకి వెళితే గానీ ఎవరెవరు ఏం పెట్టారో తెలిసే అవకాశం లేదు. అయితే, వాట్సాప్‌లో కొత్త సదుపాయం రాబోతోంది. ఇకపై మీరు చాట్‌ చేసిన వ్యక్తి స్టేటస్‌ పెడితే ఇట్టే తెలిసిపోతుంది. దీనికి సంబంధించిన అప్‌డేట్‌ త్వరలో రాబోతోందని WA BetaInfo పేర్కొంది. దీనిపై ప్రస్తుతం వాట్సాప్‌ పనిచేస్తోందని, త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురాబోతోందని తెలిపింది.

మన వాట్సాప్‌లో చాట్‌ లిస్ట్‌లో కనిపించే ప్రొఫైల్‌ డీపీపై క్లిక్‌ చేస్తే ఇప్పటి వరకు వారి ప్రొఫైల్‌ పిక్‌ పూర్తిగా కనిపించేది. ఇకపై ఒకవేళ వారు స్టేటస్‌ ఏదైనా పెడితే స్టేటస్‌ పేజీకి వెళుతుంది. ఈ కొత్త ఫీచర్‌ వల్ల మనకు నచ్చిన వారు ఏదైనా స్టేటస్‌ పెడితే వెంటనే తెలుసుకునే వీలుంటుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే ఈ సదుపాయం ఉంది. మరోవైపు వాట్సాప్‌ గ్రూప్‌ పోల్‌ ఫీచర్‌ను సైతం తీసుకొచ్చేందుకు పరీక్షలు జరుపుతోంది. వాట్సాప్‌ గ్రూప్‌లో ఎవరైనా ఒక అంశంపై పోల్‌ నిర్వహించవచ్చు. ఆ పోల్‌లో ఎంత మంది పాల్గొన్నారు? ఏ ఆప్షన్‌ను ఎక్కువగా ఎంచుకున్నారు? వంటి వివరాలు తెలుస్తాయి. అయితే, ఏ వ్యక్తి ఏ అభిప్రాయం వ్యక్తంచేశారనేది మాత్రం తెలుసుకునే వీలుండదు. ఈ సదుపాయం ఎప్పుడు తీసుకొచ్చేది తెలియరాలేదు.

SUBSCRIBE TO OUR NEWSLETTER

Seorang Blogger pemula yang sedang belajar

0 Response to "New feature from WhatsApp .. Status update in the chat list!"

Post a Comment

google.com, pub-2899047411501018, DIRECT, f08c47fec0942fa0